Skip to main content

Posts

నేనెవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ'లో ఉండను. 'మలి'లో ఉంటాను. 'తొలి'లో ఉండను. 'మైనం'లో ఉంటాను. 'మైదా'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'వంకాయ’లో ఉంటాను. 'టెంకాయ'లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘లోయ'లో ఉండను. 'వైనం’లో ఉంటాను. 'వైరి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

అవి ఏమిటో చెప్పగలరా?

చెప్పగలరా? రామూ వాళ్లింట్లోని ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోవడంతో అక్షరాలన్నీ గజిబిజిగా వచ్చాయి. నిజానికి తాను నాలుగు నగరాల పేర్లు రాశాడు. జాగ్రత్తగా గమనించి, అవేంటో మీరు చెప్పగలరా? D  P  U  A E B R H A T S L I

పొడుపు కథలు 120

పొడుపు కథలు 1). ముసుగేస్తే మూలకు కూర్చుంటాడు. కాగితం కనిపిస్తే మాత్రం కన్నీరు కారుస్తాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? _ న్ను 2). వేలెడంత కూడా ఉండదు. కానీ దాని తోక మాత్రం బారెడు. ఇంతకీ అది ఏంటో తెలుసా? _ ది 3). దెబ్బలు తిని నిలువునా ఎండిపోతుంది.. నిప్పుల గుండం తొక్కి బూడిదవుతుంది. ఏంటది? పి _ క  4). దాన్ని కొడితే ఊరుకోదు.. గట్టిగా అరుస్తుంది.. దేవుడినే పిలుస్తుంది.. అదేంటి? గు _ గంటలు  5). ఇష్టంగా తెచ్చుకుంటారు. చంపి ఏడుస్తారు? ఎ _ గడ్డ  6). అన్నం పెడితే ఎగరదు. పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది? ఇ _ రాకు  7). ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. ఏంటో తెలుసా? పం _ దార  8). రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది? _ న్  9). చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి? ఉ _ ల 10). అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో ఉంటాడు.. ఎవరు? చం _ మామ 11). సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. కానీ, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. అదేంటి? శం _ 12). వారు ముగ్గురన్నదమ్ములు. రాత్రింబవళ్లూ పనిచేస్తూనే ఉంటారు. వారె...

నేను ఎటు ఇటు చదివినా ఒకే విధంగా ఉంటాను అవి ఏమిటి చెప్పుకోండి చూద్దాం ?

ఆంగ్లములో ఇచ్చిన Hints ఆధారంగా ముందు ఆంగ్ల పదమును తదుపరి పదము యొక్క అర్థమును కనుక్కోండి. ఆంగ్లములో నన్ను PALINDROME అంటారు..... నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను.  1. నేను మీ ఇంట్లో ఉంటాను అలాగే మీ కంప్యూటర్ లో ఉన్నాను .... నేను ఏమిటి? 2. నేను రాజు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో విదూషకుడిని .. కానీ నాకు మరో బిరుదు కూడా ఉంది.... నేను ఏమిటి? 3. నేను ఒక పవిత్ర నది_____..నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 4. నేను చింతపండు ని .... నా రుచి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?  5. కొద్దిసేపు నిద్రపోవడం........ ఏమిటో చెప్పుకోండి?  6. చూపించడానికి ( To Show-off).... నేను ఏమిటో చెప్పుకోండి?  7. నేను నీ పాదములో భాగమును... అది ఏమిటో చెప్పుకోండి?  8. అంటే ఆనందం.. నా పేరు ఏమిటి?  9. నేను ఒక పండు & కూరగాయలు కూడా.......నా పేరు.....చెప్పుకోండి? 10. నేను హైబిస్కస్ యొక్క గార్లాండ్ పువ్వులు.నన్ను ఇలా అంటారు అయితే నేను ఏమిటి?

కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత?

ఒక పార్టీలో ఒక అమ్మమ్మ, తండ్రి, తల్లి నలుగురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కొడుకు, ఇద్దరిద్దరు కుమార్తెలు చొప్పున ఉన్నారు. కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత? జవాబు: 14

నేనెవర్ని

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'చలనం’లో ఉన్నాను కానీ 'ప్రజ్వలనం'లో లేను. 'బలి'లో ఉన్నాను కానీ 'బరి'లో లేను. 'చీము’లో ఉన్నాను కానీ ‘నోము’లో లేను. 'మట్టి'లో ఉన్నాను కానీ ‘బట్టి'లో లేను. ‘రైలు’లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను ఆరు అక్షరాల పదాన్ని. 'అంజి'లో ఉన్నాను కానీ 'గంజి'లో లేను. 'తరాజు'లో ఉన్నాను కానీ 'రారాజు'లో లేను. 'సిరి'లో ఉన్నాను కానీ 'పసి’లో లేను. 'క్షమ'లో ఉన్నాను కానీ 'దోమ’లో లేను. 'యాత్ర'లో ఉన్నాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉన్నాను కానీ 'కంది'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేను ఎవరిని

పొడుపు కధ నేను ఐదు అక్షరాల దేవుణ్ణి నేను నడకలో ఉన్నాను కానీ పరుగులో లేను రంభలో ఉన్నాను కానీ మేనకలో లేను సింహంలో ఉన్నాను కానీ పులిలో లేను హరిలో ఉన్నాను కానీ బ్రహ్మలో లేను పాములో ఉన్నాను కానీ తేలులో లేను నా పేరేమిటి?