1) కుప్పకు ముందు, కుస్తీకి వెనుక 2) కుమ్మరవీధిలో కుండ లమ్మినట్లు 3) కులం కన్నా గుణం ప్రధానం 4) కులం చెడినా గుణం దక్కవలె 5) కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట! 6) కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే 7) కూటికి గతి లేదుగాని కుంటెనలకు ముత్యాలు 8) కూటికి తక్కువైనా కులానికి తక్కువా? 9) కూటికోసం కోటి విద్యలు 10) కూడు ఉంటే కూలగోత్రా లెందుకు? 11) కూడు ఉడుకలేదని కుండట్టుక కొట్టాడట! 12) కూర లేని తిండి కుక్క తిండి 13) కూర్చుంటే కుంటి, లేస్తే లేడి 14) కూర్చుంటే లేవలేడుగాని, ఎగిరెగిరి తంతాడట 15) కూర్చుండి తింటూఉంటే కొండయినా కరిగిపోతుంది 16) కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్లు 17) కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట! 18) కొంటే రానిది, కొసరితే వస్తుందా? 19) కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు 20) కొండంత చీకటి - గోరంత దీపం 21) కొండను చూచి కుక్కలు మొరిగినట్లు 22) కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 23) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. 24) ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు. 25) ఇంటికన్నా గుడి పదిలం. 26) ఇంట గెలిచి - రచ్చ గెలువు 27) ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక 28) ఇంటి దీపమని ముద్దుపెట్టుకుంటే మీసాలన్నీ...