తెలుగు సామెతలు. 1). చేతిలో సుత్తి ఉంటే ఏదైనా మేకు లానే కనపడుతుంది. 2). లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడట. 3). ఇచ్చేవాడిని చూస్తే, చచ్చినవాడు కూడా లేచి వస్తాడు. 4). డబ్బు మాట్లాడుతుంటే సత్యం మూగ పోతుంది. 5). వసుదేవుడంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు. 6). చింతలు లేకపోతే సంతలోనైనా నిద్రపోవచ్చు. 7). కళ్లు కావాలంటాయి కడుపు వద్దంటుంది.