Skip to main content

Posts

Top Riddles

(1) పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని? (రామ చిలుక) (2) కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను., తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని? (బొగ్గు) (3) నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు. (సమయం) (4) వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను, చీకటి పడితే మాయమౌతాను. (నీడ)

పొడుపు కథలు

1). పాములను చంపగలను కానీ గద్దను కాదు.. ఒళ్లంతా కళ్లే కానీ ఇంద్రుడిని కాదు.. నాట్యం చేస్తాను కానీ శివుడిని కాదు.. ఇంతకీ నేను ఎవరిని? జవాబు : నె _ లి 2). అమ్మ సోదరుడిని కాను.. అత్తకు భర్తనూ కాను.. కానీ, అందరికీ మామనే. ఎవరినబ్బా? జవాబు : చం _ మామ 3). కొమ్ములుంటాయి కానీ ఎద్దుని కాను.. అంబారీ ఉంటుంది కానీ ఏనుగును కాను.. ఎవరినో చెప్పగలరా? జవాబు : _ త్త 

అటూ - ఇటూ పదాలు ఒక్కటే

కొన్ని తెలుగు పదాలు భలే తమాషాగా ఉంటాయి. వాటిని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు చదివినా.. ఒకేలా ఉంటాయి. ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయగలరేమో ఓసారి ప్రయత్నించండి. (1). న _ న (2). నం _ నం (3). కి _ కి (4). కు _ కు (5). క _ క (6). పు _ పు (7). ము _ ము (8). ము _ ము (9). కం _ కం (10). కం _ కం (11). క _ క (12). క _ క (13). నా _ నా (14). మ _ మ

అతను పర్వత శిఖరానికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?

ఒక వ్యక్తి వంపుతిరిగిన పర్వతం పైకి ఎక్కుతున్నాడు. పర్వత శిఖరానికి చేరుకోవాలంటే 100 కి.మీ ప్రయాణించాలి. ప్రతిరోజూ అతను పగటిపూట 2 కి.మీ ముందుకు వెళ్తాడు. అలసిపోయి, రాత్రి సమయంలో అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి, అతను నిద్రిస్తున్నప్పుడు, పర్వతం వంపుతిరిగినందున అతను 1 కి.మీ వెనుకకు జారిపోతాడు. అప్పుడు అతను పర్వత శిఖరానికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?