1). మూత కాని మూత. ఈ మూత డబ్బాకు పెట్టలేని మూత. ఆ మూత ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
2). రుచి కాని రుచి. మనిషిని చూసి చెప్పే రుచి. ఆ రుచి ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
3). రాయి కాని రాయి. ఈ రాయి ని విసరలేము మరియు తాకలేము. ఆ రాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
4). హారం కాని హారం. ఈ హారంకి విలువ కట్టలేము. ఆ హారం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
5). జనం కాని జనం. ఈ జనంను అందరూ తింటారు. ఆ జనం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
6). గంటలు కాని గంటలు. ఈ గంటలు మోగవు మరియు ఆడవారికి ఇష్టమైన గంటలు. ఆ గంటలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
7). పార్మర్ కాని పార్మర్. ఈ పార్మర్ వ్యవసాయం చేయడు. ఆ పార్మర్ ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
8). పిండాలు కాని పిండాలు. ఈ పిండాలు పెద్దలకు పెట్టలేము. ఆ పిండాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
9). భక్తులు లేని సాయి ఎవరు?
10). ప్రయాణికులు చేయని మెయిల్ ఏమిటి?
11). భక్తులు లేని దేవుడు ఎవరు?
12). రూపము కాని రూపము. ఈ రూపము ఎవ్వరూ చూడలేరు. ఆ రూపము ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
13). రంగులు కాని రంగులు. ఈ రంగులు పేలే రంగులు. ఆ రంగులు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
14). వలలు కాని వలలు. ఈ వలతో చేపలు పట్టలేము మరియు పట్టడానికి పనికిరాని వలలు. ఆ వలలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
15). చూడలేని నయనం ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
16). నాలుకతో చెప్పలేని రుచి?
17). ఆవు ఇవ్వని పాలు?
18). జాలారి పట్టలేని ఫిష్?
19). తిరగని గ్రహాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
20). నామాలు లేని వ్రతము?
21). అరవకుండా భయపెట్టే కాకులు?
Answers
1). కన్నుమూత
2). అభిరుచి
3). పరాయి
4). పరిహారం
5). భోజనం
6). జడగంటలు
7). ఇన్ పార్మర్
8). మూత్రపిండాలు
9). కసాయి
10). బ్లాక్ మెయిల్
11). సహదేవుడు
12). అపురూపము
13). పిరంగులు
14). కవలలు
15). ఉపనయనం
16). అభిరుచి
17). దీపాలు
18). సెల్ఫిష్
19). విగ్రహాలు
20). మౌనవ్రతము
21). చికాకులు
Comments
Post a Comment