Skip to main content

Posts

Showing posts from September, 2023

నేనెవర్ని

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఊపిరి'లో ఉంటాను కానీ 'పిరికి'లో లేను. 'లయ'లో ఉంటాను. కానీ 'ఈల'లో లేను. 'లత'లో ఉంటాను కానీ 'మమత'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'దారం'లో ఉంటాను కానీ 'ఘోరం'లో లేను. 'పత్తి'లో ఉంటాను. కానీ 'సుత్తి'లో లేను. 'బరి'లో ఉంటాను. కానీ 'బలి'లో లేను. 'కంచు'లో ఉంటాను కానీ 'మంచు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

ఒక అమ్మాయి ఒక Shop వెళ్ళి  200 తో Mobile రీచార్జ్ చేసుకోని 2000 నోట్ ఇచ్చింది. ఆ నోట్ పక్క షాపులో ఇచ్చి చిల్లర తెచ్చి ఆమెకు ఇవ్వవలసిన 1800 ఇచ్చి పంపేసాను. తర్వాత ఆమె ఇచ్చిన  2000  దొంగ నోట్ చెప్పి నాకు ఇచ్చి, నా దగ్గర వేరే 2000 నోటు తీసుకుపోయాడు  ఇప్పుడు నాకు ఎంత నష్టం వచ్చింది!

Guess me

కొత్త పట్టణంలో 100 ఇళ్లను నిర్మించారు. ఒక్కో ఇంటికి 1 నుంచి 100 నంబర్లతో ప్లేట్లు తయారు చేశారు. ఈ ప్లేట్లు పై 9 సంఖ్య ఎన్నిసార్లు కనిపిస్తుంది? 100 houses were built in the new town. Plates numbered from 1 to 100 were made for each house. How many times does the number 9 appear on these plates?

పొడుపు కథలు

1. లాగి విడిస్తేనే బతుకు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. రాళ్ల అడుగున విల్లు. విల్లు కొనన ముల్లు. ఇంతకీ అదేంటో తెలుసా? 3. కడుపు నిండా రాగాలు. ఒంటి నిండా గాయాల ఏంటో చెప్పగలరా?

Relationship

దిలీప్ రాహుల్ సోదరుడు. సుజాత అతుల్ సోదరి. రాహుల్ సుజాత కొడుకు. దిలీప్‌కి సుజాతకి సంబంధం ఎలా ఉంది?

నేనెవర్ని

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'వల'లో ఉంటాను కానీ 'అల'లో లేను. 'డప్పు'లో ఉంటాను. కానీ 'అప్పు'లో లేను. 'దెయ్యం'లో ఉంటాను కానీ 'బియ్యం'లో లేను. 'జబ్బ'లో ఉంటాను కానీ 'జబ్బు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?  2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ఆలు'లో ఉంటాను కానీ 'రోలు'లో లేను. 'హాస్యం'లో ఉంటాను కానీ 'జోస్యం'లో లేను. 'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

సామెతలు చెప్పుకోండి చూద్దాం

1) మోసేవాడికి తెలుసు _ _ _ బరువు. 2) ముందు నుయ్యి.. వెనక _ _ 3) _ _ _ లో పోసిన పన్నీరు. 4) తింటే గారెలు తినాలి. వింటే _ _ _ వినాలి. 5) కొరివితో _ _ గోక్కున్నట్లు

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం..? అన్నదమ్ములిద్దరు మూడు మామిడి పండ్లను ముక్కలు చేయకుండానే సమానంగా తిన్నారు. అదెలా సాధ్యమైంది. మీరేమైనా చెప్పగలరా?

నేను ఏమిటి?

నేను సజీవంగా లేను, కానీ నేను పెరుగుతాను; నాకు ఊపిరితిత్తులు లేవు, కానీ నాకు గాలి కావాలి; నాకు నోరు లేదు, కానీ నీరు నన్ను చంపుతుంది. నేను ఏంటి? 

రెండిటికీ మొదట చివర ఒకే జవాబు

సాధించగలరా? ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ఆ ఖాళీలను సరైన అక్షరాలతో పూరిస్తే.. రెండు అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. BAN _ _ _ _ FISHER 2. GO _ _ _ _ LOAD 3. PANT _ _ _ _ SELF 4. BUT _ _ _ SURE 5. HAT _ _ _ DISH

ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరో మీకేమైనా తెలుసా?

ఎవరా వ్యక్తి? సురేష్ తన ఇంటికి వచ్చిన స్నేహితులకు ఫొటో ఆల్బమ్ చూడమని ఇచ్చాడు. అందులో ఓ ఫొటోను చూపిస్తూ... 'నాకు అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లూ లేరు. ఈ ఫొటోలోని కుర్రాడి తండ్రి మా నాన్నగారికి కొడుకు' అని చెప్పాడు. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరో అర్థం కాక స్నేహితులంతా జుట్టు పీక్కున్నారు. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరో మీకేమైనా తెలుసా?

నేను ఏంటి?

నాకు 4 కాళ్లు మరియు తోక ఉన్నాయి. నాకు మీసాలు ఉన్నాయి. ప్రజలు నన్ను పెంపుడు జంతువుగా ఉంచడానికి ఇష్టపడతారు. నేను ఏంటి?

టీచర్ ఇద్దరికి ఒకే జవాబు ఇచ్చింది.. అది ఏంటి?

ఒక క్లాసులో టీచర్ జడలోని పువ్వును చూసి ఒక స్టూడెంటు టీచర్ మీ జడలో పువ్వు కలర్ ఏంటి ? అని అడిగాడు అంతలోనే క్లాసుకు ఆలస్యంగా వచ్చిన ఇంకో స్టూడెంటు లోపలికి రానా టీచర్ ? అని అడిగాడు..అప్పుడు టీచర్ ఇద్దరికి ఒకే జవాబు ఇచ్చింది.. అది ఏంటి?

కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది?

మీరు టేబుల్‌పై కప్పు ఉంచారు. మీరు ఉత్తరం వైపు చూపుతున్నారు మరియు కప్పు దక్షిణం వైపు ఉంది. కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది? కప్పు ఏ పొజిషన్‌లో ఉన్నా, దాని హ్యాండిల్  ఎప్పుడూ బయటే ఉంటుంది!

అది ఎక్కడ పడుతుందో చెప్పుకోండి చూద్దాం?

ఉత్తరం వైపు గాలి వీస్తోంది అప్పుడే ఒక చెట్టు నుండి వేరుశెనగ కాయ పడిపోతే, అది ఎక్కడ పడుతుందో  చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'పుంత'లో లేను. 'పలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'దర్జీ'లో ఉంటాను కానీ 'ఆర్జీ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'నాటు'లో ఉంటాను కానీ 'పోటు'లో లేను. 'విత్తం'లో ఉంటాను కానీ 'చిత్తం'లో లేను. 'కుడక'లో ఉంటాను కానీ 'ముక్కుపుడక'లో లేను. 'ఉడుము'లో ఉంటాను కానీ 'ఉరుము'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

మీ తల్లి సోదరుని ఏకైక బావ మీ సోఫాలో నిద్రిస్తున్నారు. మీ సోఫాలో ఎవరు నిద్రిస్తున్నారు?

మీ తల్లి సోదరుని ఏకైక బావ మీ సోఫాలో నిద్రిస్తున్నారు. మీ సోఫాలో ఎవరు నిద్రిస్తున్నారు ?

సామెతలు

రాయగలరా? ఇక్కడ కొన్ని అసంపూర్తి సామెతలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయగలరా? 1). _ _  కొంచెం _ _ ఘనం. 2).  _ _ _ మాట _ _ _ మూట. 3).  _ _ చెట్టుకు _ _ గాలి. 4).  _ _ కన్నా...   _ _ నయం. 5).  _ _ ను తవ్వి _ _ _ ను పట్టినట్లు.

పొడుపు కథలు

పొడుపు కథలు 1. ముసుగేస్తే మూలకు కూర్చుంటాడు. కాగితం కనిపిస్తే మాత్రం కన్నీరు కారుస్తాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?  పెన్ను  2. వేలెడంత కూడా ఉండదు. కానీ దాని తోక మాత్రం బారెడు. ఇంతకీ అది ఏంటో తెలుసా? సూది 

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం 1. చెప్పేవి చూడలేవు. చూసేవి చెప్పలేవు. ఏమిటవి? 2. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి భోజనం చేస్తాం. ఏమిటది? 3. గూటిలో గువ్వ.. ఎంత గుంజినా రాదు! ఏంటో తెలుసా? 4. అరచేతి పట్నాన, అరవై రంధ్రాలు. అదేంటో చెప్పుకోండి చూద్దాం? చెప్పుకోండి చూద్దాం: 1. పెదవులు, కళ్లు 2. కరివేపాకు 3. నాలుక 4. జల్లెడ

Funny Question

Funny ? Questions 1. హార్ట్ ఉంటుంది కానీ.. అవయవాలు ఉండనిది..? 2. చాలా ఉంటాయి. కానీ ఒక్క లాక్ కూడా తీయలేవు. 3. COWని 13 లెటర్లలో రాయండి..? 4. ముఖంముఖం చూసుకునే లెటర్స్ ఏవి..? 5. చీమలు కౌలుదారులు ఎప్పుడవుతాయి..? 6. Eతో ముగిసే నంబర్లు ఏవి..?

వారు ఎన్ని ఆటలు ఆడారు ?

రాజు మరియు రాము టెన్నిస్ ఆడాలని నిర్ణయించుకున్నారు. వారు ఆడిన ప్రతి గేమ్‌పై 100rs పందెం వేసుకున్నారు. రాజు మూడు  గేమ్లు గెలిచారు మరియు రాము 500rs గెలుచుకున్నారు. వారు ఎన్ని ఆటలు ఆడారు ?

పొడుపు కథ

పొడుపు కథ తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు

ఏది బిన్నం

ఆ ఒక్కటి ఏది..? కింద కొన్ని పదాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం. 1. TELEVISION, HISTORY, SCIENCE, MATHS 2. PAPER, POSTER, BOOK, PEN 3. BRINJAL, POTATO, CABBAGE, CHOCOLATE 4. DOG, CAT, FOX, SNAKE

చెప్పుకోండి చూద్దాం

ఐదుగురు సోదరులు, రాహుల్, రాకేష్, రాజన్, రూపమ్ మరియు రతుల్ అందరూ శీతాకాలపు మధ్యాహ్నం ఒక గదిలో బిజీగా ఉన్నారు. రాహుల్ చదువుతున్నాడు, రాకేష్ చదరంగం ఆడుతున్నాడు, రూపమ్ బట్టలు మడిచాడు, రాజన్ పెయింటింగ్ వేస్తున్నాడు. రతుల్ ఏం చేస్తున్నాడు? సమాధానం : రతుల్ చెస్ ఆడుతున్నాడు.

గజిబిజి బిజిగజి

గజిబిజి బిజిగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి. 1. తాములుసీరా 2. డిదిగాచ్చపఉ 3. గాలకోయినం 4. చిరుమాగువి 5. ఇంచాంపంగవ 6. డ్రులుషచు

జింకలు మరియు బాతుల సంఖ్యను కనుగొనండి.

జంతుప్రదర్శనశాలలో జింకలు మరియు బాతులు ఉన్నాయి. తలలను లెక్కిస్తే మొత్తం 180, కాళ్లను లెక్కిస్తే మొత్తం 448 ఉంటాయి. జింకలు మరియు బాతుల సంఖ్యను కనుగొనండి.