Skip to main content

Posts

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 1). నేను 3 అక్షరాల తెలుగు పదాన్ని.  గజంలో ✅. గళంలో ❌.  రుతువులో ✅. రుజువులో ❌.  గోవులో ✅. గోడలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  అరుదులో ✅. బిరుదులో ❌.  నురుగులో ✅. పెరుగులో ❌.  రావిలో ✅. చెవిలో ❌.  గంపలో ✅. దుంపలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం  Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం  1). బంటి _ _ ఏ ఆకారంలో ఉంటుందని _ _ జ అడుగుతోంది. 2). చంటి అక్కడ పెట్టిన పళ్లెంలోని ఆ _ _ మొత్తం తింటే బంగారు _ _ బహుమతిగా ఇస్తారట. 3). బంటి _ _ జావ తాగాలంటే _ _ చెంబు మాత్రమే వాడాలా? జవాబు: 1. భూమి 2. హారం 3.రాగి

తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం

తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం  తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం  1). వరం కాని వరం. ఈ వరం కొందరికి ఆనందం కలిగించేది మరియు బాధ కలిగించేది. ఆ వరం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 2). వనం కాని వనం. ఈ వనం కనిపించని వనం. ఆ వనం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). రింగ్ కాని రింగ్. ఈ రింగ్ ప్రాణాలు తీసే రింగ్. ఆ రింగ్ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 4). రాయి కాని రాయి. ఈ రాయి చేపల్ని తినే రాయి. ఆ రాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answers: 1.కలవరం 2. పవనం 3. ఫైరింగ్ 4. కొక్కిరాయి

వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం

వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం  వాక్యాల అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం  1). బంT ఎందుకు 6 బయట 7స్తూ ఉన్నావు. 2). మా చెల్లి Sరోజా లెక్కలు అర్థం కాకుంటే 7స్తోంది. 3). చంT 100న రావు బాగున్నారా? 4). పెద్దలకు 100నం చేయాలి..! 5). 1/2టి కాయ బజ్జీలు తినాలనిపిస్తుందా? 6). కూరలో ఉప్పు తక్కువ 1000 7). నువ్వు 10కాలాల పాటు చల్లగా ఉండాలి 8). చెడు వ్యసనాలతో ఆయువు 3తుంది.

సామెతలు తెలుసా

సామెతలు తెలుసా 1). ఇంటి _ _ లంకకు _ _. 2). _ _ లేనిదే _ _ రాదు. 3). ఆకలి _ _ ఎరుగదు. నిద్ర _ _ ఎరుగదు. 4). తన _ _ _ తన _ _ _. 5). అదిగో _ _ అంటే ఇదిగో __ అన్నట్లు. 6). కూర్చొని _ _ కొండలైనా _ _ _ తాయి. 7). _ _ చాలదని _ _ పూడ్చినట్లు. 8). _ _ _ _ _  ఒలిచి _ _  _ పెట్టినట్లు. 9). _ _ వాడికి _ _ వాడు లోకువ. 10). _ _ లేకుండా _ _ రాదు. 11). _ _ మాటకు _ _ లేదు. జవాబు: Answer: 1. గుట్టు, చేటు 2. నిప్పు, పొగ 3. రుచి, సుఖం 4. కోపమే, శత్రువు 5. పులి, తోక 6. తింటే, కరుగుతాయి 7. తాడు, బావి 8. అరటిపండు, చేతిలో  9. చెప్పే, వినే  10. నిప్పు, పొగ  11. గాలి, గోడ

గజిబిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం

గజి బిజి పదాలు 1). పా ల ఠ శా. 2). వా సం ర పు త. 3). రా న జ నా. 4). వి ల యం ద్యా. 5). వి ధి రో. 6). బం టి గు ఎ లు. 7). చి త పు రు లి. 8). త లు ల గా  శీ లు. 9). హా ప రం రి. 10). స్థ ఆ లం ట. 11). లు లో క్తు ఛ. 12). వి దా లు భే. 13). రి రా స ప లు. 14). లు కు త్సా ఔ హి. 15). చె ట్టు రు గ వు. 16). వం ది ట గ. 17). గ్రా భ మ స. 18). వే ట్టు ప చె. 19). చ మం లి ట. 20). ఓ క్కు టు హ. 21). గా న లి వా. 22). సూ తి ర్య కాం. 23). గం డి బ ట. 24). ము క పు డ క్కు. 25). గా బం రం. 26). సో వా మ రం. 27). అం లి బ. 28). మం వా గ రం ళ. 29). రా క మ లు చి. 27). న రా జ నా. 28). ఆ గ్యం రో . 29). బు రం ధ వా. 30). బా లు ల న టు. 31). శ వు త్రు లు. 32). శు ము భ లు. 33). శు లు కాం భా క్ష. 34). బం గు టి ఎ లు. 35). తా చె టి ట్టు.

నేనెవర్ని చెప్పుకొండి చూద్దాం

1). నేను 4 అక్షరాల పదాన్ని.  'అత్త'లో ✅  'నత్త’లో ❌.  'రణం'లో ✅  'కణం'లో ❌.  'చేదు'లో ✅  'కాదు'లో ❌.  'రాయి'లో ✅  'రాణి'లో ❌.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? 2). నేను 3 అక్షరాల పదాన్ని.  'వల'లో ✅  'అల’లో ❌.  'రవ్వ'లో ✅  'అవ్వ'లో ❌.  'సగం'లో ✅  'వేగం'లో ❌.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?