1. నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని. పవనంలో ఉంటాను. భవనంలో ఉండను. కారులో ఉంటాను. కాలులో ఉండను. వేగులో ఉంటాను. వేళలో ఉండను. ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేనో నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని. మానులో ఉంటాను. పేనులో ఉండను. నక్కలో ఉంటాను. కుక్కలో ఉండను. గోవులో ఉంటాను. గోడలో ఉండను. రేడులో ఉంటాను. రేవులో ఉండను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?