Skip to main content

Posts

నేను ఎవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని.  'సంత’లో ఉంటాను. 'పుంత'లో ఉండను.  'గీటు'లో ఉంటాను. 'గాటు'లో ఉండను.  'గతం'లో ఉంటాను. 'గళం'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'తెప్ప'లో ఉంటాను. 'కప్ప'లో ఉండను.  'రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.  'చారు'లో ఉంటాను. 'కారు'లో ఉండను.  'పది'లో ఉంటాను. 'మది'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో తెలుసా?

నేనెవరు

1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని.  'కంచం'లో ఉంటాను. కానీ 'కలం'లో లేను.  'దశలో ఉంటాను. కానీ 'దిశలో లేను.  'మాసం'లో ఉంటాను కానీ 'మాంసం'లో లేను.  'మనం'లో ఉంటాను. కానీ 'వనం'లో లేను.  ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. అయిదక్షరాల పదాన్ని నేను.  'దారం'లో ఉంటాను. కానీ 'కారం'లో ఉండను.  'నిజం'లో ఉంటాను కానీ 'గజం'లో ఉండను.  'కొమ్మ'లో ఉంటాను. కానీ 'కొత్త'లో ఉండను.  'కాలం'లో ఉంటాను. కానీ 'వేలం'లో ఉండను.  ‘యమున'లో ఉంటాను. కానీ 'జమున'లో ఉండను.  నేనెవర్ని?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేనొక ఐదు అక్షరాల పదాన్ని. దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటా. నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేనొక ఆహార పదార్థాన్ని, నాలోని రెండవ అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చల్లగా ఉంటాను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

అతను పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం

ఒక అమ్మాయి. అబ్బాయిని లిఫ్ట్ అడిగింది. దిగేటప్పుడు అబ్బాయి పేరు అడుగంతుంది.  దానికి అతను 3,8,9,14,20,21 అని సమాధానం ఇస్తాడు. ఇంతకి అతని పేరు ఏమిటది.

నేను ఎవర్ని

1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ'లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  ‘గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  ‘మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం’లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేనెవరో తెలుసా?