Skip to main content

Posts

పదనిస

‘పద’నిస! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. మంచి.      మే _ 2. ఆహారం.  మే _ 3. పోతు        మే _ 4. రాశి        మే _ 5. ఒక పండు మే _ 6. శరీరం.     మే _ 7. ఓ పర్వతం మే _ 8. భవనం. మే _

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? ( 1 ). నేనో అయిదు అక్షరాల పదాన్ని.  తులం లో ఉంటాను. హలం లో ఉండను.  అల లో ఉంటాను. అర లో ఉండను.  సిర లో ఉంటాను. ధర లో ఉండను.  కోటి లో ఉంటాను. తోటి లో ఉండను.  మేట లో ఉంటాను. మేడి లో ఉండను.  ఇంతకీ నేనెవర్ని  చెప్పుకోండి చూద్దాం? ( 2 ). నేనో నాలుగు అక్షరాల పదాన్ని.  చిలుక లో ఉంటాను. ఎలుక లో ఉండను.  రుషి లో ఉంటాను. కృషి లో ఉండను.  జీతం లో ఉంటాను. గతం లో ఉండను.  రావి లో ఉంటాను. రాయి లో ఉండను.  ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని

1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పరుగు'లో ఉంటాను. కానీ 'పెరుగు'లో ఉండను. 'రోగం'లో ఉంటాను. కానీ 'రాగం'లో ఉండను. 'పలక’లో ఉంటాను. కానీ 'గిలక’లో ఉండను. 'కాటుకలో ఉంటాను. కానీ 'ఇటుక’లో ఉండను. 'రంగు'లో ఉంటాను. కానీ 'హంగు'లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జాడ’లో ఉంటాను. కానీ 'జడ’లో ఉండను. 'మనం'లో ఉంటాను. కానీ 'ధనం'లో ఉండను. 'కారం'లో ఉంటాను. కానీ 'బేరం'లో ఉండను. ‘యమున'లో ఉంటాను. కానీ 'జమున’లో ఉండను. నేనెవర్ని?

గజి బిజి

1. పలుజ్ఞాకా 2. ధుత్రుబంలుమి 3. భాహస్నేవం 4. డచులుమంకొం 5. పాలవేశాదఠ 6. చెరుల్లాదుచె 7. ద్వాంలువిసు 8. తోరటచెకు

నేనెవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని. 'పాట'లో ఉంటాను. 'ఆట'లో ఉండను. 'మాయ'లో ఉంటాను. 'మాల'లో ఉండను. 'సంబరం'లో ఉంటాను. 'అంబరం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను. 'కూటి'లో ఉండను. 'బడి'లో ఉంటాను. 'బలం'లో ఉండను. 'పుండు'లో ఉంటాను. 'పండు'లో ఉండను. 'రాజు'లో ఉంటాను. 'రాయి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని?

నేనెవర్ని? 1. నాలుగక్షరాల పదాన్ని నేను. 'తామర'లో ఉంటాను కానీ 'మర'లో లేను. 'రాట్నం'లో ఉంటాను కానీ 'పట్నం'లో లేను. 'జున్ను'లో ఉంటాను కానీ 'దన్ను'లో లేను. 'రవ్వ'లో ఉంటాను కానీ 'రవి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను రెండు అక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను కానీ 'మేటి'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

ఏమి జరిగిందో చెప్పుకోండి చూద్దాం

లాయర్: చూడయ్యా భద్రం మొన్న మీ ఇంట్లో చొరబడిన దొంగల్ని మీరు చూడడం, వాళ్లను పట్టుకోవడానికి మీరు మీ భార్యతో కలిసి ప్రయత్నించిన విషయం కోర్టులో చెబితే దొంగలకు శిక్ష పడుతుంది. భద్రం: మీరు చెప్పింది నిజమే సార్.. ఆ సంగతి నాకూ తెలుసు కానీ.. ఆరోజు మా ఇంట్లో ______________________ తెలిస్తే మా ఆవిడ ఉతికి ఆరేస్తుంది