Skip to main content

Posts

చిలిపి ప్రశ్నలు- కొంటి సమాధానములు

చిలిపి ప్రశ్నలు- కొంటి సమాధానములు 1. హారం కాని హారం ఏమిటది. ఫలహారం 2. కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది.  నీడ 3. నగ తొడిగే గింజ ఏమిటది. వేరుశెనగ కాయ 4. తల లేకపోయినా టోపీ ధరించేది ఏమిటది. బాటిల్

భారతదేశ పండుగలపై GK ప్రశ్నలు

భారతదేశ పండుగలపై GK ప్రశ్నలు భారతదేశంలోని పండుగలు దేశం యొక్క గొప్ప వైవిధ్యం మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక, మత మరియు సాంఘిక వేడుకల యొక్క శక్తివంతమైన వస్త్రం. ఈ పండుగలు కేవలం ఉల్లాసానికి సంబంధించిన సందర్భాలు మాత్రమే కాకుండా భారతదేశాన్ని నిర్వచించే సంప్రదాయాలు, నమ్మకాలు మరియు విలువలకు కిటికీలుగా కూడా పనిచేస్తాయి. "భారతదేశంలో పండుగల గురించి GK ప్రశ్నలు" యొక్క ఈ అన్వేషణలో, మేము మీ జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి మరియు విస్తరించడానికి అవకాశాన్ని అందిస్తూ భారతీయ పండుగల రంగుల ప్రపంచాన్ని పరిశీలిస్తాము. దీపావళి యొక్క గొప్పతనం నుండి ఈద్ యొక్క ఆధ్యాత్మికత, హోలీ యొక్క ఐక్యత మరియు నవరాత్రి యొక్క గౌరవప్రదమైన, భారతదేశం యొక్క పండుగలు దేశం యొక్క సంప్రదాయాల వస్త్రాలలో ఒక మనోహరమైన సంగ్రహావలోకనం అందిస్తాయి. ఈ పండుగలకు సంబంధించిన ప్రాముఖ్యత, ఆచారాలు మరియు ఆచారాల గురించి సమాచార మరియు ఆకర్షణీయమైన ప్రశ్నల శ్రేణి ద్వారా మేము విప్పుతున్నప్పుడు మాతో చేరండి. ప్రశ్న. భారతదేశంలో జరుపుకునే దీపాల పండుగ ఏది? జవాబు దీపావళి ప్రశ్న. శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచించే పండుగ ఏది? జవాబు జన్మాష్టమి ప్రశ...

రెండింటికీ ఒకే ఒక్క అక్షరం వస్తుంది అది ఏమిటి ?

👉 వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ లో షి _ కు వెలుతున్నాం. 👉 ప్రతి దానికి _ గటం కాకుండా, బుద్ధిగా అడగడం _  వాటు చేసుకోవాలి. 👉 రవి _ మొదట్లోనే చేయవలసిన పనిని, శని _ వరకూ వాయిదా వేయడం ఎందుకు? 

పొడుపు కథలు

1. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టులేదు. కళ్లున్నాయి చూపులేదు 2. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది. 3. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు. 4. నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది. 5. ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది? 1-5 జవాబులు : 1. కొబ్బరి కాయ 2. ఉప్పు 3. త్రాసు 4. చిచ్చు బుడ్డి 5. తాడిచెట్టు 6. నామము ఉంది గాని పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవర్ని 7. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ? 8. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ? 9. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ? 10. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటి అది ? 6- 10 జవాబులు: 6. ఉడత 7. మునక్కాయ 8. జల్లెడ 9. దానిమ్మ పండు 10. పాలు, పెరుగు, నెయ్యి 11. మూత తెరిస్తే, ముత్యాల పేరు,ఏమిటి అది ? 12. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే, నేను ఎవరిని ? 13. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది!! అదేమిటి? 14. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేనెవర్ని 15. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. 11-15 జవాబులు: 11. దంతాలు 12. దీపం 13. వేరుశనగ కాయ 14. గుడ్డు 15...

కింది వాక్యాలలో " శరీర అవయవాల"కి సంబంధిపదాలు ఉన్నాయి. కనిపెట్టండి.

కింది వాక్యాలలో " శరీర అవయవాల"కి సంబంధిపదాలు ఉన్నాయి. కనిపెట్టండి. 1) నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. 2) అమ్మా! ఈ రోజు పూరీలు చెయ్యి. 3) మా ఇల వేలుపు గంగమ్మ. 4) నాన్న గోరుచిక్కుడు కాయలు తెచ్చాడు. 5) త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి.

నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం.

నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం. 1). నేను నాలుగక్షరాల తెలుగు పదాన్ని.  'జోడు'లో ఉంటాను. 'తోడు'లో ఉండను.  'కారు'లో ఉంటాను. 'కాలు'లో ఉండను.  'వాయువు'లో ఉంటాను. 'ఆయువు’లో ఉండను.  'నక్క'లో ఉంటాను. 'కుక్క'లో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేనో మూడక్షరాల తెలుగు పదాన్ని.  'గానం'లో ఉంటాను. 'మైనం'లో ఉండను.  'కోడి'లో ఉంటాను. 'కోటి'లో ఉండను.  'దమ్ము'లో ఉంటాను. 'సొమ్ము'లో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?.