Skip to main content

Posts

పొడుపు కథలు

పొడుపు కథలు పొడుపు కథలు 1. ఆకాశంలో ఎగిరే రాయి - పావురాయి 2. పురి విప్పిన నెమలి కి ఒకటే కాలు -  విసనకర్ర 3. మొదట నల్లగా, వాడేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది ? - బొగ్గు 4. ఇంటికి కాపలా కాసేది, కుక్క కాదు. చెవి ఉంటుంది. వినలేదు. ? - తాళం 5. బావిలో మొగ్గలు వేయగలరా ? ( పిల్లి మొగ్గలు వేయగలరా అని అర్థం)  - మొగ్గలు తీసి బావిలో వేయడమే. 6. తొడిమ లేని పండు. తెల్లగా ఉంటుంది. తినలేము. ? - విభూతి పండు

రెండిటికి ఒకటే Answer అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం

రెండిటికి ఒకటే Answer అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం రెండిటికి ఒకటే Answer అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం 1). బంటి _______ తింటే ఆరోగ్యంగా __________తాము. 2). లతా నా ___ ఎక్కడుందో ___ లేకపోతే మా అన్నకి చెపుతాను. 3). గీతా ఆ ___ లోని గవ్వలు ___ ఆడుకుందాం. 4). బంటి ఆచెట్టు ___ ఈ చెట్టు వేరు ___ గా ఉన్నాయి. 5). చంటి మా ___ ని అడగనిదే నా స్కూటర్ ___ ను. 6). బంటి మన ___ బడిన ఇంట్లో పాటలు ___ తున్నారేంటి. 7). బంటి ___ ఉల్లిగడ్డలు రోట్లో వేసి ___. 8). బంటి ఈ ____ తీసురెళ్ళి ____ దిక్కు ఇంట్లో ఇవ్వు. 9). బంటి ____ గా ఉన్నచోట ఈ వేప ____ వేయండి. 10). చంటి ఆ ____ గిన్నెలోని ____ సంకటి తీసుకురా. 11). బంటి నీకేమైనా __ పోయిందా. పుట్టినరోజుకు మన వారంతా రావడమే మనకు పెద్ద బహు __ 12). నిన్న సెలవు రోజు కావడంతో మేము  __ లో షి __ కు వెళ్లొచ్చాం. 13). బంటి నా __ లు ఎక్కడ దాచావో __ లేదంటే మా  నాన్నకు చెప్తా. 14). __ కంఠ, నాగ __ కి సమానంగా మార్కులు రావడంతో ఇద్దరికీ ఫస్టు ర్యాంకు ఇచ్చారు.

top తమాషా ప్రశ్నలు

ఆలోచిస్తే చక్కని "పాలు" 1) దీపావళికి పెట్టే పాలు పాలు 2) బడి పిల్లలు వాడే పాలు పాలు 3) చిన్న పిల్లలను ముద్దాడే పాలు పాలు 4) దుర్మార్గులకు వచ్చే పాలు పాలు 5) దయ గల వాని ఊరు పురం 6) బాంబులు పేలే పదార్థంగల ఊరు పురం 7) తియ్యని ఊరు పురం 8) గుంటూరు జిల్లాలో ఆంగ్లేయుని పేరుగల ఊరు పురం 9) తెలుగు సినీనటి పేరు గుర్తు చేసే ఊరు పురం دم ఆలోచిస్తే భలే గమ్మత్తు "ట" 1) పిల్లలందరికి ఇష్టమైనది 2) తుమ్మెదలకు నిలయం 3) గుడ్డతో కట్టేది 4) రాజులకు ఉండేది 5) వడ్లను తూచేది 6) ఏరడానికి ఉపయోగపడేది 7) వెళ్ళేటప్పుడు చెప్పేది 1) పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము. 2)లతా! నా చెప్పు ఎక్కడుందో చెప్పు 3) అమ్మ ఆ ఏరు లోని గవ్వలు ఏరు 4)ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా ఉన్నాయి 5)అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను 6) పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారేంటి 7) నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు 8) ఈ ఉత్తరం తీసుకెళ్లి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు 9) పొడి గా ఉన్నచోట ఈ వేప పొడి వేయండి. 10)నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు. 11). ఈ ఉత్తరం తీసుకెళ్లి ఉత్తర దిక్కు ఇంట్లో ఇవ్వు. 12). అమ్మ ని అడగనిదే నా స్...

సామెతలు తెలుసా

సామెతలు తెలుసా 1). నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. 2). డిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. 3). అందితే జుట్టు అందకపోతే కాళ్లు. 4). తింటే ఆయాసం తినకపోతే నీరసం. 5). ఆది లోనే హంస పాదు. 6). నవ్వు నాలుగు విధాల చేటు. 7). వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.

నేనెవర్ని చెప్పుకొండి చూద్దాం

1). నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జత’లో ఉంటాను కానీ 'పాత'లో లేను. 'నయం'లో ఉంటాను కానీ 'గాయం'లో లేను. ‘వర్షం'లో ఉంటాను కానీ 'హర్షం’లో లేను. 'హరి'లో ఉంటాను కానీ 'హల్లు'లో లేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేనో మూడు అక్షరాల పదాన్ని.  'ధనం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను.  'రణం'లో ఉంటాను కానీ 'కణం'లో లేను.  'వాణి'లో ఉంటాను కానీ 'వారం'లో లేను.    నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. ముక్కుమీద కెక్కు. ముందర చెవులు నొక్కు. జారిందంటే పుటుక్కు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2. ఒళ్లంతా కళ్లే. కానీ, వాటిలో చూసేవి మాత్రం రెండే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3. లోపల బంగారం. పైన మాత్రం వెండి. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 4. కాళ్లు రెండే. కానీ, చేతులు మాత్రం ఎక్కువే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? పొడుపు కథలు : 1. కళ్లజోడు 2. నెమలి 3. కోడిగుడ్డు 4. నిచ్చెన

Telugu Interesting Questions

Telugu Interesting Questions  Telugu Interesting Questions  1). మా అన్న. _ _ నిన్న తెచ్చిన మిఠాయి _ _ రంగా ఉంది. 2). బంటీ నీ _ _ చేతికి తేనెటీగ _ _తే. పరీక్ష ఎలా రాస్తావు. 3). చంటి ఈసారి _ _ లు ఎక్కువగా కురుస్తుండటంతో, _ _ రాలన్నీ అడవికే పరిమితమయ్యాయి. 4). బంటీ _ _ లు చెప్పడం కాదు. బాగా చదువుకొని భవిష్యత్తులో కచ్చితంగా _ _ స్థానానికి చేరుకుంటా. 5). చంటి మా _ _ లో సాగు చేసిన _ _ కూర చాలా రుచిగా ఉంటుంది.