Skip to main content

Posts

Showing posts from March, 2024

నేనెవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ'లో ఉండను. 'మలి'లో ఉంటాను. 'తొలి'లో ఉండను. 'మైనం'లో ఉంటాను. 'మైదా'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'వంకాయ’లో ఉంటాను. 'టెంకాయ'లో ఉండను. ‘దయ’లో ఉంటాను. ‘లోయ'లో ఉండను. 'వైనం’లో ఉంటాను. 'వైరి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

అవి ఏమిటో చెప్పగలరా?

చెప్పగలరా? రామూ వాళ్లింట్లోని ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోవడంతో అక్షరాలన్నీ గజిబిజిగా వచ్చాయి. నిజానికి తాను నాలుగు నగరాల పేర్లు రాశాడు. జాగ్రత్తగా గమనించి, అవేంటో మీరు చెప్పగలరా? D  P  U  A E B R H A T S L I

పొడుపు కథలు 120

పొడుపు కథలు 1). ముసుగేస్తే మూలకు కూర్చుంటాడు. కాగితం కనిపిస్తే మాత్రం కన్నీరు కారుస్తాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? _ న్ను 2). వేలెడంత కూడా ఉండదు. కానీ దాని తోక మాత్రం బారెడు. ఇంతకీ అది ఏంటో తెలుసా? _ ది 3). దెబ్బలు తిని నిలువునా ఎండిపోతుంది.. నిప్పుల గుండం తొక్కి బూడిదవుతుంది. ఏంటది? పి _ క  4). దాన్ని కొడితే ఊరుకోదు.. గట్టిగా అరుస్తుంది.. దేవుడినే పిలుస్తుంది.. అదేంటి? గు _ గంటలు  5). ఇష్టంగా తెచ్చుకుంటారు. చంపి ఏడుస్తారు? ఎ _ గడ్డ  6). అన్నం పెడితే ఎగరదు. పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది? ఇ _ రాకు  7). ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. ఏంటో తెలుసా? పం _ దార  8). రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది? _ న్  9). చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి? ఉ _ ల 10). అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో ఉంటాడు.. ఎవరు? చం _ మామ 11). సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. కానీ, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. అదేంటి? శం _ 12). వారు ముగ్గురన్నదమ్ములు. రాత్రింబవళ్లూ పనిచేస్తూనే ఉంటారు. వారె...

నేను ఎటు ఇటు చదివినా ఒకే విధంగా ఉంటాను అవి ఏమిటి చెప్పుకోండి చూద్దాం ?

ఆంగ్లములో ఇచ్చిన Hints ఆధారంగా ముందు ఆంగ్ల పదమును తదుపరి పదము యొక్క అర్థమును కనుక్కోండి. ఆంగ్లములో నన్ను PALINDROME అంటారు..... నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను.  1. నేను మీ ఇంట్లో ఉంటాను అలాగే మీ కంప్యూటర్ లో ఉన్నాను .... నేను ఏమిటి? 2. నేను రాజు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో విదూషకుడిని .. కానీ నాకు మరో బిరుదు కూడా ఉంది.... నేను ఏమిటి? 3. నేను ఒక పవిత్ర నది_____..నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 4. నేను చింతపండు ని .... నా రుచి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?  5. కొద్దిసేపు నిద్రపోవడం........ ఏమిటో చెప్పుకోండి?  6. చూపించడానికి ( To Show-off).... నేను ఏమిటో చెప్పుకోండి?  7. నేను నీ పాదములో భాగమును... అది ఏమిటో చెప్పుకోండి?  8. అంటే ఆనందం.. నా పేరు ఏమిటి?  9. నేను ఒక పండు & కూరగాయలు కూడా.......నా పేరు.....చెప్పుకోండి? 10. నేను హైబిస్కస్ యొక్క గార్లాండ్ పువ్వులు.నన్ను ఇలా అంటారు అయితే నేను ఏమిటి?

కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత?

ఒక పార్టీలో ఒక అమ్మమ్మ, తండ్రి, తల్లి నలుగురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క కొడుకు, ఇద్దరిద్దరు కుమార్తెలు చొప్పున ఉన్నారు. కుటుంబంలోని ఆడవారి సంఖ్య ఎంత? జవాబు: 14

నేనెవర్ని

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'చలనం’లో ఉన్నాను కానీ 'ప్రజ్వలనం'లో లేను. 'బలి'లో ఉన్నాను కానీ 'బరి'లో లేను. 'చీము’లో ఉన్నాను కానీ ‘నోము’లో లేను. 'మట్టి'లో ఉన్నాను కానీ ‘బట్టి'లో లేను. ‘రైలు’లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను ఆరు అక్షరాల పదాన్ని. 'అంజి'లో ఉన్నాను కానీ 'గంజి'లో లేను. 'తరాజు'లో ఉన్నాను కానీ 'రారాజు'లో లేను. 'సిరి'లో ఉన్నాను కానీ 'పసి’లో లేను. 'క్షమ'లో ఉన్నాను కానీ 'దోమ’లో లేను. 'యాత్ర'లో ఉన్నాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉన్నాను కానీ 'కంది'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేను ఎవరిని

పొడుపు కధ నేను ఐదు అక్షరాల దేవుణ్ణి నేను నడకలో ఉన్నాను కానీ పరుగులో లేను రంభలో ఉన్నాను కానీ మేనకలో లేను సింహంలో ఉన్నాను కానీ పులిలో లేను హరిలో ఉన్నాను కానీ బ్రహ్మలో లేను పాములో ఉన్నాను కానీ తేలులో లేను నా పేరేమిటి?

నేను ఎవరినో చెప్పుకోండి చూద్దాం

నేనో నాలుగు అక్షరాల తెలుగుపదాన్ని. మొదటి రెండక్షరాలకు 'వాయువు' అని అర్థం. చివరి రెండక్షరాలకు 'యంత్రం' అనే అర్థం వస్తుంది. ఇప్పటికైనా నేనెవరో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు? 2. విత్తనం లేకుండా మొలిచేది? 3. కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది? 4. ఒక పెట్టెలో ఇద్దరు పోలీసులు ఏంటవి? 5. ఎలకలు తినని పాము పంట పొలంకు ప్రియుడు ఏంటది? 1. చంద్రుడు 2. గడ్డము 3. నీడ 4. వేరు శెనకాయ 5. వానపాము

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు 1. అసలే కోతి, ఆపై కల్లు త్రాగింది, దానికి తోడు తేలు కుట్టింది. 2. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు. 3. ఇల్లు పీకి పందిరేసినట్లు. 4. ఆ కత్తికి పదునెక్కువ. 5. ఏ గాలికి ఆ చాప. 6. ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి 7. ఉత్త కుండకు ఊపులెక్కువ 8. కాసు ఉంటె మార్గం ఉంటుంది. 9. కుక్క నోటికి టెంకాయ అతకదు. 10. కొత్తోకా వింత పాతొక రోత.

అక్కడా... ఇక్కడా....

1. ఈ _ _వారమే మా నాట్య _ _వు 50వ పుట్టినరోజు. 2. ఆ _ _ మీద _ _ ముచ్చులు ఎక్కువగా ఉన్నాయట. 3. కాళ్లకు _ _ లు పెట్టుకుంటే.. మా అమ్మ పల్లి _ _ లు ఇచ్చింది. 4. అది సినిమా చూసే _ _. దోమ_ _  అనుకొని తీసుకొచ్చేశావా ఏంటి?

తెలుగు కి సమాన ENGLISH పదం ఏమిటి?

1. వీధి                    _ _ _EE _ 2. అవసరం             _ EE _ 3. ఉచితం               _ _ EE 4. చక్రం                   _ _EE _ _ 5. కుందేలు              _ _ BB _ _ 6. బుడగ                  _ _ BB _ _ 7. దొంగతనం            _ _ BB _ _ _ 8. గొడవ                  _ _ _ _ BB _ _

రాము రోజూ వరుసగా ఎన్నేసి చాక్లెట్లు తినాలో చెప్పగలరా?

రాము దగ్గర 100 చాక్లెట్లు ఉన్నాయి. వాటిని అయిదు రోజుల్లో తినాలి. మొదటి రోజు తిన్న చాక్లెట్లకంటే రెండో రోజు ఆరు ఎక్కువగా తినాలి. రెండో రోజుకంటే మూడోరోజు మరో ఆరు ఎక్కువగా....ఈ పద్దతిలో రోజూ తినాలి. అయితే అతడు రోజూ వరుసగా ఎన్నేసి చాక్లెట్లు తినాలో చెప్పగలరా? జవాబు: 8+14+ 20+ 26 + 32

తమాషా ప్రశ్నలు?

తమాషా ప్రశ్నలు! 1. రక్తం చిందని యుద్ధ రంగం? 2. పగలు కూడా కనిపించే నైట్? 3. చంపేసే రింగ్? 4. భయపెట్టే వరం? 5. గుర్తు చేసే కాలు?

నేనెవర్ని?

నేనెవర్ని? 1. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'స్వశక్తి'లో ఉన్నాను కానీ 'స్త్రీశక్తి'లో లేను. 'యంత్రం'లో ఉన్నాను కానీ ‘తంత్రం’లో లేను. 'వికృతి'లో ఉన్నాను కానీ 'వినతి’లో లేను. 'షికారు'లో ఉన్నాను కానీ 'పుకారు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. రెండు అక్షరాల పదాన్ని నేను. 'మంట’లో ఉన్నాను కానీ 'పంట'లో లేను. 'త్రినేత్రం'లో ఉన్నాను కానీ 'నేత్రం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

WHO I AM?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పద్దు'లో ఉంటాను కానీ 'పొద్దు'లో లేను. 'గట్టి'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'కన్నా'లో ఉంటాను కానీ 'చిన్నా'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'వ్యయం'లో ఉంటాను కానీ ‘నయం'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'వక్క'లో లేను. 'రేణువు'లో ఉంటాను కానీ 'వేణువు'లో లేను. 'కంకి’లో ఉంటాను కానీ 'పెంకి'లో లేను. నేను ఎవరినో ತಸಿಂದ್?

సామెతలు

కింద కొన్ని సామెతలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయగలరా? 1. ఆదిలోనే _ _ పాదు. 2. అడవి కాచిన _ _ _ 3. ఊరిలో పెళ్లికి _ _ _ హడావిడి. 4. ఇంట గెలిచి _ _ గెలువు. 5. నవ్వు నాలుగు విధాల _ _  6. చెవిటి వాడి ముందు _ _  ఊదినట్లు.

సునీల్ రాజీవ్ కి ఏమి అవుతాడు?

రాజీవ్ అరుణ్ సోదరుడు. సోనియా సునీల్ సోదరి. అరుణ్ సోనియా కొడుకు. సునీల్ రాజీవ్ కి ఏమి అవుతాడు? A. మేనల్లుడు B. కొడుకు C. సోదరుడు D. తండ్రి ఎ. మేనల్లుడు

పొడుపు కధలు

పొడుపు కథలు ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే జ. ఉల్లిపాయ  ఇంటికి కన్ను, కంటికి కన్ను,మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు. జ. దీపం తెల్లటోడు నల్లటోడిని తన్ను! జ. అగ్గిపెట్టె

పొడుపు కథలు

పొడుపు కథలు : * ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే జ. ఉల్లిపాయ * గుప్పెడు పిట్ట.. దాని పొట్టంతా తీపి. జ. బూరె * అడవిలో పుట్టింది, మా ఇంటికి వచ్చింది. తాడేసి కట్టింది. తైతక్కలాడింది. కడవలో దూకింది. పెరుగులో మునిగింది. వెన్నంత తెచ్చింది. జ. కవ్వం * దాస్తే పిడికిలో దాగుతుంది. తీస్తే ఇల్లంతా పాకుతుంది. జ. దీపం * జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా. జ. నీడ * నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు. జ. ఉడుత * సినిమాహాలుకి మనతో వస్తుంది. టికెట్ తీసుకుంటుంది. సినిమా చూడదు. మనం చూసి వచ్చేవరకు వేచి చూస్తుంది. జ. మన వాఇనం * అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం జ. గోరింటాకు * ఆకు చిటికెడు. కాయ మూరెడు. జ. మునగకాయ * ఆకు బారెడు. తోక మూరెడు. జ. మొగలిపువ్వు  * ఇల్లుకాని ఇల్లు జ. బొమ్మరిల్లు * ఇంటికి అందం జ. గడప * ఇంటింటికీ ఒక నల్లోడు జ. మసిగుడ్డు * ఇంటికి అంత ముండ కావాలి జ. భీగము * ఇల్లంతాఎలుక బొక్కలు.. జ. జల్లెడ * ఇల్లంతా తిరిగి మూల కూర్చొంది జ. చీపురుకట్ట * ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు జ. పొగ * ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ జ. అప్పడం * ఆ ఇంటి...

చిలిపి ప్రశ్నలు

1. నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది? 2. వేలడంత ఉంటుంది, జానడంత సాగుతుంది. ఏమిటది..? 3. భర్త భార్యకు మాత్రమే చూపిస్తాడు? ఏమిటది? 4. తినడానికి కొంటాం కానీ తినము. ఏమిటది? 5. ఒకటి పట్టుకుంటే రెండు వేలాడతాయి. ఏమిటవి?