Skip to main content

Triphala: ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే 100 రోగాలను నయం చేస్తుంది!

Triphala: ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే 100 రోగాలను నయం చేస్తుంది!

మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయుర్వేదంలోనూ అనేక మంచి ఔషధాలు ఉన్నాయి. కొన్ని చూర్ణాలు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదం చేస్తాయి. అటువంటి వాటిల్లో త్రిఫల చూర్ణం ఒకటి. ఉసిరికాయ పొడి, కరక్కాయ పొడి, తానికాయపొడుల మిశ్రమమే త్రిఫల చూర్ణం. ఆయుర్వేద వైద్యంలో దీనిని వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.

100 రోగాలను తగ్గించే త్రిఫల చూర్ణం
గిరిజన ప్రాంతాలలో దొరికే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను సేకరించి త్రిఫల చూర్ణంగాను, త్రిఫల రసం గాను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. త్రిఫల చూర్ణం కు ఎంతో ప్రత్యేకత ఉందని ఆయుర్వేదంలో చెప్పబడింది. వాత, పిత్త, కఫ దోషాలను నివారించడంలో త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. ప్రతిరోజు త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మొత్తం 100 రోగాలను తగ్గించడంలో త్రిఫల చూర్ణం పనిచేస్తుందని చెబుతారు.

Triphala do wonders on your health cures 100 diseases know about triphala

త్రిఫల చూర్ణంతో క్యాన్సర్ కు చెక్
అయితే త్రిఫల చూర్ణంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కొన్నింటిని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారణలో పనిచేస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మన పేగులలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.

త్రిఫల చూర్ణంతో ఎన్ని రోగాలు తగ్గుతాయంటే
త్రిఫల చూర్ణాన్ని రోజు తీసుకుంటే మన కళ్ళు, మన జుట్టు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ కణాలను రిపేరు చేయడంలో త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. త్రిఫల చూర్ణం కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది .ఆకలిని అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. అధికంగా తినడాన్ని త్రిఫల చూర్ణం నివారిస్తుంది. త్రిఫల చూర్ణం రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మవ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కండరాల నొప్పులు, వాపులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణంతో కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాతవ్యాధి లక్షణాలను ఇది తగ్గిస్తుంది. రక్త పోటును నియంత్రించడంలో, గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంలోనూ త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. వయసు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించటానికి కూడా ఇది సహాయపడుతుంది.

త్రిఫల చూర్ణం వీరు తీసుకోవాలంటే వైద్యులను సంప్రదించాలి
మన లివర్ నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మానసికంగానూ త్రిఫల చూర్ణం స్పష్టతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అయితే త్రిఫల చూర్ణాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు కానీ గర్భవతిగా ఉన్నవారు, పాలిచ్చే తల్లులు త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి అని భావిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి