ఏమిటిది? ఇక్కడున్న ఆధారాల సాయంతో ఆ జీవి పేరేంటో కనుక్కోండి చూద్దాం... (1) నేను చేప కాని చేపను. (2) నా శరీరంలో 95 శాతం నీరే ఉంటుంది. (3) నాకు మెదడు ఉండదు.
1. అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ.. కారు నలుపు ఛాయ.. ఏంటిది? 2. పందొమ్మిది మంది తెల్లని సిపాయిలు.. ఒకే జట్టు? 3. కంటికి కనబడుతుంది. కానీ గుప్పెట్లో పట్టలేం?
మెదడుకు మేత విజయ్ అరకు వెళ్ళాలనుకున్నాడు తన బైక్ లో విశాఖపట్నం నుండి... విశాఖపట్నం ఊరి చివరికి వచ్చేశాడు అక్కడ రెండు రహదారులు ఉన్నాయి. ఒకటి కుడి వైపు వెళ్తుంది, మరొకటి ఎడమ వైపుకు వెళుతుంది. ఇందులో ఒక రోడ్డులో మాత్రమే అరకు కు వెళ్ళవచ్చు. ఆ ప్రదేశంలో ఎటువంటి గుర్తులు కానీ, సైన్ బోర్డుకు కాని లేవు. అక్కడే పక్కన ఒక మర్రిచెట్టు మర్రి చెట్టు నీడలో సురేష్ నరేష్ అనే ఇద్దరు కూర్చున్నారు. వారిలో ఒకడు ఎప్పుడు అపద్ధమే చెబుతాడు, మరొకడు ఎప్పుడు నిజమే చెబుతాడు. ఇప్పుడు విజయ్ వారి సహాయంతో దారి ఎలా కనుక్కున్నాడు?
ప్రజలు నన్ను బయట వెంట్రుకగా భావిస్తారు కానీ లోపల క్రీము మరియు మృదువైనది. మీకు అనుభవం లేకపోతే నేను దొరకడం కష్టం. నేను ఉప్పు ప్రదేశాలలో దొరుకుతాను. నేను "c"తో ప్రారంభించి, "t"తో ముగిస్తాను.
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఊపిరి'లో ఉంటాను కానీ 'పిరికి'లో లేను. 'లయ'లో ఉంటాను. కానీ 'ఈల'లో లేను. 'లత'లో ఉంటాను కానీ 'మమత'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'దారం'లో ఉంటాను కానీ 'ఘోరం'లో లేను. 'పత్తి'లో ఉంటాను. 'కానీ 'సుత్తి'లో లేను. 'బరి'లో ఉంటాను కానీ 'బలి'లో లేను. 'కంచు'లో ఉంటాను కానీ 'మంచు' లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
నేను మీ ప్యాంటు మీద, మీ చొక్కాల మీద మరియు కొన్నిసార్లు మీ నుదిటిపై ఉంటాను. నన్ను చాలా మంది కలిగి ఉన్న వ్యక్తులు చాలా అనుభవజ్ఞులు, కానీ నేను వారి కళ్ళ క్రింద కనిపించినప్పుడు ప్రజలు అసహ్యించుకుంటారు. నేను ఏంటి?
ఒకే పదం కింద కొన్ని వాక్యాలూ, వాటి మధ్య ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే. తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి. 1. ఆకాశంలో _ _ లను చూపిస్తేనే.. మా చిన్నారి సి _ _ ఏడవకుండా అన్నం తింటుంది. 2. ఎదుటివారి మీద _ _ దాక్షిణ్యాలు ఉండాలని నా స్నేహితుడు _ _ కర్ ఎప్పుడూ చెబుతుంటాడు. 3. మా _ _ కూతురు పుట్టినరోజుకు _ _ రు సీసాలు, బొమ్మలు బహుమతులుగా వచ్చాయి. 4. _ _ ఉందంటే.. _ _ డప్పుడు కాదు ఎప్పుడూ మనశ్శాంతి కరవే. 5. _ _ _ కోసం దుకాణానికి వెళదామంటే, ఈ వర్షం అంతకంతకూ _ _ _ తూనే ఉంది.
పొడుపు కథలు 1. రెండు అందమైన కోటలు.. ఒకేసారి కదులుతాయి.. ఒకేసారి నిలబడతాయి. ఏంటవి? 2. అందులో అన్నీ ముక్కలే ఉంటాయి. కానీ, అందరూ కాయ అని పిలుస్తుంటారు. అదేంటి?
ఒక అపార్ట్‌మెంట్ భవనంలోని 100వ అంతస్తులో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. వర్షాకాలం రోజులలో అతను LIFT ద్వారా పైకి ఎక్కేవాడు. అయితే, ఎండాకాలం రోజుల్లో, అతను సగం వరకు వెళ్లి, మిగిలిన మార్గంలో మెట్లు ఎక్కుతాడు. ఎందుకు?
బిజగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. ర్రసవినక 8. షేజభికంలా
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుద్ధి'లో ఉంటాను కానీ 'బుద్ధి'లో లేను. 'క్రమం'లో ఉంటాను కానీ 'భ్రమం'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'రంపం'లో ఉంటాను కానీ 'భూకంపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'గుక్క'లో ఉంటాను కానీ 'కుక్క'లో లేను. 'లాఠీ'లో ఉంటాను కానీ ' ఠీవీ' లో లేను. 'బీర'లో ఉంటాను కానీ 'సొర'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుభం'లో ఉంటాను కానీ 'లాభం'లో లేను. 'క్రయం'లో ఉంటాను కానీ 'భయం'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'రంపంలో ఉంటాను కానీ 'కోపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'అర'లో ' ఉంటాను కానీ 'కర'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'పుణ్యం'లో ఉంటాను కానీ 'పురం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
ఒక వ్యక్తి ఆర్ట్ మ్యూజియంలోకి వెళ్లి పెయింటింగ్ వైపు చూస్తున్నాడు. ఒక గార్డు పైకి వెళ్లి, పెయింటింగ్‌పై మీకు ఎందుకు అంత ఆసక్తి అని అడిగినప్పుడు, అతను ఇలా సమాధానమిచ్చాడు, “సోదర సోదరీమణులారా నాకు ఎవరూ లేరు. అయితే ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి కొడుకు.” పెయింటింగ్‌లో ఉన్న వ్యక్తి ఎవరు?
నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'చింత'లో లేను. 'గీత'లో ఉంటాను కానీ 'రాత'లో లేను. 'గతం'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'వరద'లో ఉంటాను కానీ 'బురద'లో లేను. 'యముడు'లో ఉంటాను కానీ 'భీముడు'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
ఒక ఇంట్లో మూడు ముఖ్యమైన గదులు ఉంటాయి. మొదటిది డబ్బుతో నిండి ఉంటుంది. రెండవది ముఖ్యమైన పత్రాలతో నిండి ఉంటుంది. మూడవది నగలతో నిండి ఉంది. ఒకరోజు ఈ గదులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు మొదట ఏ గదిలో మంటలను ఆర్పారు?
నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'ఆట'లో ఉంటాను కానీ 'పాట'లో లేను. 'దిక్కు'లో ఉంటాను. ''కానీ 'హక్కు'లో లేను. 'వాటా'లో ఉంటాను కానీ 'కోటా'లో లేను. 'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కాటుక'లో ఉంటాను కానీ 'ఇటుకలో లేను. 'నుదురు'లో ఉంటాను కానీ 'వెదురు'లో లేను. 'కవాటం'లో ఉంటాను కానీ 'చేతివాటం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
గజి బిజిగా ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. ర్రసవినక 8. షేజభికంలా
👉 నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. 👉 నాలో 1,2,3,6 కలిపితే ఓ పురాణ గ్రంథం, 👉 4,5,6 - భూభాగం, 👉 1,2,6 - బరువు, 👉 3,2,6 - జీవిత కాలం, 👉 5,2,6 - బాణము అని అర్థం. 👉 ఇంతకీ ఎవరు నేను?
👉 నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 👉 1,7,8,3,2 కలిపితే తప్పు, 👉 2,7,3,4 - తూర్పు, 👉 6,5,4,7,8 - ముఖ్యమైన, 👉 1,7,3,4 - వేగం అని అర్థం. 👉 ఇంతకీ ఎవరు నేను?
1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'అట్లు'లో ఉంటాను కానీ 'తిట్లు'లో లేను. 'మజా'లో ఉంటాను కానీ 'కాజూ'లో లేను. 'లాలన'లో ఉంటాను కానీ 'పాలన'లో లేను. 'పురి'లో ఉంటాను కానీ 'సిరి'లో లేను. 'రంగు'లో ఉంటాను కానీ 'పాలపొంగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కొట్టు'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'నత్త'లో ఉంటాను కానీ 'నక్క'లో లేను. 'గూడు'లో ఉంటాను కానీ 'పోడు'లో లేను. 'దండెం'లో ఉంటాను కానీ ''లేను. నేను ఎవరినో తెలిసిందా?
👉 నరేంద్ర సురేంద్ర సినిమాకి వెళ్ళాలనుకున్నారు. అయితే ఏ షోకి వెళ్లాలీ అనే విషయం మీద నరేంద్ర సురేంద్రతో ఇలా అన్నాడు. 'మనం వెళ్లవలసిన షో సమయం ఇంగ్లిషులో నాలుగు అక్షరాలతో ఉంటుంది. ఆ పదాన్ని తలకిందులుగా చూసినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి నాలుగక్షరాల పదం ఆంగ్లంలో ఇదొక్కటే'. ఇంతకీ వాళ్లు వెళ్లాల్సిన షో ఏది? (Noon)