Skip to main content

Posts

Showing posts from January, 2024

తిక మక ప్రశ్నలు

(1) పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? జ. గ్రానైట్ (2). ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? జ. న్యూస్ పేపర్. (3). వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? జ. ఫైరింగ్

నేనెవర్ని

నేనెవర్ని? నేనో మూడక్షరాల పదాన్ని. 'వల'లో ఉంటాను. 'అల'లో ఉండను. 'మీసం'లో ఉంటాను. 'మీనం'లో ఉండను. 'కాంతం'లో ఉంటాను. 'కాంతి'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

Logic Question

1200 మంది కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు ఒక రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతి 15 మంది కానిస్టేబుళ్లకు ఒక ఎస్ఐని కేటాయిస్తే, ఆ రైళ్లో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు? 70 75 80 85

Logic Question

ఒక సమూహంలో కొన్ని ఆవులు, కోళ్ళు ఉన్నాయి. వాటి తలలు 48, కాళ్లు 140. అయితే ఆ సమూహంలో ఎన్ని ఆవులు ఉన్నాయి? 26 12 22 32

నేనెవర్ని

నేనెవర్ని? నేనో మూడక్షరాల పదాన్ని. 'సీసా'లో ఉంటాను. 'సీరం'లో ఉండను. 'గేయం'లో ఉంటాను. 'గేదె'లో ఉండను. 'తంత్రం'లో ఉంటాను. 'తంతు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

who I Am

నేనో నాలుగక్షరాల పదాన్ని. 'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను. 'యోగం'లో ఉంటాను. ‘భాగం’లో ఉండను. ‘మర’లో ఉంటాను. 'అర’లో ఉండను. ‘మాయం’లో ఉంటాను. 'మాయ'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

Riddles

పొడుపు కథలు 1. అన్నింటికన్నా విలువైనది. అందరికీ అవసరమైనది. అది లేకుంటే ఇంకేదీ అవసరం లేదు. ఇంతకీ ఏంటది? 2. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం. చెప్పుకోండి చూద్దాం? 3. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. అనుమతి లేకుండా ఎక్కడి పండ్లను తిన్నా దొంగ అసలే కాదు. ఏంటో తెలుసా? 4. నీటిమీద తేలుతుంది కానీ పడవకాదు. చెప్పకుండా పోతుంది కానీ ప్రాణం కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ ఏంటది? 5. కడుపులోన పిల్లలు.. కంఠములోన నిప్పులు. అరుపేమో ఉరుము.. ఎరుపంటే మాత్రం భయం?

Who I Am

నేనెవర్ని? 1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఏనుగు’లో ఉంటాను. ‘పీనుగు'లో ఉండను. 'కాలం'లో ఉంటాను. 'కలం’లో ఉండను. 'గ్రహం'లో ఉంటాను. 'గృహం'లో ఉండను. ‘తరువు'లో ఉంటాను. 'బరువు'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను. 'రుణం'లో ఉంటాను. 'రణం'లో ఉండను. ‘దుప్పి'లో ఉంటాను. 'నొప్పి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండిచూద్దాం?

Who I Am

1. నేను అయిదక్షరాల పదాన్ని. 'ఓడ’లో ఉంటాను. 'మేడ’లో ఉండను. 'నరం'లో ఉంటాను. 'వరం'లో ఉండను. 'మార్పు'లో ఉంటాను. 'కూర్పు'లో ఉండను. 'కీలు'లో ఉంటాను. 'కీడు'లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'అర’లో ఉంటాను. 'తెర'లో ఉండను. 'పేను'లో ఉంటాను. 'పేరు'లో ఉండను. 'రాత'లో ఉంటాను. 'రోత'లో ఉండను. 'గంప'లో ఉంటాను. 'కంప'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

గజి బిజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. 1. తిరాఅవమ 2. పనరిలపా 3. కోచుకంట 4. నిరంకహా 5. ఆణపరో 6. తిఅమను 7. కారయబీ 8. సేవంవాభా 9. గంరరంణ 10. దీళివపా

అయితే ఈ రోజు (మంగళవారం, బుధవారం, శనివారం లేదా ఆదివారం) వారంలోని ఏ రోజు?

ఈరోజు ఆదివారం లేదా బుధవారం కాదు. రేపు ఆదివారం లేదా బుధవారం కాదు. నిన్న శుక్రవారం కాదు. సోమవారం నిన్నటి రోజు కాదు, ఆదివారం కూడా కాదు. అయితే ఈ రోజు (మంగళవారం, బుధవారం, శనివారం లేదా ఆదివారం) వారంలోని ఏ రోజు?

క్రింది కాళ్లిలో మొదటి దానిలో రెండోవ దానిలో ఒకటే పదాలు వస్తాయి

I. వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ _ వెళ్తున్నాం.లో షి _ _ కు వెళుతున్నాం. 2. ప్రతి దానికీ _ _ గడం కాకుండా, బుద్ధిగా అడగడం _ _ వాటు చేసుకోవాలి. 3. హరి.. _ _ మొదట్లోనే చేయాల్సిన పనిని, శని _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు? 4. దాగుడు _ _ లు ఆడుతుంటే.. నా చేయి తగిలి నీళ్ల డ్రమ్ము _ _  కిందపడి పగిలిపోయింది. 5. _ _ లంతా చెట్టు కింద చేరి, _ _ నగ్రోవితో ఆడుకుంటున్నారు.

Who I Am

1. అయిదక్షరాల పదాన్ని నేను. 'పటం’లో ఉంటాను కానీ 'వాటం'లో లేను. 'దన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను. ‘విల్లు'లో ఉంటాను కానీ 'ఇల్లు'లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ 'గోరు'లో లేను. 'దండు'లో ఉంటాను కానీ 'మెండు'లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'అరక’లో ఉంటాను కానీ 'కాకర’లో లేను. 'జావ'లో ఉంటాను కానీ 'జామ'లో లేను. 'తాకట్టు'లో ఉంటాను కానీ 'కనికట్టు'లో లేను. 'దారం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను. నేనెవరిని?

Who I Am

నేనెవర్ని? 1. నేనో మూడక్షరాల పదాన్ని. 'పాట'లో ఉంటాను. 'ఆట'లో ఉండను. 'మాయ'లో ఉంటాను. 'మాల'లో ఉండను. ‘సంబరం'లో ఉంటాను. 'అంబరం’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను. 'కూటి'లో ఉండను. 'బడి'లో ఉంటాను. 'బలం'లో ఉండను. ‘పుండు'లో ఉంటాను. 'పండు'లో ఉండను. 'రాజు'లో ఉంటాను. 'రాయి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

గజి బిజి

1. లపోఆటీటలు 2. జనవిరంయగ 3. జుపుండికో 4. చ్చిగపడ్డి 5. మకాలురుబ్బు 6. టిఅచెరట్టు 7. శాఆకస్త్రంఠి 8. చూరిఖఆపు

WHO I AM

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'తోట'లో ఉంటాను కానీ 'కోట'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'కణం'లో ఉంటాను కానీ 'కలం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'రాట్నం'లో ఉంటాను కానీ 'పట్నం'లో లేను. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'చెత్త'లో ఉంటాను కానీ 'గిత్త'లో లేను. 'గట్టు'లో ఉంటాను కానీ 'గటి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

WHO I AM

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'పంకా’లో ఉంటాను కానీ 'ఢంకా'లో లేను. 'గుడి'లో ఉంటాను కానీ 'గురి'లో లేను. 'తుది'లో ఉంటాను కానీ 'మది'లో లేను. 'దౌడు'లో ఉంటాను కానీ 'దౌత్యం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను అయిదక్షరాల పదాన్ని. 'అర’లో ఉంటాను కానీ 'మర’లో లేను. 'భయం'లో ఉంటాను కానీ 'ద్వయం'లో లేను. ‘యమున'లో ఉంటాను కానీ 'జమున'లో లేను. 'హలం'లో ఉంటాను కానీ 'బలం'లో లేను. 'సమస్తం'లో ఉంటాను కానీ 'సమస్య'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

RIDDLES

పొడుపు కథలు 1. కదలవు కానీ పెరుగుతాయి.. తరుగుతాయి. ఏంటవి? 2. తిండి తినకుండా, నిద్రపోకుండా ఇంటికి కాపలా కాస్తుంది. ఎవరెంత కొట్టినా అరవలేదు. అదేంటి?

మీ Friend and your Mobile Number and Age ని కనుక్కోవచ్చు

"మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి. 1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి. 2) దాన్ని 2 తో గుణించండి. 3) ఆ మొత్తానికి 5 కూడండి. 4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి. 5)వచ్చిన మొత్తానికి 1775 కూడండి. 6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి. ఇప్పుడు 3 అంకెలు వస్తుంది... ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు....ఆశ్చర్యంగా ఉన్నది కదూ!

WHO I AM

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'గున్న’లో ఉంటాను కానీ 'దున్న'లో లేను. 'పైరు'లో ఉంటాను కానీ 'పైసా'లో లేను. 'రేవు'లో ఉంటాను కానీ 'నేరేడు'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'ఉప్పు'లో ఉంటాను కానీ 'పప్పు'లో లేను. 'పన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను. 'కాశీ'లో ఉంటాను కానీ 'శీఘ్రం'లో లేను. 'బరి'లో ఉంటాను కానీ 'బల్లెం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

Nenu Evaro Cheppukondi Chudham

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'బలం'లో ఉంటాను కానీ 'ఫలం'లో లేను. 'రుతువు'లో ఉంటాను కానీ 'హేతువు'లో లేను. 'చెరువు'లో ఉంటాను కానీ 'చెరుకు'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'వాటా'లో ఉంటాను కానీ 'కోటా'లో లేను. 'రచ్చ'లో ఉంటాను కానీ ‘మచ్చ'లో లేను. 'సుత్తి'లో ఉంటాను కానీ 'కత్తి'లో లేను. 'జోడు'లో ఉంటాను కానీ 'జోరు'లో లేను. నేను ఎవరిని?

cheppukondi Chudham

ఆ ప్రొఫెసర్ ఇలా చెప్పారు... అందరూ బొద్దుగా ఉన్నారు... ఇద్దరు కాదు అందరూ సన్నగా ఉన్నారు... ఇద్దరు కాదు అందరూ పొడవుగా ఉన్నారు... ఇద్దరు కాదు, ఇంతకి అక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ??? బొద్దుగా ఎంతమంది ఉన్నారు ? సన్నగా ఎంతమంది ఉన్నారు? పొడవుగా ఎంతమంది ఉన్నారు ?