👉 పొడుపు కథలు తెలుగులో👈 పొడుపు కథలు తెలుగులో, చిక్కు ప్రశ్నలు, పొడుపు ప్రశ్నలు - జవాబులు, తెలుగు పొడుపు కథలు సమాధానాలు, చిన్న పిల్లల కోసం మరియు పెద్దల కోసం. 👉1) ఐదుగిరిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు జవాబు : చిటికెన వేలు 👉2) ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. జవాబు: నిప్పు 👉3) నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని? జవాబు: స్పాంజి 👉4) తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు జవాబు: అక్షరాలు 👉5) నీటితో పంట - ఆకు లేని పంట జవాబు: ఉప్పు 👉6) వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ జవాబు: రామచిలుక. 👉7) దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. జవాబు: దీపం వెలుగు. 👉8) కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది? జవాబు: మేఘం 👉9) తల్లి దయ్యం, పిల్ల పగడం. జవాబు: రేగుపండు 👉10)అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు జవాబు: నిచ్చెన 👉11) చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? జవాబు: ఉల్లిపాయ 👉12)జాన కాని జాన, ఏమి జాన? జవాబు: ఖజాన 👉13) తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? జవాబు: వేరుశె...