Skip to main content

Posts

ఈ గేమ్ ఆడి మేము ఎక్కడకి వెళ్లాలో మీరే చెప్పండి

భార్య ; భర్తతో ఈ రోజు ఎక్కడికైనా వెళదామా... భర్త  :   ఒకే  వెళ్ళదాము నీకు 9 Options ఇస్తాను అందులో ఒక్కటి select చేసుకోవాలి  భార్య : అలాగే select చేసుకున్నాను. భర్త : select చేసుకున్న number తో 3 గుణించండి  భార్య : అలాగే చేశాను  భర్త : వచ్చినదానికి 3 కూడండి  భార్య : అలాగే చేశాను భర్త : వచ్చిన 2 అంకెలు ( ex. 63= 6+3) కూడాలి  భార్య : అలాగే చేశాను భర్త : వచ్చిన అంకె ఏమిటి ? దానికి తీసుకొని వెళ్ళతాను (1) సినిమా (2) షాపింగ్ (3) రెస్టారెంట్ (4) లాంగ్ డ్రైన్  (5) జూ పార్క్ (6) రిసార్ట్ (7) మీ ఇంటికి (8) మా ఇంటికి (9) ఇంట్లోనే ఉందాం ఈ గేమ్ ఆడి మేము ఎక్కడకి వెళ్లాలో మీరే చెప్పండి 

నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

1. నేనో మూడక్షరాల పదాన్ని. 'గజం’లో ఉంటాను. 'గళం'లో ఉండను. 'రుతువు'లో ఉంటాను. ‘రుజువు'లో ఉండను. 'గోవు'లో ఉంటాను. 'గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను. 'బిరుదు'లో ఉండను. ‘నురుగు’లో ఉంటాను. 'పెరుగు'లో ఉండను. 'రావి'లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. 'గంప'లో ఉంటాను. 'దుంప'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

రాము నిన్న వారంలో ఏ రోజు?

👉🏻 రాము సోమవారాలు, మంగళవారాలు మరియు బుధవారాల్లో అబద్ధం చెప్పాడు, కానీ వారంలో ప్రతి ఇతర రోజులో నిజం చెప్పాడు. 👉🏻 రాజు గురువారాలు, శుక్రవారాలు మరియు శనివారాల్లో అబద్ధం చెప్పాడు, కానీ వారంలో ప్రతి ఇతర రోజులో నిజం చెప్పాడు. రాము: నేను నిన్న అబద్ధం చెప్పాను. రాజు: నేను నిన్న కూడా అబద్ధం చెప్పాను. నిన్న వారంలో ఏ రోజు?

ఆ పేరు ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అబ్బాయి ఒక అతనిని  వారి పేరేమిటి అని అడిగాడు దానికి అతని పేరు 10,1,9,19,18,9,18,1,13 అని చెప్పాడు. అప్పుడు ఆపేరు పలకగానే మిగిలిన వారు అందరూ ఆపేరు ని పలికారు . ఇంతకి  పేరు ఏమిటి ? తెలిస్తే comment చేయండి?

నేనెవర్ని?

నేనెవర్ని? 1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఏనుగు’లో ఉంటాను. 'పీనుగు'లో ఉండను. 'కాలం'లో ఉంటాను. 'కలం’లో ఉండను. 'గ్రహం'లో ఉంటాను. 'గృహం'లో ఉండను. 'తరువు'లో  ఉంటాను. 'బరువు'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం ? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను. 'రుణం'లో ఉంటాను. 'రణం'లో ఉండను. ‘దుప్పి’లో ఉంటాను. 'నొప్పి'లో ఉండను. నేనెవరో తెలిస్తే చెప్పుకోండిచూద్దాం?

సామెతలు

రాయగలరా? కింద తరచుగా వాడే కొన్ని వాక్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో పూరించండి చూద్దాం. (1).  నో _ మంచిదైతే  _ రు మంచిదవుతుంది. (2).  డిల్లీకి రా _ నా  తల్లికి కొ _ కే (3).  అందితే జు _.. అందకపోతే కా _ (4).  తింటే  _ యాసం తినకపోతే _ రసం (5).  ఆ _ లోనే హంస _ దు (6).  న _  నాలుగు విధాల _ టు (7).  వెతకబోయిన తీ _  కాలికి తగిలి _ _