ప్రశ్నలోనే జవాబు దాగి ఉంది. 1) గోదావరి ప్రాంతంలో పండించే పంట ఏది? 2)శాఖాహారంలో ఉండే ఆభరణం ఏది? 3) శ్వేతవర్ణం అంటే ఏమిటో తెలుపుము? 4) ఈ మైదానంలో ఏ పిండిని పారబోశారు ? 5) ఉత్తరంలో ఉండే దిక్కు ఏది ?
రెండింటికీ ఒక్కటే పదం ఏమిటో కనుక్కోండి చూద్దాం 1). వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ _ లో షి _ _కు వెలుతున్నాం. 2). ప్రతి దానికి _ _ గటం కాకుండా, బుద్ధిగాం అడగడం _ _ వాటు చేసుకోవాలి. 3). బాలు _ _ మొదట్లోనే చేయవలసిన పనిని, _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు?
రెండు ఖాళీలలో ఒకే జవాబులు 1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము 2. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు 3. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి 4. అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను 5. పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారు ఏంటి 6. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు 7. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు 8. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి 9. ఆ రాగి గిన్నె లోని రాగి సంకటి తీసుకుకరా
ఈ రోజు ప్రశ్న ఒక అబ్బాయి Phone & Game ఆడుకుంటా అని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గర Phone తీసుకున్నాడు. కాన్ని దానికి password ఉంది. అన్నయ్యని అడిగితే ఒక Code చెప్పాడు. దాన్ని డి code చేస్తే Password తెలుస్తుందన్నాడు. ఆరేంటంటే " పంచపాండవులు అవ్వదశపురాణాల్ని అష్టమి రోజున చదివారు" అని చెప్పాడు . ఇంతకి Password ఏంటి కనుక్కోండి చూద్దాం?
నీ నూనె నా నూనె అని నేను అన్నానా నా నూనె నీ నూనె అని నువ్వు అన్నావా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నీ నూనె నా నూనె కాదు నా నూనె నీ నూనె కాదు. ఇక్కడ ఎన్ని "నా" లు ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఆరాటం’లో ఉంటాను కానీ 'పోరాటం'లో లేను. 'కానుక’లో ఉంటాను కానీ 'కినుక’లో లేను. 'వరం'లో ఉంటాను కానీ 'వరి'లో లేను. ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం 2. నేను ఆరు అక్షరాల పదాన్ని. ‘పోటు’లో ఉంటాను కానీ 'కాటు'లో లేను. 'రాకెట్లో’ ఉంటాను కానీ 'లాకెట్లో లేను. 'పాట'లో ఉంటాను కానీ 'పాత్ర'లో లేను. 'యోగం'లో ఉంటాను కానీ 'సగం'లో లేను. 'మధు'లో ఉంటాను కానీ 'మది’లో లేను. 'రోలు'లో ఉంటాను కానీ 'రోకలి'లో లేను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?
ఒక అమ్మాయి అబ్బాయిని లిఫ్టు అడిగింది దిగేటప్పుడు అబ్బాయి పేరు అడుగుతుంది. దానికి అతను 14,1,22,5,5,14 అని సమాధానం ఇస్తాడు. ఇంతకీ అతని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
ఈ డైలాగ్లతో సినిమా పేర్లను చెప్పగలరా? 1). ఆనందం ఎక్కడ దొరుకుతుంది ? డబ్బులోనా, అందమైన అమ్మాయిలు వెళ్లే పబ్బుల్లోనా? 2). మనకు లాజిక్లు వద్దు మ్యాజిక్ కావాలి. అందుకే మనదేశంలో సైంటిస్ట్ల కంటే బాబాలు ఫేమస్. 3). మేము మీ అమ్మాయిలంత తెలివైనోళ్లం కాదు. మావి మట్టి బుర్రలు. 4). గతంలో జరిగిన అన్ని కథలు వినేవాడు ఫ్రెండ్.. చెప్పిన ప్రతికథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. 5). కళ్లు కూడా మాట్లాడగలవని తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేవరకు. జవాబులు : 1). అత్తారింటికి దారేది 2). జులాయి 3). హార్ట్ ఎటాక్ 4). ఉన్నది ఒకటే జిందగీ 5). మళ్లీ మళ్లీ ఇది రాని రోజు