Skip to main content

Posts

పొడుపు కథలు

 పొడుపు కథలు 1. నీరు లేని సముద్రాన్ని తెర చాప లేని ఓడ ఓపిగ్గా దాటించేస్తుంది. ఏంటది? 2. ఎంతెంతో వింత బండి. ఎగిరిపోయెనుసుమండి. మండుతూ మండుతూ మాయమయ్యెనండి? 3. చిత్రమైన చీర కట్టి, షికారుకెళ్లిందో చిన్నది. పూసిన వారింటికే కాని, కాసిన వారింటికి పోనే పోదు?

చెప్పుకోండి చూద్దాం

👉 1) మీ సెల్ ఫోన్ నెంబర్ లో నీ చివరి అంకెను తీసుకుని  👉 2) దాని 2 తో గుణించండి (X)  👉 3) ఆ మొత్తానికి 5 ను కూడండి (+)  👉 4)  ఈ మొత్తాన్ని 50 తో గుణించండి (X)  👉 5)  వచ్చిన మొత్తాని 1772తో కూడండి (+)  👉 6) ఆ వచ్చిన మొత్తం లో నుండి మీరు పుట్టిన సంవత్సరాని తీసేయండి (-) 👉 7) ఇప్పుడు 3 అంకెలు వస్తాయ్  👉 8) ఆ 3 అంకెల్లో మొదటి అంకె మీ సెల్ ఫోన్ లో నీ చివరి అంకె. మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత Age/ ఆశ్చర్యం కదా Friends

చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు... 👉 1) అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసేది ఏవరు? జ) ట్రాఫిక్ పోలీస్ 👉 2) బస్సు ఎక్కేవాడు దిగేవాడికి ఏమౌతాడు..?  జ) ఎదురవుతాడు 👉 3) వాట్సాప్ ద్వారా డబ్బు సంపాదించాలంటే. జ)  వాట్సాప్ తీసేసి పనిచేయాలి 👉 4) షూట్ చేసినా శిక్ష పడని వాడు. జ) ఫోటోగ్రాఫర్  👉 5) ఎన్ని డబ్బులున్నా ఖర్చుపెట్టలేని వాడు -  జ) బ్యాంకు క్యాషియర్ 👉 6) భయం లేకుండా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేది  జ) పోస్టు మ్యాన్

చెప్పుకోండి చూద్దాం

🌹 చెప్పుకోండి చూద్దాం 🌹 👉నేను 8 అక్షరాల పదం 👉మొదటి 4 అనేది ప్రశ్న 👉2,3,4 మన తలను రక్షిస్తుంది 👉6,7,8 ఒక సాఫ్ట్‌వేర్ 👉7,8 ఒకే అక్షరాలు. నేను ఎవరు....?? సూచన : మీరు ప్రతిరోజూ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

చిలిపి ప్రశ్నలు

  Skip to ccoco 👉1. మే నెలలో పుట్టిన నత్త ? జవాబు: మేనత్త! 👉2. దుర్గకి పట్టిన గతి ? జవాబు: దుర్గతి!   👉3. కోడి కాని కోడి ? జవాబు: పకోడి  👉4. పండు కాని పండు ? జవాబు: విభూది పండు!   👉5. కాయ గాని కాయ ? జవాబు: తలకాయ్!   👉6. హారం గాని హారం? జవాబు: ఫలహారం!   👉7. పురం గాని పురం? జవాబు: కాపురం!   👉8. దానం గాని దానం? జవాబు: మైదానం!   👉9. మామ గాని మామ? జవాబు: చందమామ!   👉10. రసం గాని రసం? జవాబు: నీరసం   👉11. రాజు గాని రాజు జవాబు: తరాజు   👉12. కారం కాని కారం జవాబు: ఉపకారం   👉13. రాగి కాని రాగి  జవాబు: బైరాగి   👉14. కోడి కాని కోడి  జవాబు: పకోడీ   👉15. తారు కాని తారు  జవాబు: జలతారు   👉16. మామ కాని మామ  జవాబు: చందమామ   👉17. తాళి కాని తాళి  జవాబు: ఎగతాళి   👉18. దారా కాని దార జవాబు: పంచదార   👉19. నత్త కాని నత్త  జవాబు: మేనత్త   👉20. జనము కాని జనము  జవాబు: భోజనము   👉21. రాయి కాని రాయి  జవాబు: కిరాయి   👉22. నాడ కాని నాడ జవాబు: కాకినాడ  ...

చెప్పుకోండి చూద్దాం?

 చెప్పుకోండి చూద్దాం? సీత, గీత, రీట ముగ్గురూ మూడు రకాలైన పూలమొక్కల్ని నాటారు. ఇక్కడున్న ఆ మొక్కల్లో సీత పసుపు రంగు పూలమొక్కలని నాటలేదు. గీత మల్లె మొక్క నాటలేదు. సీత నాటిన మొక్క పేరు డిక్షనరి లో రీట, గీత నాటిన మొక్కల పేర్ల కంటే ముందే వస్తుంది. ఏ మొక్క ఎవరు నాటారు. చెప్పుకోండి చూద్దాం?

చిక్కు ప్రశ్న

 చిక్కు ప్రశ్న  ఐదుగురు వ్యక్తులు యాపిల్స్ తింటున్నారు, A కి ముందు B పూర్తి చేసారు, కానీ C. D వెనుక E ముందు పూర్తి చేసారు, కానీ B వెనుక. ముగింపు క్రమం ఏమిటి?