Skip to main content

Posts

గజి బిజి

గజి బిజి   కింద కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాయండి చూద్దాం. మీరు కనుక్కోండి చూద్దాం. 1. దితవామి 2. అంరితక్షం 3.ణాంప్రాకంత 4. దకాపవీలం 5. రుగచెవుట్టు 6. ధుఆబంత్మవు 7. వ్వసవ్వలడిము 8. ర్వేజుయదం

సామెతలు

సామెతలు 1). తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట 2). తిక్కలోడు తిరణాళ్లకెళ్తే ఎక్కా దిగా సరిపొయిందంట 3). తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు 4). తినగా తినగా గారెలు చేదు 5). తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది 6). ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు 7). వాపును చూసి బలము అనుకున్నాడట 8). వీపుమీద కొట్టొచ్చు కానీ.. కడుపు మీద కొట్టరాదు 9). వెర్రి వెయ్యి విధాలు

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు. 1). చేతిలో సుత్తి ఉంటే ఏదైనా మేకు లానే కనపడుతుంది. 2). లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట. 3). ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు. 4). డబ్బు మాట్లాడుతుంటే సత్యం మూగ పోతుంది. 5). వసుదేవుడంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు. 6). చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు. 7). కళ్లు కావాలంటాయి కడుపు వద్దంటుంది.

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

1). నేనో నాలుగక్షరాల పదాన్ని.  'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను.  'యోగం'లో ఉంటాను. 'భాగం’లో ఉండను.  ‘మర’లో ఉంటాను. 'అర'లో ఉండను.  ‘మాయం'లో ఉంటాను. ‘మాయ’లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 2). నేనో నాలుగక్షరాల పదాన్ని.  ' శుభం ’లో ఉంటాను. ' లాభం 'లో ఉండను.  ' భాగం 'లో ఉంటాను. ' రాగం ’లో ఉండను.  ‘ కాంత ’లో ఉంటాను. ' తాత 'లో ఉండను.  ‘ క్షణం 'లో ఉంటాను. ‘ బాణం ’లో ఉండను.  ‘ పాలు 'లో ఉంటాను. ‘ పాప ’లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? శుభాకాంక్షలు 

నేను ఎవర్ని

1). అయిదక్షరాల పదాన్ని నేను.  ' పటం'లో ఉంటాను కానీ 'వాటం'లో లేను.  ' దన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను.  ‘ విల్లు'లో ఉంటాను కానీ 'ఇల్లు'లో లేను.  ‘ నోరు'లో ఉంటాను కానీ 'గోరు’లో లేను.  ' దండు'లో ఉంటాను కానీ 'మెండు'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ? 2). నేను నాలుగక్షరాల పదాన్ని.  ' అరక’లో ఉంటాను కానీ 'కాకర’లో లేను.  ' జావ'లో ఉంటాను కానీ 'జామ'లో లేను.  ' తాకట్టు'లో ఉంటాను కానీ 'కనికట్టు'లో లేను.  ' దారం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?