Skip to main content

Posts

అక్కడా ఇక్కడా ఒక్కటే

అక్కడా.. ఇక్కడా...  ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి. 👉 ఆ పావు __నీ ఎవరో__తో కొటారు నాన్నా.. 👉 మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాబట్టే _ _నయ్ ను టీచర్ _ _ నందించారు. 👉 _ _ ప ఇంత ఖరీదు అవుతుందని నేను _ _ లో కూడా ఊహించలేదు తెలుసా! 👉 నిన్ను చూసి _ _ లబడి నవ్వినంత మాత్రాన సురేష్ మీద నువ్వు _ _ బడతావా! 👉 ఆదిగో ఆ _ _ నదిలోనే  మన _ _ రాజు పుణ్యస్నానాలు ఆచరించారు. 👉 _ _ తా నీకు _ _ సంఖ్యలంటే ఏంటో తెలుసా? 👉 అర్జున్ అర్ధమవుతోందా _ _.   _ _ సులో  కల్మషం ఉండకూడదు.

100 రూపాయులతో 100 జంతువులు ఎలా కొన్నారు?

 ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఒకరోజు తన కొడుకులకు 100 రూపాయిలు ఇచ్చి మార్కెట్‌కి వెళ్లమని చెప్పాడు. ముగ్గురు కొడుకులు 100 జంతువులను 100 రూపాయలకి కొనాలి. మార్కెట్‌లో కోళ్లు, చికెన్, మేకలు ఉండేవి. ఒక మేక ధర 10, కోడి ధర 5 మరియు కోడి చికెన్ ధర 0.50. ప్రతి సమూహం నుండి కనీసం ఒక జంతువు ఉండాలి. రైతు కొడుకులు జంతువులను కొనడానికి డబ్బు మొత్తం ఖర్చు చేయాలి. 100 జంతువులు ఉండాలి, ఒక్క జంతువు కూడా ఎక్కువ లేదా తక్కువ కాదు!కొడుకులు ఏం కొంటారు? సమాధానం: వారు 100 రూపాయిలు 100 జంతువులను కొనుగోలు చేశారు. 1 మేకను కొనుగోలు చేయడానికి 10 ఖర్చు చేయబడింది. 9 కోళ్లను కొనుగోలు చేయడానికి 45 ఖర్చు చేయబడింది. 90 చికెన్ కొనుగోలు చేయడానికి 45 ఖర్చు చేయబడింది. మొత్తంగా వారు 100 ఖర్చు చేసి 100 జంతువులను కొనుగోలు చేశారు.

అక్కడా ఇక్కడా ఒక్కె అర్దం

 అక్కడా.. ఇక్కడా.. ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల సమూహంలో సరిపోయే పదమే, తరవాతి గడుల్లోనూ సరిపోతుంది.  👉 చింటూ పెరట్లో గడ్డ _ _ తో తవ్విన మట్టిని _ _ బోసి త్వరగా రా. 👉 సు_ _ కు _ _ లేఖనం పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందంటే నమ్మశక్యంగా లేదు. . 👉 చద _ _ లో నన్ను, వీ _ _ లో మా అన్నను మించిన వారు లేరు తెలుసా..? 👉 గాలి _ _  ఎగరేయడమే కాదు.. దాన్ని నేర్పుగా కిందరు దిం _ _ కూడా తెలియాలి. 👉 బడి _ _ కూడా కొట్టారు కానీ, _ - క్రితం నా సైకిల్ను తీసుకెళ్లిన హరి ఇంకా రాలేదే.!

సామెతలు చెప్పుకోండి చూద్దాం

 👉 ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం? 1. _ _ _ _ _అమ్మ అయినా అన్నం పెట్టదు. 2. అడిగేవాడికి _ _ _ _ లోకువ. 3. _ _ _ చెట్టుకే రాళ్ల దెబ్బలు. 4. _ _ _ మేలెంచమన్నారు. 5. కొత్తక _ _ పాతొక రోత. 6. _ _ తోక పట్టుకుని గోదారి ఈదినట్లు.

తమాషా ప్రశ్నలు - 2

 👉 తాజ్ మహల్ ఎక్కడుంది ? జ. భూమిమీద 👉ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? జ. ఇంటరాగేట్ 👉 అంకెల్లో లేని పది?  జ. ద్రౌపది  👉  చేపల్ని తినే రాయి ఏమిటి? జ. కొక్కిరాయి 👉 వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? జ. సెటైర్లు  👉 భార్య లేని పతి ఎవరు ? జ. అల్లోపతి 👉 అన్నం తినకపోతే ఏమవుతుంది? జ. మిగిలిపోతుంది 👉 కూర్చోలేని హాలు ఏమిటి? జ. వరహాలు 👉 తినలేని కాయ ఏమిటి? జ. లెంపకాయ 👉 వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? జ. రిటైర్

నేనెవర్ని - 6

  నేనెవర్ని? 👉 నేను ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 2, 3, 4 అక్షరాలను కలిపితే 'వరుస' అనే అర్థం వస్తుంది. 5, 6, 2, 3, 4 అక్షరాలను కలిపితే 'విసరు' అవుతుంది. 4, 3, 2, 5, 6 అక్షరాలను కలిపితే 'విలువ' అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం? 👉 నేనో ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని. 4, 5, 6, 7 అక్షరాలను కలిపితే 'కచ్చితంగా' అనే అర్థం వస్తుంది. 4, 2, 3 అక్షరాలను కలిపితే 'సముద్రం' అవుతుంది. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?