Skip to main content

Posts

Showing posts from October, 2023

సామెతలు

1. మోసేవాడికి తెలుసు _ _ _ బరువు. 2. ముందు .. నుయ్యి వెనక _ _  3. _ _ _ లో పోసిన పన్నీరు. 4. తింటే గారెలు తినాలి. వింటే _ _ _ వినాలి. 5. కొరివితో _ _ గోక్కున్నట్లు.

బిజి గజి

బిజగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. రసవినక 8. షేజభికంలా

పొడుపు కథలు

పొడుపు కథలు I. కడుపు నిండా నల్లటి రాళ్లు, తెల్లటి పేగులు. ఏంటది? 2. చక్కని మానుకు కొమ్మలే లేవు. అదేంటో? 3. ఇల్లంతా వెలుగే కానీ, బల్ల కింద మాత్రం చీకటి. ఏంటబ్బా? 4. కప్ప తాకని నీరు.. పురుగు పట్టని పువ్వు. ఏంటో తెలిసిందా?

హరి ప్రస్తుత వయస్సు ఎంత?

హరి వయసు రాకేష్ వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఐదేళ్ల తర్వాత హరి వయసు రాకేష్ వయసు కంటే మూడు రెట్లు ఎక్కువ. హరి ప్రస్తుత వయస్సు ఎంత?

నేనెవర్ని

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తాజా'లో ఉంటాను కానీ కాజా'లో లేను. 'గుడి'లో ఉంటాను కానీ 'బడి'లో లేను. 'నీడ'లో ఉంటాను కానీ 'గోడ'లో లేను. 'కారు'లో ఉంటాను కానీ 'కాలం'లో లేను. నేనెవరినో తెలిసిందా 2. నేనో అయిదక్షరాల పదాన్ని. 'పాము' ఉంటాను కానీ 'వాము'లో ఉండను. 'వల'లో ఉంటాను కానీ 'వనం'లో ఉండను. 'కల'లో ఉంటాను కానీ 'ఇల'లో ఉండను. 'వరం'లో ఉంటాను కానీ 'వారం'లో ఉండను. 'స్వర్గం'లో ఉంటాను కానీ 'స్వరం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

నేనెవర్ని

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'చలనం'లో ఉన్నాను కానీ 'ప్రజ్వలనం'లో లేను. 'బలి'లో ఉన్నాను కానీ 'బరి'లో లేను. 'చీము'లో ఉన్నాను కానీ 'నోము'లో లేను. 'మట్టి'లో ఉన్నాను కానీ 'బట్టి'లో లేను. 'రైలు'లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను ఆరు అక్షరాల పదాన్ని. 'అంజి'లో ఉన్నాను. కానీ 'గంజి'లో లేను. 'తరాజు'లో ఉన్నాను కానీ 'రారాజు'లో లేను. 'సిరి'లో ఉన్నాను కానీ 'పసి'లో లేను. 'క్షమ'లో ఉన్నాను కానీ 'దోమ'లో లేను. 'యాత్ర'లో ఉన్నాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉన్నాను కానీ 'కంది'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేనెవర్ని

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్మ'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'కల'లో లేను. 'తారు'లో ఉంటాను కానీ 'బోర్డు'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'నయం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'సత్యం'లో ఉంటాను కానీ 'నిత్యం'లో లేను. 'మసి'లో ఉంటాను కానీ 'కసి'లో లేను. 'లాస్య'లో ఉంటాను కానీ 'లాఠీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? 3. రెండు అక్షరాల పదాన్ని నేను. 'బొమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్మ'లో లేను. 'అట్టు'లో ఉంటాను ''కానీ 'అట్ట'లో లేను. నేనెవర్ని?

నేనెవర్ని

నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,7,8,3,2  కలిపితే తప్పు, 2,7,3,4 - తూర్పు, 6,5,4,7,8 - ముఖ్యమైన, 1,7,3,4 - వేగం   అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(festival)

పొడుపు కథలు

1. తెల్లని సువాసనల మొగ్గ. ఎర్రగా పూసి మాయమై పోతుంది. ఏమిటది? 2. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే! ఏంటో చెప్పుకోండి చూద్దాం? 3. ఒక దూలానికి నలుగురు దొంగలు. ఏంటో తెలుసా? 4. ముఖం లేకున్నా.. బొట్టు పెట్టుకుంటుంది. ఏంటది ?

తప్పులే తప్పులు

తప్పులే తప్పులు కింది పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం. 1. అంతరిక్ష్యం 2. ప్రశ్నాపత్రం 3. సమాధాణాలు 4. షనగపిండి 5. చేతిఖర్ర 6. సమోసాలూ 7. జాబిల్లమ్మ 8. కళాకార్లు 9. జాంభవంతుడు 10. సౌకర్వాలు

చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు 1. తేలు కుట్టినా అరవకుండా ఉండేదేవరో చెప్పండి? - దొంగ 2. తలకిందులు చేస్తే తక్కువయ్యేది ఏమిటి? -9 3. డోర్లు, కిటికీలు లేని రూమ్ ? - మష్రూమ్ 4. రెండు అక్షరాలు కలిపితే మరింత చిన్నదయ్యే ఇంగ్లిష్ పదం? - Short (Shorter) 5. ఒకే తల్లికి, ఒకేసారి పుట్టారు. కానీ, ట్విన్స్ కాదు. ఎలా? - triples(ముగ్గురు పుడితే ఇలా అంటారు) 6. నాలుగు చక్రాలు ఉంటాయి. గాల్లోకి లేస్తుంది. ఏంటది? చెత్త ట్రక్కు 7. ప్రపంచంలో ప్రమాదకరమైన సిటీ ఏది ? - ఎలక్ట్రిసిటీ

నేనెవర్ని

నేను పదక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,2,3,4 కలిపితే రాజు, 10,6,3,4 - ఉంగరం, 7,8,9 - ఆమె, 5,6,7,8 - చేప ఇంతకీ నేనెవరిని ?(KINGFISHER)

పొడుపు కథలు

చెప్పగలరా? 1. పాములను చంపగలను కానీ గద్దను కాదు.. ఒళ్లంతా కళ్లే కానీ ఇంద్రుడిని కాదు.. నాట్యం చేస్తాను కానీ శివుడిని కాదు.. ఇంతకీ నేను ఎవరిని? 2. అమ్మ సోదరుడిని కాను.. అత్తకు భర్తనూ కాను.. కానీ, అందరికీ మామనే. ఎవరినబ్బా? 3. కొమ్ములుంటాయి కానీ ఎద్దుని కాను.. అంబారీ ఉంటుంది కానీ ఏనుగును కాను.. ఎవరినో చెప్పగలరా?

నేనెవర్ని?

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఇల్లు'లో ఉంటాను కానీ 'విల్లు'లో లేను. 'అత్త'లో ఉంటాను కానీ 'అట్టు'లో లేను. 'కోడి'లో ఉంటాను కానీ 'కోడె'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'మాట'లో ఉంటాను కానీ 'కోట'లో లేను. 'యాత్ర'లో ఉంటాను కానీ 'మాత్ర'లో లేను. 'జాలి'లో ఉంటాను కానీ 'ఆకలి'లో లేను. 'లంచం'లో ఉంటాను కానీ 'కంచం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

గణిత పదనిసలు

గణిత పదనిసలు 1) - 6బయట 7స్తూ కూర్చోకు...! 2) - గురువులకు 100నం చేద్దాం..! 3) - 10 కాలాల పాటు చల్లగా ఉండాలి...!! 4) - పెళ్లి కూతురు 1,00,000ణంగా ఉంది...! 5) -  పై 1/2లో 1/4రం ఉంది..! 6) - కూరలో కారం తక్కువ 1000..! 7) - సంగీత దర్శకుడు 1,00,00,000..!

Name's దాగి ఉన్నాయి

ఇక్కడున్న వాక్యాల్లో ప్రాంతాల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం. 1. అతడి పేరు మధు. రకరకాల పక్షులు, జంతువుల గొంతులను మిమిక్రీ చేయగలడు. 2. పరశురాం.. చీమలు, తమ కంటే 20 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు తెలుసా..!

నేనెవర్ని

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'రాజు'లో ఉంటాను కానీ 'గాజు'లో లేను. 'గిన్నె'లో ఉంటాను కానీ 'వన్నె'లో లేను. 'ముల్లు'లో ఉంటాను కానీ 'జల్లు'లో లేను. 'ఇద్దరు'లో ఉంటాను కానీ 'ఇగురు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ఆరాటం'లో ఉంటాను కానీ 'పోరాటం'లో లేను. 'కలం' లో ఉంటాను కానీ 'హలం'లో లేను. 'బలి'లో ఉంటాను కానీ 'బరి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

అయితే రజని భర్తకి రాణికి సంబంధం ఏమిటి ?

రజని తన స్నేహితురాలికి రాణిను. పరిచయం చేసింది. "ఆమె (రాణి) తండ్రి ఏకైక కొడుకు భార్య నా అత్తగారు .  అయితే రజని భర్తకి రాణికి  సంబంధం ఏమిటి ?