Skip to main content

Posts

ప్రశ్నలోనే జవాబు దాగి ఉంది

ప్రశ్నలోనే జవాబు దాగి ఉంది. 1) గోదావరి ప్రాంతంలో పండించే పంట ఏది? 2)శాఖాహారంలో ఉండే ఆభరణం ఏది? 3) శ్వేతవర్ణం అంటే ఏమిటో తెలుపుము? 4) ఈ మైదానంలో ఏ పిండిని పారబోశారు ? 5) ఉత్తరంలో ఉండే దిక్కు ఏది ?

తమాషా ప్రశ్నలు

తమాషా ప్రశ్నలు 1. ఒక్కసారిగా ఆందోళన కలిగించే కలం ఏంటబ్బా? 2. అందరికీ సహాయం చేసే కాలం ఏది? Answers: 1. కలకలం 2. సాయంకాలం

పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం

రెండింటికీ ఒక్కటే పదం ఏమిటో కనుక్కోండి చూద్దాం 1). వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త  _ _ లో షి _ _కు వెలుతున్నాం. 2). ప్రతి దానికి  _ _ గటం కాకుండా, బుద్ధిగాం అడగడం _ _ వాటు చేసుకోవాలి. 3). బాలు _ _  మొదట్లోనే చేయవలసిన పనిని, _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు? 

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని? 1. నేనో మూడక్షరాల పదాన్ని.  'ఆగు’లో ఉంటాను. 'జాగు'లో ఉండను.  'శరణం'లో ఉంటాను. 'చరణం'లో ఉండను.  'మాయం'లో ఉంటాను. 'మాయ'లో ఉండను.  నేనెవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'సంత’లో ఉంటాను. 'పుంత'లో ఉండను.  'మాయ'లో ఉంటాను. ‘మాను’లో ఉండను.  ‘మరుపు'లో ఉంటాను. 'విరుపు'లో ఉండను.  'మైనం'లో ఉంటాను. 'మైకం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

పాత సామెతలు - కొత్త సామెతలు

పాత సామెతలు - కొత్త సామెతలు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం పాత సామెత. మాత్రలతో పోయేదాన్ని ఆపరేషన్ దాకా తెచ్చుకోవడం కొత్త సామెత.

Same Answers

రెండు ఖాళీలలో ఒకే జవాబులు 1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము 2. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు 3. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి 4.  అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను 5. పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారు ఏంటి 6. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు 7. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు 8. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి 9. ఆ రాగి గిన్నె లోని రాగి సంకటి తీసుకుకరా