Skip to main content

Posts

నేనెవరో తెలుసా?

నేనెవర్ని? 1. నేను నాలుగక్షరాల తెలుగు పదాన్ని.  'మర’లో ఉంటాను. 'అర'లో ఉండను.  'దోమ'లో ఉంటాను. 'దోర’లో ఉండను.  'కాటు'లో ఉంటాను. 'వేటు'లో ఉండను.  'రంగు'లో ఉంటాను. 'హంగు'లో ఉండను.  ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం? 2. నేనో మూడక్షరాల తెలుగు పదాన్ని.  'విరి’లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'రోగి'లో ఉంటాను. 'యోగి'లో ఉండను.  'ఆయుధం'లో ఉంటాను. 'ఆయుష్షు'లో ఉండను.  ఇంతకీ నేనెవరినో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?

Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం? కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికి వెళ్లొచ్చి ఏడవడం మొదలు పెట్టింది. ఏమైందోనని కంగారుపడి అత్తగారు దగ్గరకు తీసుకుని ఓదార్చి.. విషయం అడిగింది.  అత్తగారు : ఏమైంది కోడలా..! ఎందుకు ఏడుస్తున్నావు? కోడలు : నేను జుట్టు దుబ్బు గడ్డిలా, నా మాట కాకిలా, నా ముక్కు గద్దలా, నేను సిలిండర్లా ఉన్నానా? అత్తగారు : అయ్యయ్యో..! అలా ఎవరన్నారమ్మా..? కోడలు : గుడికి వెళ్లాను కదా..! అక్కడ మన కాలనీ వాళ్లు అచ్చం నువ్వు  ________లా ఉన్నావమ్మా అన్నారు. Question : అక్కడ ఏమి అన్నారని కోడలు ఏడుస్తుంది..Answer ఏమిటో చెప్పుకోండి చూద్దాం? The newly arrived daughter-in-law went to the temple and started crying. Concerned about what happened, mother-in-law consoled her and asked about it.  Mother-in-law:  What happened sister-in-law..! why are you crying  Daughter-in-law:  My hair is like grass, my speech is like a raven, my nose is like a hawk, am I like a cylinder?  Mother-in-law:  Aye..! So wh...

Weight Loss - Belly Fat : బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి

Weight Loss - Belly Fat   : బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇంటర్నెట్ డెస్క్ : సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఊబకాయం బారి నుంచి బయటపడటానికి చాలా మంది అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు. బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది దూరంగా ఉంటారు. అన్నానికి బదులుగా బరువు తగ్గడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నం స్థానంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డాలియా : రవ్వలో ఇంకో రకమే ఈ డాలియా. దీన్ని విరిగిన గోధుమలు అని కూడా అంటారు. 91 గ్రాముల ...

పదనిస

‘పద’నిస! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. మంచి.      మే _ 2. ఆహారం.  మే _ 3. పోతు        మే _ 4. రాశి        మే _ 5. ఒక పండు మే _ 6. శరీరం.     మే _ 7. ఓ పర్వతం మే _ 8. భవనం. మే _

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? ( 1 ). నేనో అయిదు అక్షరాల పదాన్ని.  తులం లో ఉంటాను. హలం లో ఉండను.  అల లో ఉంటాను. అర లో ఉండను.  సిర లో ఉంటాను. ధర లో ఉండను.  కోటి లో ఉంటాను. తోటి లో ఉండను.  మేట లో ఉంటాను. మేడి లో ఉండను.  ఇంతకీ నేనెవర్ని  చెప్పుకోండి చూద్దాం? ( 2 ). నేనో నాలుగు అక్షరాల పదాన్ని.  చిలుక లో ఉంటాను. ఎలుక లో ఉండను.  రుషి లో ఉంటాను. కృషి లో ఉండను.  జీతం లో ఉంటాను. గతం లో ఉండను.  రావి లో ఉంటాను. రాయి లో ఉండను.  ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని

1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పరుగు'లో ఉంటాను. కానీ 'పెరుగు'లో ఉండను. 'రోగం'లో ఉంటాను. కానీ 'రాగం'లో ఉండను. 'పలక’లో ఉంటాను. కానీ 'గిలక’లో ఉండను. 'కాటుకలో ఉంటాను. కానీ 'ఇటుక’లో ఉండను. 'రంగు'లో ఉంటాను. కానీ 'హంగు'లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జాడ’లో ఉంటాను. కానీ 'జడ’లో ఉండను. 'మనం'లో ఉంటాను. కానీ 'ధనం'లో ఉండను. 'కారం'లో ఉంటాను. కానీ 'బేరం'లో ఉండను. ‘యమున'లో ఉంటాను. కానీ 'జమున’లో ఉండను. నేనెవర్ని?