Skip to main content

Posts

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

 నేనెవర్ని? 👉 నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'మూసీ'లో ఉన్నాను. ' కానీ 'మూస'లో లేను. 'తాటి'లో ఉన్నాను కానీ 'కోటి'లో లేను. 'ఫణి'లో ఉన్నాను కానీ 'మణి'లో లేను. 'బలం'లో ఉన్నాను కానీ 'బల్లి'లో లేను. ఇంతకీ నేనెవరి?

రాయగలరా

 రాయగలరా? ఇక్కడ కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి. I. సూ_రు_ట 2. రేణిగుంట  3. శ్రీ_రి_ట 4. రా_మ__ద్ర_రం  5. రా_చంద్రా_రం  6. కొం_వీ_ 7. _ఠా_రం  8. గా_వా_

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

 నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'బొగ్గు'లో ఉంటాను కానీ 'రగ్గు'లో లేను. 'అబ్బ'లో ఉంటాను కానీ 'అవ్వ'లో లేను. 'అట్లు'లో ఉంటాను.. 'ఇట్లు'లోనూ ఉంటాను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను రెండక్షరాల పదాన్ని. 'భూచక్రం'లో ఉంటాను కానీ 'విష్ణుచక్రం'లో లేను. 'మిద్దె'లో ఉంటాను కానీ 'అద్దె'లో లేను. నేనెవరినో తెలిసిందా?

చిలిపి ప్రశ్నలు

 చిలిపి ప్రశ్నలు 1. ఇది ఐదక్షరాల పదం. దీనికి రెండు అక్షరాలు కలిపితే మరింత పొట్టిగా అవుతుంది. జ) SHORT(er) 2. బుధ, శుక్ర, ఆదివారాలు వాడకుండా వరుసగా వచ్చే మూడు రోజుల పేర్లు చెప్పండి. జ) నిన్న, ఇవాళ, రేపు 3. వాడుతుంటే మిగతావి పనిచేయడం తగ్గుతాయి. కానీ ఇది ఎక్కువగా పనిచేస్తుంది. జ) మెదడు 4. అది నేదే . కానీ నీకంటే ఎక్కువగా ఇతరులు వాడుతారు. జ) నీ పేరు  5. నా పేరు పలకనంత వరకు నేనుంటా. పలికితే ఉండను జ)  నిశ్శబ్దం 6) ఒక ఆసామికి 9 బర్రెలు ఉన్నాయి. ఒకటో బర్రె ఒక శేరు రెండోది రెండు శేర్లు, మూడోది మూడు ఇలా తొమ్మిదో బర్రె 9 శేర్లు పాలిచ్చేవి. ఆ ఆసామి తన ముగ్గురు కొడుకులకు మూడేసి బర్రెల చొప్పున పంచి ఇచ్చాడు. అంతే కాదు, ఒక్కొక్కనికి వచ్చిన మూడు బర్రెలు ఇచ్చే పాలు కూడా సమానమే. అతడు ఎలా పంచాడు? జ) ఈ  పక్క చదరంలో ఒక్కొక్క గడి ఒక బఱ్ఱె అనుకుందాము. అది ఇచ్చేపాలు ఆ గడిలోనే అంకెల్లో చూపాము. ఒకొక్కని వంతుకు మూడు బర్రెలు, 15 శేర్ల పాలు వచ్చాయి. 8 1 6 ------->15 శేర్లు; మూడేసి 3 5 7----->15 శేర్లు; బర్రెలు  4 9 2 -------> 15 శేర్లు

Logical క్వశ్చన్ చెప్పుకోండి చూద్దాం

 చెప్పుకోండి చూద్దాం 1 ఓ పదాన్ని తలకిందులుగా రాసినా అర్థం మాత్రం మారదు.? Hint. SWIMS 2 మనం ఏ రంగులో ఎక్కువ కలలు కంటాం..? Hint. బ్లాక్ అండ్ వైట్  3 దేనికి రంధ్రం చేస్తే.. దానిలో ఉండే రంధ్రాల సంఖ్య తగ్గుతుంది.? Hint. వల  4 What, Where, When ఈ మూడు పదాల్లో ఒక అక్షరం మారిస్తే మూడింటికీ సమాధానం దొరుకుతుంది. ఏంటది..? Hint. T(That, There, Then)

చిలిపి ప్రశ్న

 చిలిపి ప్రశ్న? ఒక function కి 500 మంది వస్తారు కాని సప్లై కంపెనీ వారు అరవై కూర్చీలు మాత్రమే తెచ్చారు 500 మంది వచ్చారు ఒకొక్కరూ ఒకొక్క కూర్చీ లోనే కూర్చున్నారు. అందరికి సరిపోయింది ఎలా ???? 

Quiz

 1. కంగారు పేరు చెప్పగానే ఏ దేశం పేరు గుర్తుకు వస్తుంది? Hint. ఆస్ట్రే_యా  2. ఈఫిల్ టవర్ ఏ దేశంలో ఉంది? Hint. ఫ్రా_ 3. సింహం అరుపును ఏమని పిలుస్తారు? Hint. సింహ గ_న  4. ఎవరెస్టు శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? Hint. _మా__లు  5. చీకటి ఖండం అని దేన్నంటారు? Hint. ఆ_కా