Skip to main content

ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం

ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం
ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు కనుక్కోండి చూద్దాం 

1). ఈ ఆకుకూర Englishలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర. ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

2). ఈ ఆకుకూర నక్షత్రం (Star)తో మొదలయ్యే ఆకుకూర.ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

3). ఈ కూరగాయ కాగితం చుడితే వచ్చే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

4). ఈ కూరగాయ సమస్యలలో వున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?


5). ఈ కూరగాయ హిందీ సంఖ్యలో రెండు సంఖ్యతో వచ్చే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

6). ఈ కూరగాయ ఇంగ్లీషులో దారి చూపించే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

7). ఈ కూరగాయ ఇంగ్లీషులో తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

8). ఈ కూరగాయ కష్టాలలో సంతోషంలో చేదుగా వున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 


9). ఈ కూరగాయ హిందీలో చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర.ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

10). ఈ కూరగాయ సగంతో మొదలయ్యే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

11). ఈ ఆకుకూర నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర. ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

12). ఈ ఆకుకూర వనంలో వున్న ఆకుకూర. ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

13). ఈ ఆకుకూర ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర. ఆ ఆకుకూర ఏమిటో చెప్పుకోండిచూద్దాం?

14). మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

15). ఈ కూరగాయ చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 

16). ఈ కూరగాయ నీళ్ల తో వున్న కూరగాయ. ఆ కూరగాయ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 


Answers :

1). ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర... గోంగూర

2). నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర... చుక్క కూర

3). కాగితం చుడితే వచ్చే కూరగాయ ... పోట్ల కాయ

4). సమస్యలలో వున్న కూరగాయ... చిక్కు డు కాయ

5). రెండు అంకెతో వచ్చే కూరగాయ Do ndakaya/

6). దారి చూపించే కూరగాయ(దుంప) Beetroot

7). తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ కీ రదోస కాయ

8). కష్టాలలో వున్న కూరగాయ ... Kakarkaya / చిక్కుడు కాయ

9). చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర... బచ్చ లకూర

10). సగంతో మొదలయ్యే కూరగాయ ... అర టి కూర

11). నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర ... Koyyagura

12). వనంలో వున్న ఆకుకూర ... తోట కూర

13). ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర ... కరి వె పకు

14). మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ ... Panasakaya

15). చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ … Carrot

16). జలచరంతో వున్న కూరగాయ ... Neerulli / సొర కాయ.

Comments

Popular posts from this blog

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles

100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles మెదడుకు మేత: ఆలోచింపజేసే 100 తెలుగు పొడుపు కథలు (With Answers) పిల్లల కోసం 100 తెలుగు పొడుపు కథలు (Telugu Podupu Kathalu with Answers) మీ మెదడుకు పదును పెట్టే 100 సరదా పొడుపు కథలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు నచ్చే బెస్ట్ తెలుగు పొడుపు కథలు (Podupu Kathalu) చదవండి. 100 ఆసక్తికరమైన తెలుగు పొడుపు కథలు - సమాధానాలతో | Telugu Riddles సామాన్యమైన వస్తువులే కానీ సమాధానం చెప్పడం కష్టం! ఇక్కడ ఉన్న 100 తెలుగు పొడుపు కథలను మీరు ఛేదించగలరా? సమాధానాలతో సహా ఇప్పుడే చూడండి. పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచే 100 సులభమైన మరియు కఠినమైన పొడుపు కథలు. తెలుగులో జవాబులతో సహా (Telugu Riddles for Kids) ఇక్కడ చదవండి. ఇంటి వస్తువులు (Household Items)  1). దీనికి పళ్ళు (Teeth) ఉంటాయి కానీ ఎవరినీ కొరకదు. మన తలని అందంగా మారుస్తుంది. (దువ్వెన)  2). దీనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. మనం దారం ఎక్కిస్తేనే బట్టలు కుడుతుంది. (సూది)  3). దీనికి ప్రాణం లేదు, కానీ ఇది లేకపోతే ఇల్లు సురక్షితం కాదు. దీని చెవి మెలితిప్పితేనే నో...

100 Funny Sametalu

100 సరదా సామెతలు 100 సరదా సామెతలు ఈ బ్లాగ్‌లో మీరు చదవబోయేది 100 సరదా సామెతలు వాక్యాలు. ఇవి మన తెలుగు పల్లెటూరి మాటల మాదిరిగానే చమత్కారంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను సరదాగా, వ్యంగ్యంగా చెప్పే ఈ వాక్యాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. 1). ఎండలో కట్టెలు తెచ్చినవాడే, నీడలో కూర్చున్నవారి దెబ్బలు తింటాడు. 2). పొట్టలో అన్నం లేనివాడే, దానం మీద పెద్ద బోధలు చెబుతాడు. 3). బుడతడు వంటచేస్తే, కారం ఎక్కువే ఉప్పు తక్కువే. 4). ఎద్దు లేనివాడే, పంట చేల లెక్కలు వేస్తాడు. 5). కోడిపుంజు లేనివాడే, ఉదయం కూయిస్తాడు. 6). గాజు ఇంట్లో వాడే, రాళ్లతో ఆడుకోవాలనుకుంటాడు. 7). చేతిలో పంచదార లేనివాడే, ఇతరుల చాయ్ తీపి తక్కువనుకుంటాడు. 8). వానలో తడిసిన వాడికే, ఎండలో నీడ విలువ తెలుస్తుంది. 9). కడుపు నిండిన వాడే, “అన్నం వృథా చేయొద్దు” అంటాడు. 10). బెల్లం రుచి తెలియని వాడే, తీపి గురించి బుద్ధులు చెబుతాడు. 11). ఆవు లేకపోయినా, పాలు అమ్ముతున్నట్లు లెక్కలు వేసేవాళ్లు చాలామంది. 12). బజార్లో గుడ్డు కొన్నవాడే, కోళ్ల పెంపకం మీద క్లాసు పెడతాడు. 13). పనేమీ లేకపోతే, పొరుగింటి పొయ్యి పొగ లెక్క...

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు