పొడుపు కథలు With Answers
పొడుపు కథలు With Answers
1). నాకు ఆరు ముఖాలు ఉంటాయి. కానీ శరీరం లేదు. 21 కళ్లు ఉంటాయి. కానీ, చూడలేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
2). నడిచేటప్పుడు ఎగురుతాను. నిల్చున్నప్పుడు కూర్చుంటాను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?
3). నా దగ్గర ఆరు కోడిగుడ్లు ఉన్నాయి. వాటిలో రెండు పగలగొట్టాను.. రెండు వండాను. రెండు తిన్నాను. ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉంటాయి? చెప్పుకోండి చూద్దాం?
4). ఇద్దరు చిన్నారులు ఒకే సమయం, ఒకే నెల, ఒకే సంవత్సరంలో పుట్టారు. కానీ, కవలలు కాదు. ఇదెలా సాధ్యం? చెప్పుకోండి చూద్దాం?
చెప్పుకోండి చూద్దాం!
1. చేతికి దొరకనిది, ముక్కుకు దొరుకుతుంది.అది ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. పిడికెడంత పిండిని పదిమంది కూడా తినలేరు. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. చూపులేని కన్ను, సుందరమైన కన్ను, తోకకుండే కన్ను, కన్నుగాని కన్ను. కాలకంఠుని కన్ను. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం?
1). చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది. ఆ సిటీ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
2). సందు కాని సందు. ఈ సందుల్లో ఎవ్వరూ వెళ్ళలేరు. ఆ సందు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
3). 200 నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయగలరు.?
4). ఒక్కసారిగా ఆందోళన కలిగించే కలం. కలం కాని కలం. ఆ కలం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
5). అందరికీ సహాయం చేసే కాలం. కాలం కాని కాలం. ఆ కాలం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
6). సంపదలను ఇచ్చే బడి. బడి కాని బడి.ఆ బడి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
7). మొక్కకు పూయని రోజాలు. రోజాలు కాని రోజాలు. ఆ రోజాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
8). రక్షణ ఇచ్చే కారం. కారం కాని కారం.ఆ కారం ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
9). తాజ్మహల్ ఎక్కడుంది?
10). అన్నం తినకపోతే ఏమవుతుంది?
ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన రెండు అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదం వస్తుంది.
1.ఓ పక్షి. చి _ _
2.వేగమైన పరుగు. చి _ _
3. పాతదుస్తులకు ఉండేది. చి _ _
4.వర్షం. చి _ _
5.ఒక రకమైన విసుగు. చి _ _
6.మనసు. చి _ _
7.బొమ్మ. చి _ _
8. తుప్పు. చి _ _
9. గుర్తు. చి _ _
10.మొక్కకు వచ్చేది. చి _ _
1. ఆకు వేసి వడ్డిస్తారు కానీ, ఆ ఆకును తీసేసి అన్నం తింటారు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
2. కానరాని అడవిలో నీళ్లు లేని మడుగు.. నీళ్లు లేని మడుగులో కానరాని నిప్పు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
3. పోక చెక్కంతటి పొట్టిదే కానీ, కాగంత కడవను మోస్తుంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
4. కోట కాని కోట. ప్రతి ఇంటికో కోట ఉంటుంది. ఆ కోట ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
5. యుద్ధం కాని యుద్ధం. కత్తులు లేని భీకర యుద్ధం. గెలుపోటములు చెరిసగం. ఆ యుద్ధం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
6. పటం కాని పటం. ఆకాశాన ఉండే పటం. తోక మాత్రం కింద ఉండే పటం. పటం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?
పొడుపు కథలు :
1. కరివేపాకు
2. ఆకలి
3. పొయ్యి
4. తులసి కోట
5. చెస్
6. గాలిపటం
Answers:
చెప్పుకోండి చూద్దాం:
1. వాసన
2. సున్నం
3. నెమలి పింఛం
తమాషా ప్రశ్నలు:
1. పబ్లిసిటీ
2. పసందు
3. ఒక సారే.(తర్వాత 198 అయిపోతుంది కదా) రెండే.
4. కలకలం
5. సాయంకాలం
6.రాబడి
7.శిరోజాలు
8. ప్రాకారం
9. కట్టినచోటే
10. మిగిలిపోతుంది
రెండు!:
1. చిలుక
2. చిరుత
3. చిరుగు
4. చినుకు
5. చిరాకు
6.చిత్తము
7. చిత్రము
8. చిలుము
9. చిహ్నము
10. చిగురు
చెప్పుకోండి చూద్దాం!:
1. వాసన
2. సున్నం
3. నెమలి పింఛం
: 1. CARTOON
2. ISLAND
తప్పులే తప్పులు:
1. బుధవారం
2. ఆకాశం
3. బహుమానం
4. అనుమానం
5. వ్యతిరేకం
6. సందర్భం
7. మకరందం
8. పర్యవసానం
: 1. CARTOON
2. ISLAND
Comments
Post a Comment