పొడుపు కథలు
1. ముక్కుమీద కెక్కు. ముందర చెవులు నొక్కు. జారిందంటే పుటుక్కు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
2. ఒళ్లంతా కళ్లే. కానీ, వాటిలో చూసేవి మాత్రం రెండే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
3. లోపల బంగారం. పైన మాత్రం వెండి. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
4. కాళ్లు రెండే. కానీ, చేతులు మాత్రం ఎక్కువే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
పొడుపు కథలు : 1. కళ్లజోడు 2. నెమలి 3. కోడిగుడ్డు
4. నిచ్చెన
Comments
Post a Comment