Skip to main content

Posts

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?

 👉 ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం? 1. అరచేతిలో _ _ _ చూపినట్లు! 2. అతి వినయం _ _ _ లక్షణం! 3. ఆస్తి మూరెడు.. _ _ _ బారెడు! 4. ఎంత చెట్టుకు అంత _ _ ! 5. _ _ కు తగ్గ బొంత! 6. _ _ వచ్చి పిల్లను వెక్కిరించినట్లు! 7. తిన్న  _ _  వాసాలు లెక్కపెట్టినట్లు! 8. _ _ _ చించుకుంటే కాళ్ళపై పడటు!

ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం. ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి.

👉 కొన్ని తమాషా పదాలున్నాయి. కుడినుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం.ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి. మీరు వీటిని చదివాక.. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి సరేనా! 1. తల- లత 2. రమ మర 3. కలం- లంక 4. కడప- పడక 5. పడగ- గడప 6. పలక కలప 7. కరచు- చురక

నేను ఎవరినో తెలిసిందా?

 1. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4, అక్షరాలు కలిస్తే 'రెక్క' అనీ.. 1, 3, 4, 5 అక్షరాలు కలిస్తే 'పాడు' అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో తెలిసిందా? 2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 6, 8 అక్షరాలు కలిస్తే 'హానికరం' అనీ.. 5, 2, 6 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవర్ని?

1 నుండి100 వరకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో A ఎన్నిసార్లు వస్తుంది ?

 1 నుండి100 వరకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో A ఎన్నిసార్లు వస్తుంది. ఎలా అంటే O N E లో A లేదు ఇలాగే 1 నుండి 100 వరకు A ఎన్నిసార్లు వస్తుందో కనుకొని కామెంట్ చేయండి?

అయన అనుకొన్నవి ఎన్ని రూపాయలు మరియు ఎన్ని పైసలు?

 ఒక అతను బ్యాంక్ కు వెళ్ళి తను అనుకొన్న విధంగా కాకుండా పైసలను రూపాయలుగా మరియు రూపాయలను పైసలుగా చెక్కుమీద వ్రాసి డబ్బుతీసుకొన్నాడు.బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న బిక్షువుకు ఐదు పైసలు దానం చేసినాడు.ఇంటికి వెళ్ళిచూడగా తను అనుకొన్నదానికి రెట్టింపు డబ్బులున్నవి.అయన అనుకొన్నవి ఎన్ని రూపాయలు మరియు ఎన్ని పైసలు?

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు.

 తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు. 1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? జ. గ్రానైట్  2 ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?  జ న్యూస్ పేపర్. 3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?  జ. ఫైరింగ్ 4 అందరూ భయపడే బడి ఏమిటి? జ. చేతబడి 5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి? జ. పుస్తకాలు  6. వీసా అడగని దేశమేమిటి? జ. సందేశం. 7. ఆయుధంలేని పోరాటమేమిటి? జ. మౌనపోరాటం. 8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? జ. పకోడి 9. కనిపించని వనం ఏమిటి?  జ. పవనం.  10. నీరు లేని వెల్ ఏమిటి? జ. ట్రావెల్  11. నారి లేని విల్లు ఏమిటి? జ. హరివిల్లు 12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?  జ. బ్లడ్ బ్యాంక్ 13. వేసుకోలేని గొడుగు ఏమిటి? జ. పుట్టగొడుగు. 14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? జ. బ్రౌన్ షుగర్  15. వేయలేని టెంట్ ఏమిటి? జ. మిలిటెంట్  16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి? జ. శిరోజాలు  17. రుచి లేని కారం ఏమిటి? జ. ఆకారం  18. చారలు లేని జీబ్రా ఏమిటి? జ. ఆల్జీబ్రా  19. అందరూ కోరుకునే సతి ఏమిటి? జ. వసతి. 20. అందరికి నచ్చే బడి ఏమిటి? జ. రాబడి. 21. తాజ్ మహల్ ఎక్కడుంది? జ. భూమ్మీద  22. ఇంటిక...