Skip to main content

Posts

Showing posts from April, 2025

గజి బిజి

1. రావుయిపా 2. కొంవడచిలు 3. లులితెతేవిట 4. గుసామిభూ 5. మలిరగా 6. టడుగావే 7. విధుజీసా 8. రంచామాస

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజుకు ఒకసారి మారుతుంది, కానీ క్యాలెండర్ కాదు. దానికోసం పోటీలు పడతారు, ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

పొడుపు కథలు

పొడుపు కథలు 1). అన్నదమ్ములు ముగ్గురు. అలుపు లేకుండా తిరుగుతారు. జ. ఫ్యాన్ 2). తమ్ముడు బంగురుతూ ఒక్క గది దాటేసరికి, అన్న పరుగెత్తుతూ పన్నెండు గదులు పోతాడు. జ. గడియారం 3). దేశాలన్నీ చుట్టేస్తుంది. కానీ దేశంలోకి వెళ్లలేదు. జ. ఓడ

నేను ఎవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ’లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  'గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  'మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం'లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం. 1). ఆరు అక్షరాల English పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు కలిపితే 'ఆమె' అనీ. 3, 2, 5 అక్షరాలను కలిపితే 'కాలి వేలు' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేను ఏడు అక్షరాల English పదాన్ని. మొదటి నాలుగక్షరాలు కలిపితే 'పరీక్ష' అనీ. 6, 3, 4, 5 అక్షరాలు కలిపితే 'దీపం' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? Answers :  1.MOTHER 2. EXAMPLE

నేనెవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని.  'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. 'తోరణం'లో ఉంటాను. 'కారణం'లో ఉండను.  'విషం'లో ఉంటాను. 'విరి'లో ఉండను.  ఇంతకీ నేనెవర్ని? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'బావి'లో ఉంటాను. 'భావి'లో ఉండను.  'తోట'లో ఉంటాను. 'తోక'లో ఉండను.  'సాయం'లో ఉంటాను. 'గాయం'లో ఉండను.  'కరి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.  ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

అన్నిటికి ఒకే ఒక్క అక్షరం

ఒక్క అక్షరమే అన్ని ఖాళీలలో వస్తుంది ఆ అక్షరం ఏమిటి? _ ధ్య వాళ్ల ఇంట్లో పెళ్లి _ దడి అప్పుడే మొదలైంది. _ దీప్ _ తకి వెళ్ళి ఏమి తెస్తున్నావు?

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు 1). కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు. 2). అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట. 3). అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట. 4). పేనుకు పెత్తనం ఇస్తే తల గొరికి పెట్టిందంట. 5). ఆస్తి మూరెడు ఆశ బారెడు. 6). పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. 7). ఇల్లలకగానే పండగ కాదు. 8). అందితే జుట్టు అందక పోతే కాలు. 9). చెవిటి వాని ముందు శంఖమూదినట్టు. 10). పిట్ట కొంచెం కూత ఘనం.

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

1. నేనో మూడక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను. 'తోటి'లో ఉండను. `కాకి'లో ఉంటాను. 'కాలు'లో ఉండను. 'లయ'లో ఉంటాను. 'మాయ’లో ఉండను.  ఇంతకీ నేనెవర్ని? 2. నేను ఆరక్షరాల పదాన్ని.  'పండు'లో ఉంటాను. ‘గుండు’లో ఉండను.  'చాందిని'లో ఉంటాను. “నందిని'లో ఉండను.  'గజం’లో ఉంటాను. ‘నిజం’లో ఉండను.  'శ్రద్ధ'లో ఉంటాను. ‘బుద్ధ'లో ఉండను.  ‘వనం’లో ఉంటాను. ‘మనం'లో ఉండను.  'రణం’లో ఉంటాను. ‘రవ్వ'లో ఉండను.  నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

పొడుపు కథలు

పొడుపు కథలు  1). ఆకాశాన ఎగురుతుంది . పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకుపోతుంది. గాలి కాదు. జ. విమానం. 2). వెలుతురులో నీతోటే ఉంటుంది. చీకటిలో తప్పించుకు పోతుంది . జ. నీడ