Skip to main content

Posts

WHO I AM?

WHO I AM? 1. మూడు అక్షరాల పదాన్ని నేను.  'పాత్ర'లో ఉంటాను. కానీ 'యాత్ర'లో లేను.  'గోవు'లో ఉంటాను కానీ 'గోరు'లో లేను.  'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను.  ఇంతకీ నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం ? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని.  'అండ'లో ఉంటాను కానీ 'దండ’'లో లేను.  'తట్ట'లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను.  'సిరి’లో ఉంటాను కానీ 'సిరా'లో లేను.  'భిక్షం'లో ఉంటాను కానీ 'భిక్షువు'లో లేను.  నేను ఎవరినో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?

వీటిలో ఒక తప్పు ఉంది.

డాక్టర్ : ఇంత పెద్ద గాయం ఎలా అయింది, పళ్లు ఎందుకు ఊడిపోయాయి? చలపతి : నిన్న వర్షంలో నడుస్తుంటే మా ఆవిడ జారి పడింది డాక్టర్ : ఆవిడ పడితే నీ పళ్లు ఎందుకు ఊడాయి? చలపతి : ఆమె పడ్డప్పుడు బాదని ఆపుకోలేక పైకి నవ్వాను అంతే.

Answer ఏమిటి?

టీచర్: ఏరా రాము..! స్కూల్కి ఎందుకు లేటుగా వచ్చావ్? రాము: ఇంట్లో మా అమ్మానాన్న గొడవ పడుతున్నారు టీచర్ టీచర్: వాళ్లు గొడవ పడుతుంటే నీకేమైంది? రాము: నా స్కూల్  _  చెరొకటి వాళ్ల చేతిలో ఉండిపోయింది టీచర్.

నా పేరు చెప్పుకోండి చూద్దాం

నా పేరు చెపుకోండి..? నేనో పది అక్షరాల ఇంగ్లిష్ పదాన్ని. 7,9,10 అక్షరాలు కలిపితే "కొడుకు". 5,6,7,8,9,10 అక్షరాలు కలిపితే "దృష్టి". 10,9 అక్షరాలు కలిపితే "కాదు". 9,10 అక్షరాలు కలిపితే "మీద". 1,6,10 అక్షరాలను కలిపితే "డబ్బా" అని అర్థం వస్తుంది. ఇంతకీ నా పేరేమిటి చెప్పుకోండి చూద్దాం?

ప్రశ్నల్లోనే జవాబులు

ప్రశ్నల్లోనే జవాబులు. 1. బాధ్యతల్లో అవయవం? 2. జ్ఞాపకశక్తిలో బలం ఏమిటి? 3. పగడంలో శత్రుత్వం ఏది? 4. స్వైరవిహారంలో దాగి ఉన్న నగ ఏమిటి? జవాబులు 1. తల 2.శక్తి 3.పగ 4.హారం