నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
మంచము
పాలు కాని పాలు, ఏమి పాలు?
సమాధానం :
లోపాలు
నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
సమాధానం :
దూది
పురము కాని పురము, ఏమి పురము?
సమాధానం :
గోపురము
నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
పిడక
ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
నీడ
నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను?
సమాధానం :
గుడి గంట
నారి కాని నారి, ఏమి నారి?
సమాధానం :
పిసినారి
నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
నీడ
పేడ కాని పేడ, ఏమి పేడ?
సమాధానం :
దూద్ పేడ
నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు, ఏమిటది?
సమాధానం :
వీపు
సందు కాని సందు, ఏమి సందు?
సమాధానం :
పసందు
నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
నీటి బుడగ
నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మళ్ళీ నడవదు.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
పెన్సిల్
పండ్లున్నా నోరు లేనిది. అది ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
రంపం
రాయి కాని రాయి, ఏమి రాయి?
సమాధానం :
పావురాయి
చిన్న పాపకు చాలా చీరలు. అది ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
ఉల్లిపాయ
జాన కాని జాన, ఏమి జాన?
సమాధానం :
ఖజాన
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది.అయితే అది ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
వేరుశెనగ కాయ
లాగి విడిస్తేనే బ్రతుకు?
సమాధానం :
ఊపిరి
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు.
ఆ పువ్వు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
పత్తి పువ్వు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?
సమాధానం :
దీపం
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు?
సమాధానం :
సూర్యుడు
మూత తెరిస్తే, ముత్యాల పేరు?
సమాధానం :
దంతాలు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు?
సమాధానం :
తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?
సమాధానం :
లవంగ మొగ్గ
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
సమాధానం :
తేనె పట్టు
రసం కాని రసం, ఏమి రసం?
సమాధానం :
నీరసం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
సమాధానం :
పాలు, పెరుగు, నెయ్యి
మోదం కాని మోదం?
సమాధానం :
ఆమోదం
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?
సమాధానం :
ఉత్తరం
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
సమాధానం :
సీతాకోక చిలుక
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?
సమాధానం :
మంగలి
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన?
సమాధానం :
తాటి చెట్టు
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?
సమాధానం :
ఎండ, వాన, చలి
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు?
సమాధానం :
తేలు
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.
సమాధానం :
దీపం వత్తి
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?
సమాధానం :
మురళి
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?
సమాధానం :
ఉల్లి
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?
సమాధానం :
శంఖం
చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ, కాయ కాని కాయ, తీయగా ఉండే కాయ. ఆ కాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
సమాధానం :
కజ్జికాయ
వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు?
సమాధానం :
ఉడత
రాణాలనే మించిన రణం, ఏమి రణం?
సమాధానం :
మరణం
రంగం కాని రంగం, ఏమి రంగం?
సమాధానం :
వీరంగం
మత్తు కాని మత్తు, ఏమి మత్తు?
సమాధానం :
గమ్మత్తు
అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు?
సమాధానం :
నిచ్చెన
ముడ్డి పిసికి, మూతి నాకుతారు?
సమాధానం :
మామిడి పండు
టూరు కాని టూరు, ఏమి టూరు?
సమాధానం :
గుంటూరు
టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి?
సమాధానం :
గడియారం
డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్?
సమాధానం :
అడ్రెస్
తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?
సమాధానం :
విభూతి
జాబు కాని జాబు, ఏమి జాబు?
సమాధానం :
పంజాబు
తోక లేని పిట్ట 90 ఆమడలు పోతుంది?
సమాధానం :
పోస్ట్ కార్డు
జారు కాని జారు, ఏమి జారు?
సమాధానం :
బజారు
తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము?
సమాధానం :
మిణుగురు పురుగు
తాళము కాని తాళము, ఏమి తాళము?
సమాధానం :
ఆది తాళము
తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు?
సమాధానం :
గడియారం ముళ్ళు
తాళి గాని తాళి, ఏమి తాళి?
సమాధానం :
ఎగతాళి
తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది?
సమాధానం :
చీమ, దోమ
ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది?
సమాధానం :
క్రొవ్వొత్తి
దానము కాని దానము, ఏమి దానము?
సమాధానం :
మైదానము
తోలు నలుపు! తింటే పులుపు!! ఏమిటది?
సమాధానం :
చింతపండు
ధనము కాని ధనము, ఏమి ధనము?
సమాధానం :
ఇంధనము
చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు?
సమాధానం :
రామ చిలుక
ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెపుతుంది?
సమాధానం :
టెలిఫోన్
పైన చుస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు, ఏమిటది?
సమాధానం :
పత్తికాయ
పుట్టినపుడు ఉండవు, పోయే టప్పుడు ఉండవు, ఏమిటవి?
సమాధానం :
బట్టలు
పుట్టినపుడు లేకుండా తరువాత వచ్చి ఆ తరువాత పోయేవి?
సమాధానం :
దంతములు
చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగి పోతుంది?
సమాధానం :
ముగ్గు
సాయి కాని సాయి, ఏమి సాయి?
సమాధానం :
కసాయి
మంచి సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది, ఏమిటది?
సమాధానం :
మొగిలి పువ్వు
పేరు కాని పేరు, ఏమి పేరు?
సమాధానం :
కాసుల పేరు
కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది?
సమాధానం :
మేఘం
తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాము కాదు?
సమాధానం :
రైలు
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?
సమాధానం :
అత్తి చెట్టు
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?
సమాధానం :
కుండ, గరిట
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది?
సమాధానం :
తాటి చెట్టు
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు?
సమాధానం :
టెంకాయ
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!?
సమాధానం :
చిటికెన వ్రేలు
ఒక ముండ ఎన్ని కోకోలైన విప్పుతుంది?
సమాధానం :
ఉల్లిపాయ
గారు కాని గారు, ఏమిగారు?
సమాధానం :
కంగారు
అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు?
సమాధానం :
ఆకలి
అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను?
సమాధానం :
టెలిఫోన్
గీత కాని గీత, ఏమి గీత?
సమాధానం :
భగవద్గీత
గోళము కాని గోళము, ఏమి గోళము?
సమాధానం :
గందర గోళము
అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?
సమాధానం :
విస్తరాకు
అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?
సమాధానం :
తేనే పట్టు
అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు?
సమాధానం :
ఫ్యాన్
అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.
సమాధానం :
పిడుగు
ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది?
సమాధానం :
మీసము
ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి?
సమాధానం :
ఇంటి పేరు
ఆడవారు తక్కువగా మాట్లాడే నెల?
సమాధానం :
ఫిబ్రవరి
ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?
సమాధానం :
చీపురు
ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?
సమాధానం :
మ్యాపులో
ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?
సమాధానం :
పంచదార
ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!?
సమాధానం :
స్విచ్, బల్బ్
అన్నదమ్ములు ఇద్దరు, ఒకరంటే మరొకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వారి మధ్యకు ఎవరైనా వొస్తే పచ్చడి పచ్చడే?
సమాధానం :
ఇసుర్రాయి
ఇద్దరు అక్క చెల్లెల్లు, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా, ఒకరినొకరు చూసుకోరు?
సమాధానం :
కళ్ళు
ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి?
సమాధానం :
దీపం
ఇవ్వకుండా తీసుకో లేనిది! తీసుకోకుండా ఇవ్వ లేనిది!!?
సమాధానం :
ముద్దు
అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండవ వారు అంతే దూరం పోతారు?
సమాధానం :
కాళ్ళు
ఈగ ముసరని పండు! ఇంటిలో నుండు!!?
సమాధానం :
నిప్పు
ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు?
సమాధానం :
కల్లు కుండలు
ఊరంతా కదిలిన, ఊరగాయ కుండ కదలదు?
సమాధానం :
బావి
ఉరికంత ఒక్కటే దుప్పటి?
సమాధానం :
ఆకాశము
ఎర్రనిచెట్టు! నీళ్లు పోస్తే చస్తుంది!!?
సమాధానం :
అగ్ని
మాములు వేళలో మర్యాదగా ఉంటుంది, ఎండకు వానకు నెత్తినెక్కుతుంది?
సమాధానం :
గొడుగు
ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను.
సమాధానం :
నిప్పు
ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట! ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట!!?
సమాధానం :
గాలి పటము
ఎనమిది ఎముకలు! తట్టెడు ప్రేగులు!!?
సమాధానం :
మంచము
ఎముకలు లేని జీవము, ఏటికి పోయింది?
సమాధానం :
జలగ
ఏది పెడితే అరిగి పోతుంది?, ఏది పెడితే కలకాలం ఉంటుంది?
సమాధానం :
అన్నము, వాత
అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి?
సమాధానం :
పెదవులు
ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి?
సమాధానం :
తక్కెడ
అడుగులున్నా, కాళ్ళులేనిది?
సమాధానం :
గజము బద్ద, మీటర్ స్కేలు
ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు?
సమాధానం :
పొడుపు కథ
నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు?
సమాధానం :
లవంగం మొగ్గ
అందని వస్త్రం పై అన్నీ వడియాలే?
సమాధానం :
నక్షత్రాలు
కాయలు కాని కాయలు, ఏమి కాయలు?
సమాధానం :
మొట్టి కాయలు
అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది?
సమాధానం :
ప్రాణం
అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది?
సమాధానం :
అద్దము
కీచు కీచు పిట్ట! నేలకేసి కొట్ట!!
సమాధానం :
చీమిడి
కిట కిట తలుపులు! కిటారు తలుపులు!! ఎప్పుడు తీసినా చప్పుడు కాదు?
సమాధానం :
కను రెప్పలు
కిరీటము ఉంటుంది కాని రాజును కాదు, నాట్యము చేస్తాను కాని మయూరిని కాదు?
సమాధానం :
నాగుపాము
కాటుక రంగు, కమలము హంగు! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు!!?
సమాధానం :
గొడుగు
తల లేదు కాని గొడుగు ఉంది, పాము లేదు కాని పుట్ట ఉంది?
సమాధానం :
పుట్ట గొడుగు
కడుపు లోన పిల్లలు, కంఠము లోన నిప్పులు! అరుపేమో ఉరుము, ఎరుపంటే భయము!!?
సమాధానం :
రైలు
కార్డు కాని కార్డు, ఏమి కార్డు?
సమాధానం :
రికార్డు
కాయ, పువ్వు లేని పంట?
సమాధానం :
ఉప్పు పంట
కలి కాని కలి, ఏమి కలి?
సమాధానం :
చాకలి
కోడి కాని కోడి, ఏమి కోడి?
సమాధానం :
చకోడి
కొనే టప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు ఏమిటది?
సమాధానం :
పుచ్చకాయ
అన్నింటికన్నా విలువైనది, అందరికి అవసరమైనది?
సమాధానం :
ప్రాణము
గింజ మునుగుతుంది, కాయ తేలుతుంది?
సమాధానం :
వేరుశెనగ కాయ
కర్రలతో అతి చిన్న కర్ర?
సమాధానం :
జీలకర్ర
గట్టుమీద రాయి! మినుకు మినుకు రాయి!!
సమాధానం :
ముక్కు పుడక
గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పలిగి పోవు?
సమాధానం :
సబ్బు బుడగ
కాయ కాని కాయ, అతి చిన్న కాయ?
సమాధానం :
చెమటకాయ
గోడకు గొలుసు పండు!?
సమాధానం :
లాంతరు
చీకటి ఇంటిలో జడల దయ్యము?
సమాధానం :
ఉట్టి
చింపిరి గుడ్డలు! బంగారం లాంటి బిడ్డలు!!
సమాధానం :
మొక్క జొన్న
చిన్న చిట్టిలో కమ్మని కూర?
సమాధానం :
కిల్లీ
చిక్కటి కారడవిలో చక్కటి దారి?
సమాధానం :
పాపిట
చారల పాపకి దూది కుచ్చు!
సమాధానం :
ఉడుత
నూరు పళ్ళు ఒకటే నోరు?
సమాధానం :
దానిమ్మ
సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?
సమాధానం :
సూది
ఎర్రవాడొస్తే తెల్లవాడు, పారిపోయి దాక్కుంటాడు?
సమాధానం :
సూర్యుడు, చంద్రుడు
పొంచిన దయ్యం! ఉన్న చోట ప్రత్యక్షం!!
సమాధానం :
నీడ
అంగట్లో ఉంటాను, ఇంట్లో అంగి విప్పుతాను! నన్ను గాని ముట్టుకుంటే నూతిలో దూకుతాను!!
సమాధానం :
అరటి పండు
ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు?
సమాధానం :
గొడుగు
అడవిలో పుట్టాను, నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను?
సమాధానం :
బొగ్గు
పైన పచ్చ ఏనుగు, లోన తెల్ల పీనుగు?
సమాధానం :
అరటి కాయ
బారు కాని బారు, ఏమి బారు?
సమాధానం :
సాంబారు
పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?
సమాధానం :
ముద్దు
హారము కాని హారము, ఏమి హారము?
సమాధానం :
ఆహారము
పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు?
సమాధానం :
భ్రమరము
బడి కాని బడి, ఏమి బడి?
సమాధానం :
రాబడి
పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి!?
సమాధానం :
గబ్బిలం
బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?
సమాధానం :
తాళిబొట్టు
పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు?
సమాధానం :
దానిమ్మ గింజలు
బాడీ కాని బాడీ, ఏమి బాడీ?
సమాధానం :
లంబాడి
పలుకు కాని పలుకు, ఏమి పలుకు?
సమాధానం :
వక్క పలుకు
పైన పటారాము! లోన లొటారాము!!?
సమాధానం :
మేడి పండు
మతి కాని మతి, ఏమి మతి?
సమాధానం :
శ్రీమతి
మంచము కింద మామ! ఉరికి పోదాం రావా!!?
సమాధానం :
చెప్పులు
మర కాని మర, ఏమి మర?
సమాధానం :
పడమర, అలమర
మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను!!
సమాధానం :
కొబ్బరి కాయ
మామ కాని మామ, ఏమి మామ?
సమాధానం :
చందమామ
మీకు సొంతమైనది కాని, మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు?
సమాధానం :
మీ పేరు
మని కాని మని, ఏమి మని?
సమాధానం :
ఆమని
మానము కాని మానము, ఏమి మానము?
సమాధానం :
విమానము
మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక మూలన పడుకుంటాము?
సమాధానం :
చెప్పులు
పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది?
సమాధానం :
మొగిలి పువ్వు
చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది?
సమాధానం :
కళ్ళ జోడు
మేక తిన్నాను, తోక పారేశాను?
సమాధానం :
వంకాయ
మూసింది తెరువ! తెరువంగ అరువ!!?
సమాధానం :
ఆవులింత
రాజు వారి తోటలో రోజూ కాసే పూలు! చూసే వారే కాని కోసే వారు లేరు!!?
సమాధానం :
నక్షత్రాలు
వరి కాని వరి, ఏమి వరి?
సమాధానం :
జనవరి
ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నింటికన్నా వేగమైనది?
సమాధానం :
మనసు
శాఖలున్నా ఆకులు లేనిది?
సమాధానం :
సంస్థ
చాచుకొని, సావిట్లో పడుకునే ముసలమ్మ, ముడుచుకొని మూల నిలబడింది?
సమాధానం :
చాప
చెయ్యని కుండ! పోయని నీరు!!?
సమాధానం :
కొబ్బరి కాయ
నరుడు కాని నరుడు, ఏమి నరుడు?
సమాధానం :
వానరుడు
నగలు కాని నగలు, ఏమి నగలు?
సమాధానం :
శెనగలు
నూరుగురు అన్నా తమ్ముళ్లకు ఒకటే మొలతాడు?
సమాధానం :
చీపురు
పట్టుకుంటే పిడికెడు, విడిస్తే ఇల్లంతా?
సమాధానం :
దీపం
పట్టు సంచిలో బంగారు గుడ్లు?
సమాధానం :
ఎండు మిరపకాయలు
మనదొకటి తడవదు, ఎండదు, ఆరదు?
సమాధానం :
నీడ
వెండి గిన్నెలో దాగిన బంగారం?
సమాధానం :
కోడి గుడ్డు
మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?
సమాధానం :
ప్రేమ
రెక్కలుంటాయి, రయ్ రయ్ మంటుంది, ఎగురలేదు కాని ఎగురవేస్తుంది?
సమాధానం :
ఫ్యాన్
రణము కాని రణము, ఏమి రణము?
సమాధానం :
చరణము
బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?
సమాధానం :
మొక్కజొన్న
రాయి కాని రాయి, ఏమి రాయి?
సమాధానం :
కిరాయి
ఉన్న చోటే ఉంటుంది, వేళా పాలా చెపుతుంది?
సమాధానం :
గోడ గడియారం
రంగము కాని రంగము, ఏమి రంగము?
సమాధానం :
చదరంగము
మతము కాని మతము, ఏమి మతము?
సమాధానం :
కమతము
అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?
సమాధానం :
పెదవులు
వాలు కాని వాలు, ఏమి వాలు?
సమాధానం :
ఆనవాలు
రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?
సమాధానం :
రెండు ఐదు పైసల బిళ్ళలు
వల కాని వల, ఏమి వల?
సమాధానం :
నవల
రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?
సమాధానం :
చంద్రుడు
గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం?
సమాధానం :
అగ్గి పెట్టె
వారు కాని వారు, ఏమి వారు?
సమాధానం :
నవారు
విత్తనం లేకుండా మొలిచేది?
సమాధానం :
గడ్డము
Comments
Post a Comment