Skip to main content

Posts

Showing posts from March, 2025

నేను ఎవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని.  'సంత’లో ఉంటాను. 'పుంత'లో ఉండను.  'గీటు'లో ఉంటాను. 'గాటు'లో ఉండను.  'గతం'లో ఉంటాను. 'గళం'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'తెప్ప'లో ఉంటాను. 'కప్ప'లో ఉండను.  'రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.  'చారు'లో ఉంటాను. 'కారు'లో ఉండను.  'పది'లో ఉంటాను. 'మది'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో తెలుసా?

నేనెవరు

1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని.  'కంచం'లో ఉంటాను. కానీ 'కలం'లో లేను.  'దశలో ఉంటాను. కానీ 'దిశలో లేను.  'మాసం'లో ఉంటాను కానీ 'మాంసం'లో లేను.  'మనం'లో ఉంటాను. కానీ 'వనం'లో లేను.  ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. అయిదక్షరాల పదాన్ని నేను.  'దారం'లో ఉంటాను. కానీ 'కారం'లో ఉండను.  'నిజం'లో ఉంటాను కానీ 'గజం'లో ఉండను.  'కొమ్మ'లో ఉంటాను. కానీ 'కొత్త'లో ఉండను.  'కాలం'లో ఉంటాను. కానీ 'వేలం'లో ఉండను.  ‘యమున'లో ఉంటాను. కానీ 'జమున'లో ఉండను.  నేనెవర్ని?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేనొక ఐదు అక్షరాల పదాన్ని. దాదాపు ప్రతి పుస్తకంపై ఉంటా. నాలోని మొదటి అక్షరాన్ని తొలగిస్తే నేనొక ఆహార పదార్థాన్ని, నాలోని రెండవ అక్షరాన్ని కూడా తొలగిస్తే నేను చల్లగా ఉంటాను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

అతను పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం

ఒక అమ్మాయి. అబ్బాయిని లిఫ్ట్ అడిగింది. దిగేటప్పుడు అబ్బాయి పేరు అడుగంతుంది.  దానికి అతను 3,8,9,14,20,21 అని సమాధానం ఇస్తాడు. ఇంతకి అతని పేరు ఏమిటది.

నేను ఎవర్ని

1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ'లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  ‘గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  ‘మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం’లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేనెవరో తెలుసా?

ఎలాంటి సంబంధంమో చెప్పుకోండి చూద్దాం?

గోలు బోలుని కుమారుడు. శీతల్ గోలు కూతురు. చిత్ర దిలీప్ కుమార్తె మరియు దిలీప్ బోలా సోదరుడు. శీతలికి చిత్రకి ఎలాంటి సంబంధంమో చెప్పుకోండి చూద్దాం? A. సోదరి B. తల్లి C. అత్త  D. అత్తయ్య

విచిత్రమైన ప్రశ్నలు

విచిత్రమైన ప్రశ్నలు - సినిమా హాల్లో చూసి మీరూ సినిమాకే వచ్చారా? - సిటీ బస్సులో కాలు తొక్కి సారీ అండి, నొప్పిగా ఉందా? - అర్ధరాత్రి ఫోన్ చేసి ఏంటి పడుకున్నారా? - బార్బర్ షాప్ నుంచి వస్తుంటే ఏంటి, హెయిర్ కట్కి వచ్చారా? - ఆస్పత్రిలో బెడ్పై ఉన్నప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా? - ఇంట్లో ల్యాంగ్ ఫోన్ కి కాళ్ చేసి ఎక్కడున్నారు?

తప్పులను సరిదిద్దగలరా

ఇక్కడున్న పదాల్లో ఒక్కో అక్షర తప్పుగా ఉంది. వాటిని సరిజేయండి చూద్దాం. 1. పరిచయలు 2. చల్లగాలలు 3. గోదుమపిండి 4. చక్కిలిగింతలు 5. కటోరసాధన 6. ఆలక 7. పణిమంతుడు 8. మధురఫలం 9. ఏనుగుతోండం 10. మ్రుగరాజు 11. జమిందారు

Puzzles

Puzzles రెండు ఖాళీలలో ఒకే Answers రావాలి. 1).  _______ గా ఉన్నచోట ఈ వేప ________ వేయండి. 2). ఆ _______ గిన్నెలోని _________  సంకటి తీసుకురా.

ఆ పదం ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?

ఒకే పదం అన్ని ఖాళీలలో సరి పోతుంది.ఆ పదం ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? ఈ శని _____ రోజు,  మా ఇంట్లో జరిగే పెళ్లికి,  మా పరి ____ మొత్తాన్ని,  ఒక ____ ముందే రమ్మని పిలిచాము.

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు కనుక్కోండి చూద్దాం

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు కనుక్కోండి చూద్దాం  ఈ వాక్యాల్లో కొంత మంది వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోట చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం? 1. ఈ చలిలో వణుకుతూ వచ్చే బదులు నిదానంగా సూర్యుడు వచ్చాకే రావొచ్చుగా తాత. 2. సరిగ్గా చదవకుంటే.. వీపు విమానం మోత మోగుతుంది. 3. ఒక్క నిమిషం ఆగి వింటే తెలుస్తుంది.. సరిగమల గొప్పతనం. 4. ఇటు రా.. కాస్త ఆ గాజు బొమ్మ నెమ్మదిగా చేతికి అందివ్వు. 5. కదలకుండా ఉండు.. చేతి మీద వాలింది పే..ద్ద దోమ. అసలేంటో వీటి గోల. Answer . 1. వనిత 2. సరిత 3. గిరి 4. రాజు 5. కమల