Skip to main content

Posts

గజి బిజి

1. రావుయిపా 2. కొంవడచిలు 3. లులితెతేవిట 4. గుసామిభూ 5. మలిరగా 6. టడుగావే 7. విధుజీసా 8. రంచామాస

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజుకు ఒకసారి మారుతుంది, కానీ క్యాలెండర్ కాదు. దానికోసం పోటీలు పడతారు, ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

పొడుపు కథలు

పొడుపు కథలు 1). అన్నదమ్ములు ముగ్గురు. అలుపు లేకుండా తిరుగుతారు. జ. ఫ్యాన్ 2). తమ్ముడు బంగురుతూ ఒక్క గది దాటేసరికి, అన్న పరుగెత్తుతూ పన్నెండు గదులు పోతాడు. జ. గడియారం 3). దేశాలన్నీ చుట్టేస్తుంది. కానీ దేశంలోకి వెళ్లలేదు. జ. ఓడ

నేను ఎవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ’లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  'గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  'మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం'లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం. 1). ఆరు అక్షరాల English పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు కలిపితే 'ఆమె' అనీ. 3, 2, 5 అక్షరాలను కలిపితే 'కాలి వేలు' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేను ఏడు అక్షరాల English పదాన్ని. మొదటి నాలుగక్షరాలు కలిపితే 'పరీక్ష' అనీ. 6, 3, 4, 5 అక్షరాలు కలిపితే 'దీపం' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? Answers :  1.MOTHER 2. EXAMPLE