Skip to main content

Posts

నేనెవరిని?

నెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'గోల'లో ఉంటాను కానీ 'జ్వాల'లో లేను. 'దారి'లో ఉంటాను కానీ 'ఊరి'లో లేను. 'వక్క'లో ఉన్నాను కానీ 'పిక్క'లో లేను. 'గిరి'లో ఉంటాను కానీ 'గిన్నె'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'సందు'లో ఉంటాను కానీ 'విందు'లో లేను. 'పన్ను'లో ' ఉంటాను కానీ 'జున్ను'లో లేను. 'దయ'లో ' ఉంటాను కానీ 'మాయ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

తెలుగు సామెతలు.. ఖాళీలు నింపండి

తెలుగు సామెతలు.. ఖాళీలు నింపండి 1. చెడపకురా _________ 2. అక్కరకు రాని ________ ఎందుకు. 3. అడుక్కుని తినే వాళ్లకు _________ ఊళ్లు. 4. గతిలేనమ్మకు _________ పానకం. 5. నిజము దేవుడెరుగు. నీరు _______ 6. రొట్టె విరిగి ___________ లో పడినట్లు. 7. దినదిన ____________ నూరేండ్ల ఆయుష్షు 8. కుక్క తోక పట్టుకుని _______ ఈదలేం 9. అటైతే కందిపప్పు. ఇటైతే _________ 10. పుణ్యం కొద్దీ పురుషుడు. ______ కొద్దీ బిడ్డలు

ప్రశ్న: ఇప్పుడు ఆ షాపు ఓనర్ మొత్తం ఎంత నష్టపోయాడు?చెప్పుకోండి చూద్దాం..!!

ఒక దొంగ ఒక షాపుకి వెళ్ళి వెయ్యి దొంగతనం చేసి అదే షాపులో 700 సరుకులు కొనగా షాపు ఓనర్ తిరిగి 300 ఇచ్చాడు..!! ప్రశ్న: ఇప్పుడు ఆ షాపు ఓనర్ మొత్తం ఎంత నష్టపోయాడు? చెప్పుకోండి చూద్దాం..!!

తమాషా ప్రశ్నలు - వెరైటీ Answers

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు 👉 తాగలేని రసం ఏమిటి? జ. పాదరసం 👉 పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి? జ. డ్రైవింగ్ స్కూల్ 👉 నడవలేని కాలు ఏమిటి? జ. పంపకాలు 👉 ఆడలేని బ్యాట్ ఏమిటి? జ. దోమల బ్యాట్ 👉 కనిపించని గ్రహం ఏమిటి? జ. నిగ్రహం 👉 భోజనంలో పనికిరాని రసం ఏమిటి? జ. పాదరసం 👉 దున్నలేని హలం? జ. కుతూహలం

నేనెవరో తెలుసా చెప్పుకోండి చూద్దాం

చెప్పగలరా? 1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 1, 6 అక్షరాలను కలిపితే 'యుద్ధం' అవుతాను. 2, 5, 4 అక్షరాలు కలిస్తే 'కొత్త'గా ఉంటాను. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా? 2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు 'అక్షరాలు 'ముగింపు'ను సూచిస్తే.. 1, 3, 5, 6 అక్షరాలు 'కనుగొను' అనే అర్ధానిస్తాయి. నేను ఎవరిని?

గజి బిజి - బిజి గజి

బిజిగజి 👉 ఈ గజిబిజి అక్షరాలను సరిజేస్తే, అర్థవంత పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. (1) కాతాయ (2) గాకూలురయ (3) టిరుచీకాక (4) ఫోటెలిన్ (5) లటీటలు ఆపో (6) గబొంరం (7) రుతిమాచేలు (8) లిపోలుక