(1) పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని? (రామ చిలుక) (2) కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను., తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని? (బొగ్గు) (3) నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు. (సమయం) (4) వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను, చీకటి పడితే మాయమౌతాను. (నీడ)