Skip to main content

Posts

Who I Am?

నా పేరు చెప్పుకోండి చూద్దాం. 1. నేనో నాలుగక్షరాల తెలుగు పదాన్ని.  'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  ‘మాయ’లో ఉంటాను. ‘మామ'లో ఉండను.  'మలి’లో ఉంటాను. 'తొలి'లో ఉండను.  'మైనం'లో ఉంటాను. 'మైదా'లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేను మూడక్షరాల తెలుగు పదాన్ని.  'వంకాయ’లో ఉంటాను. 'టెంకాయ'లో ఉండను.  'దయ’లో ఉంటాను. ‘లోయ'లో ఉండను.  'వైనం’లో ఉంటాను. 'వైరి'లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు 1. అసలే కోతి, ఆపై కల్లు త్రాగింది, దానికి తోడు తేలు కుట్టింది. 2. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు. 3. ఇల్లు పీకి పందిరేసినట్లు. 4. ఆ కత్తికి పదునెక్కువ. 5. ఏ గాలికి ఆ చాప. 6. ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి 7. ఉత్త కుండకు ఊపులెక్కువ 8. కాసు ఉంటె మార్గం ఉంటుంది. 9. కుక్క నోటికి టెంకాయ అతకదు. 10. కొత్తోకా వింత పాతొక రోత.

Musical Instruments Names దాగి ఉన్నాయి

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని సంగీత వాయిద్యాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి, అవేంటో కనిపెట్టండి చూద్దాం. 1. తను నా స్నేహితురాలు ప్రవీణ.. కలిసి చదువుకుందామని నేనే రమ్మని చెప్పా. 2. మా చెల్లి నవీన, మీ అక్క సమత.. బలాబలాలేంటో రేపు పోటీలో తెలుస్తాయిలే! 3. గత నెలలో భీమడోలు నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ భలే రుచిగా ఉన్నాయి. 4. ఇక్కడున్నంత వరకు కాస్త తగ్గించుకో నీ ఆవేశం.. ఖండాంతరాల ఖ్యాతిని చెడగొట్టుకోకు.

మెదడుకు పదును పెట్టే Puzzle

1) దయ గల వాని ఊరు _ _ పురం 2) బాంబులు పేలే పదార్థంగల ఊరు _ _ పురం 3) తియ్యని ఊరు  _ _ పురం 4) గుంటూరు జిల్లాలో ఆంగ్లేయు - పేరుగల ఊరు  _ _ పురం 5) తెలుగు సినీనటి పేరు గుర్తు చేసే ఊరు     _ _ పురం