Skip to main content

Posts

Showing posts from April, 2024

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పేర్లు

శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి కోనసీమ రాజమహేంద్రవరం నరసాపురం పశ్చిమగోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఎస్పీఎస్ నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు శ్రీబాలాజీ జిల్లా

నేనెవరో చెప్పండి

నేనెవర్ని? 1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'జీలుగు’లో ఉంటాను. ‘పలుగు'లో ఉండను. 'విరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను. ‘తాడు'లో ఉంటాను. 'గోడు'లో ఉండను. 'శయనం'లో ఉంటాను. 'పయనం'లో ఉండను. 'గాయం'లో ఉంటాను. 'గానం'లో ఉండను. ఇంతకీ నేనెవరనో చెప్పండి ? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను. 'బిరుదు'లో ఉంటాను. 'కల'లో ఉంటాను. 'కళ'లో ఉండను. 'కవి'లో ఉంటాను. 'చెవి'లో ఉండను. నేనెవరో తెలుస్తే చెప్పండి ?

సామెతలు చెప్పడం వచ్చా?

1) కుప్పకు ముందు, కుస్తీకి వెనుక 2) కుమ్మరవీధిలో కుండ లమ్మినట్లు 3) కులం కన్నా గుణం ప్రధానం 4) కులం చెడినా గుణం దక్కవలె 5) కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట! 6) కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే 7) కూటికి గతి లేదుగాని కుంటెనలకు ముత్యాలు 8) కూటికి తక్కువైనా కులానికి తక్కువా? 9) కూటికోసం కోటి విద్యలు 10) కూడు ఉంటే కూలగోత్రా లెందుకు? 11) కూడు ఉడుకలేదని కుండట్టుక కొట్టాడట! 12) కూర లేని తిండి కుక్క తిండి 13) కూర్చుంటే కుంటి, లేస్తే లేడి 14) కూర్చుంటే లేవలేడుగాని, ఎగిరెగిరి తంతాడట 15) కూర్చుండి తింటూఉంటే కొండయినా కరిగిపోతుంది 16) కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్లు 17) కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట! 18) కొంటే రానిది, కొసరితే వస్తుందా? 19) కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు 20) కొండంత చీకటి - గోరంత దీపం 21) కొండను చూచి కుక్కలు మొరిగినట్లు 22) కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 23) ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. 24) ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు. 25) ఇంటికన్నా గుడి పదిలం. 26) ఇంట గెలిచి - రచ్చ గెలువు 27) ఇంటిగుట్టు పెరుమాళ్ళకెరుక 28) ఇంటి దీపమని ముద్దుపెట్టుకుంటే మీసాలన్నీ...

అమ్మాయికి గిరీష్ సంబంధం ఎమిటి?

గిరీష్  ఒక ఫోటో వైపు చూపిస్తూ, 'ఆమె మా తాతగారి ఒక్కగానొక్క కొడుకు కూతురు' అని చెప్పాడు. అమ్మాయికి గిరీష్  సంబంధం ఎమిటి? A. సోదరి B. కూతురు C. గ్రాండ్ డాటర్ D. బంధువు

miss అయిన రెండు పదాలు ఒక్కటే

I. బంటీ.. ప _ _  కాయ గురించి చెబుతూ  ఒకటే _ _ పెట్టాడు. 2. _ _ కు చెప్పమ్మా..! నేను _ _ డికి రానని. 3. ఇంటి వెనక _ _  లో _ _ కూర చాలానే ఉంది. 4. మా అక్క _ _ ఇప్పుడిప్పుడే _ _ వాయించడం నేర్చుకుంటుంది.

నేనెవర్ని

నేనెవర్ని? నేనో అయిదక్షరాల పదాన్ని. 'రాత'లో ఉంటాను. కానీ 'మేత'లో ఉండను. 'మనం'లో ఉంటాను. కానీ 'వనం’లో ఉండను. 'చిగురు'లో ఉంటాను. కానీ 'ఇగురు’లో ఉండను. ‘కాలు'లో ఉంటాను. కానీ 'కాలం'లో ఉండను. 'కల'లో ఉంటాను. కానీ 'ఇల'లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

నేనెవర్ని

నేనెవర్ని? నేను నాలుగక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను. 'బిరుదు'లో ఉండను. 'పిట్ట'లో ఉంటాను. 'పిల్లి’లో ఉండను. ‘హారం'లో ఉంటాను. 'వరం'లో ఉండను. 'సంత'లో ఉంటాను. 'పుంత'లో ఉండను. నేనెవరో మీకు తెలుసా అయితే చెప్పుకోండి చూద్దాం ?

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం!  చరణ్  వాళ్ల స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దాని కోసం కొన్ని ఆట వస్తువులు గ్రౌండ్లో పెట్టారు. కానీ అందులో అవసరం లేనివి కూడా కలిసిపోయాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం. క్యారంబోర్డు పెన్ను బంతి బ్యాట్ దువ్వెన షటిల్ చెప్పులు ఆపిల్ స్కిప్పింగ్ రోప్

అమ్మాయి పేరు ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరు ఏమిటి అని అడిగాడు దానికి ఆ అమ్మయి నా పేరు 4,8,1,14,1,12,1,11,19 8, 13, 9. అని చెప్పింది. ఇంతకి ఆ పేరు ఏమిటో చెప్పండి?

చెప్పుకోండి చూద్దాం

1. లేనిది ఉన్నట్లు చెప్పడం       క _ _ 2. చెట్టు నుంచి వచ్చేది             క _ _ 3. పంట మధ్యలో మొలిచేది     క _ _ 4. నీటి మొక్కకు పూచే పుష్పం  క _ _ 5. చిన్న పిల్లల్లో లేనిది               క _ _ 6. కవి రాసేది                           క _ _ 7. దయ మూడక్షరాల్లో              క _ _ 8. గొడవను ఇంకోలా రాస్తే...      క _ _

చిక్కుప్రశ్నలు

చిక్కుప్రశ్నలు విప్పండి 1. గడియారంలో ఎన్ని నంబర్లు ఉంటాయి? 2. ఒక కూరగాయలో మొదటి అక్షరం ప్రశ్నించడం, రెండో అక్షరం అగౌరవపరచడం, మూడోది గౌరవించడం. మరి ఆ కూరగాయ పేరేంటి? 3. యంత్రం కాని యంత్రం.. ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఏంటది? 4. గాజు పూల కుండీని బండలపై వేసినా పగలకూడదంటే ఏం చేయాలి? 5. ఓ బాలికకు చివరి బర్త్ డే 10వది. రాబోయేది 12వ బర్త్ డే. ఎలా సాధ్యం? 6. ఇద్దరు బాలికలు. వారికి పేరెంట్స్ సేమ్. వారిద్దరూ ఒకటే నెల ఒకటే సమయానికి పుట్టారు. కానీ, వాళ్లు కవలలు కాదు. ఎందుకు? 7. O, T, T, F, ?, ?, ? ( ? స్థానంలో  వచ్చే అక్షరాలు ఏమిటి? ) 8. ఆల్ఫాబెట్స్లో ఉండే 7 నంబర్లు ఏవి? సమాధానాలు 1. 15 (1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 1, 1) 2. క్యాబేజీ 3. సాయంత్రం 4. గాజు కుండీని మామూలుగా వేసినా బండ పగలదు 5. ఈ రోజు ఆ బాలిక 11వ బర్త్ డే. 6. వారు పుట్టిన సంవత్సరాలు వేరు. 7. F, S, S (O - One, T-Two, T-Three, F-Four . F-Five, S-Six, S-Seven) 8. I, V, X, L, C, D, M

నేనెవర్ని

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అరక’లో ఉంటాను కానీ 'మరక’లో లేను. 'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'సరి'లో ఉంటాను కానీ 'సర్వం'లో లేను. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'అంచు’లో ఉంటాను కానీ 'మించు'లో లేను. 'గులాబీ'లో ఉంటాను కానీ 'జిలేబీ'లో లేను. 'గరళం'లో ఉంటాను కానీ 'రగడ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

తమాషా ప్రశ్నలు

తమాషా ప్రశ్నలు! 1. రక్తం చిందని యుద్ధ రంగం? 2. పగలు కూడా కనిపించే నైట్? 3. చంపేసే రింగ్? 4. భయపెట్టే వరం? 5. గుర్తు చేసే కాలు?

ఆకుకూరలు మరియు కూరగాయల పేర్లు చెప్పండి

ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి 1. ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3.కాగితం చుడితే వచ్చే కూరగాయ 4 సమస్యలలో వున్న కూరగాయ 5.రెండు అంకెతో వచ్చే కూరగాయ 6.దారి చూపించే కూరగాయ(దుంప) 7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ 8.కష్టాలలో వున్న కూరగాయ 9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర 10.సగంతో మొదలయ్యే కూరగాయ 11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర 12.వనంలో వున్న ఆకుకూర 13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర 14. మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ 15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ 16.జలచరంతో వున్న కూరగాయ 1.గోంగూర 2.చుక్కకూర 3.పొట్లకాయ 4.చిక్కుడుకాయ   5. దోసకాయ 6.బీట్ రూట్   7. కీరదోస 8.చింతకాయ 9. బచ్చలికూర  10.అరటి కాయ 11.గోంగూర12.తోటకూర 13.కరివేప 14. టమాటో 15. క్యారట్ 16.సొరకాయ

చెప్పుకోండి చూద్దాం

చెప్పండి చూద్దాం! అయిదక్షరాల పదాన్ని నేను. 'సకలం’లో ఉంటాను కానీ ‘వికలం’లో లేను. ‘నోము’లో ఉంటాను కానీ ‘నోరు’లో లేను. ‘ద్రవం’లో ఉంటాను కానీ ‘లవం’లో లేను. 'యాత్ర'లో ఉంటాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉంటాను కానీ 'నది’లో లేను. ఇంతకీ నేను ఎవరినో చెప్పండి చూద్దాం!

సామెతలు

1. అడిగే వాడికి చెప్పేవాడు _ _ _ 2. ఎవరికి వారే _ _ _....తీరే. 3. అమ్మబోతే _ _ _ కొనబోతే కొరివి. 4. చల్లకు వచ్చి _ _ దాచినట్లు. 5. _ _ వాక్కు బ్రహ్మ వాక్కు.

తెలుగు - ENGLISH = సమానపదాలు

పదాలేవి? ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటి సమానార్థకాలు మాత్రం ఆంగ్లంలో అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయండి చూద్దాం. 1. సంకెళ్లు          _ _ _ _ _ _ FF 2. గట్టిదనం        _ _ _ FF 3. దిండు            _ _ LL _ _ 4. పసుపు రంగు _ _ LL _ _

గజి బిజి

గజి ..బిజి..! ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం. 1. యావిత్రరహా 2. దుపస్తులుట్టు 3. ష్యభత్తువి 4. ర్శశాప్రనదల 5. మచిప్రకిథత్స 6. తీద్రమురంస 7. తిమంవ్వుచాపు 8. రాపాయిల