Skip to main content

Posts

Showing posts from June, 2024

నేను ఎవరు చెప్పుకోండి చూద్దాం?

1. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘పవనం’లో ఉంటాను. 'భవనం'లో ఉండను. 'కారు'లో ఉంటాను. ‘కాలు'లో ఉండను. 'వేగు'లో ఉంటాను. 'వేళ'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం? 2. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'మాను’లో ఉంటాను. 'పేను'లో ఉండను. 'నక్క'లో ఉంటాను. 'కుక్క'లో ఉండను. 'గోవు'లో ఉంటాను. 'గోడ'లో ఉండను. 'రేడు'లో ఉంటాను. 'రేవు'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేను ఎవరో తెలుసా?

నేను 5 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో (1) 2,3,1,5 కలిపితే నమ్మకం (2) 2,5,4 - కోడిపెట్ట అని అర్థం. 👉 ఇంతకీ ఎవరు నేను?  Hints. నేను మీ అందరికి తెలుసు .  నేను లేకపోతే మీరు ఉండలేరు. ఇది చదవడానికి నేను అవసరం

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

(1). నేను అయిదక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1,4,5 కలిపితే ఖర్చు, 3,4,5 - సహకారం, 4,2 - ఓ ధ్యానం, 3,5 - వ్యాయామం అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?  (2). సాయం కానీ సాయం ఏమిటో చెప్పండి ? 👉 రెండిటికీ ఒకే జవాబు 

చెప్పుకోండి చూద్దాం

1) 4,5అక్షరాలు కలిపితే జెనరేషన్ తెలుగులొ. 2) 3,4అక్షరాలు కలిపితే అమ్మకు సమానాగ్ర 3) 3,5 అక్షరాలు కలిపితే మీరు మారతారా అంటి వ్యతిరేక సమాధానము. 4) 1,4అక్షరాలు కలిపితే తానా అంటే తందాన అనడం అంటే క్లుప్తంగా ఇది పాడటం అంటారు. 5) 3,2అక్షరాలు కలిపితే "నాదే”కు బహువచనం.

చిక్కు ప్రశ్నలు - జవాబులు

1. **ఎంత ప్రయత్నించినా మీరు ఎప్పుడూ అందుకోలేరు, అది ఏమిటి?**    - సమాధానం: మీ స్వంత నీడ 2. **పెద్ద భవనం కూలిపోవడం దేనికి కారణం అవుతుంది?**    - సమాధానం: దాని మిద్దె(రూఫ్) 3. **వినిపించదు, చూస్తే కనిపించదు, కానీ ఎప్పుడూ నిజమైంది అని తెలిసిపోతుంది, అది ఏమిటి?**    - సమాధానం: అబద్ధం 4. **ఇది ఎంత ఎక్కువ ఉంటే, ఇతరులు అంత తక్కువ మీతో ఉండాలి. ఇది ఏమిటి?**    - సమాధానం: అహంకారం 5. **ఎప్పుడు ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడూ నిలవదు?**    - సమాధానం: సమయం 6. **మీరు దానిని పగలగొడితే, అది ఎప్పుడూ ఏడుస్తుంది. అది ఏమిటి?**    - సమాధానం: గుడ్డు 7. **ప్లేటులో ఉంచితే అది ఉడుకుతుంది, కానీ మన చేతిలో ఉంచితే అది కరగిపోతుంది. అది ఏమిటి?**    - సమాధానం: మంచు 8. **అది మనకు చాలా సమయం ఉంటే అర్థం అవుతుంది, కానీ అది ఉండదు. అది ఏమిటి?**    - సమాధానం: భవిష్యత్తు 9. **దీనికి పాదాలు లేవు కానీ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇది ఏమిటి?**    - సమాధానం: కాలం 10. **ఎప్పుడు నడుస్తుంది కానీ ఎప్పుడూ ఆగదు?**    - సమాధానం: గడియారం 11. **...

చెప్పుకోండి చూద్దాం

ప్రశ్న -  ఒక రాత్రి, ఒక దొంగ ఒక ఇంటి లోపలికి చొరబడ్డాడు. ఇంటి యజమాని అప్రమత్తంగా ఉండి, వెంటనే లైట్లు ఆన్ చేశాడు. దొంగ అక్కడే నిలబడి ఉన్నాడు, కానీ యజమాని అతనిని పట్టుకోలేదు, పోలీసుల్ని కూడా పిలవలేదు. అతను ఒక మాట కూడా మాట్లాడకుండా దొంగను బయటకు పంపించాడు. దొంగ కూడా ఏమీ మాట్లాడలేదు, కానీ హ్యాపీగా బయటకు వెళ్లిపోయాడు.  ఇప్పుడు, ఆ దొంగను యజమాని ఎందుకు పట్టుకోలేదు? **సమాధానం:** దొంగ ఒక స్వల్పలోపం లేనిదైనా, అతను ఒక అద్దంలో తన ప్రతిబింబం మాత్రమే!

మీ మనసులో అనుకున్న సంఖ్య ఏమిటో చెప్పేస్తాను

(1) 1-9 లోపు ఒక అంకె కోరుకోండి. (2) దానిని 2 తో గుణించి 2 కలపండి. (3) తరువాత 5 తో గుణించి 5  కలపండి .తరువాత  (4) 10 తో గుణించి 10  కలపండి . (5) వచ్చిన సంఖ్య ని అడగాలి. (6) ఉదాహరణ:పై చెప్పిన విధంగా చేయగా వచ్చిన సంఖ్య 760 కొరుకొన్నది 6 ఈ లెక్క లోని చిట్క: ప్రతి సంఖ్య చివర 60 వస్తుంది.దానిని తీసివేయగా మిగిలిన అంకె నుండి 1 తీసివేయగా కొరుకొన్న అంకె వస్తుంది.

తెలుగు పదం - English పదం FI తో వస్తుంది

రాయగలరా? ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన ఆంగ్ల అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. చేతివేలు    fi 2. నిప్పు         fi 3. పోరాటం    fi 4. మొదటి     fi 5. మీనం        fi        6. జరిమానా  fi 7. చివరి         fi 8. పదిలో సగం fi

Relationship ఏమిటి?

అమిత్ రాహుల్ కుమారుడు. రాహులకు సోదరి అయిన సారికకు సోనీ అనే కొడుకు, రీటా అనే కూతురు ఉన్నారు. రాజా, సోనీకి మేనమామ అయితే అమిత్  కి సోనీ ఏమవుతాడు? Hint: క _ _

Missing Word's రెండూ ఒక్కటే

(1). ఆ ఇంటి పై _ _ అచ్చం టీ ఆకారంలో ఉంది.  (2). _ _ _ తింటే.. జ్ఞాపకశక్తి _ _ _ తుందా? (3). _ _ లో నుంచి పెట్రోల్  _ _ తోంది.. చూశారా? (4). మా చెల్లి  _ _ భరతనాట్యంలో జాతీయ స్థాయిలో _ _ స్తోంది.

నేనెవర్ని

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'సందేశం’లో ఉంటాను కానీ 'విదేశం'లో లేను. ‘ఘనం’లో ఉంటాను కానీ 'వనం’లో లేను. 'వర్ష'లో ఉంటాను కానీ 'వర్షం'లో లేను. 'అరుణ'లో ఉంటాను కానీ ‘అరుణ్’లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘పటం’లో ఉంటాను కానీ 'ఘటం'లో లేను. 'చెద'లో ఉంటాను కానీ 'చెర'లో లేను. 'విల్లు'లో ఉంటాను కానీ 'హల్లు’లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ 'జోరు'లో లేను. 'బాదం'లో ఉంటాను కానీ 'బాణం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

సామెతలు

రాయగలరా? కింద కొన్ని సామెతలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేయగలరా? I. ఆదిలోనే  _ _ పాదు. 2. అడవి కాచిన _ _ _  3. ఊరిలో పెళ్లికి  _ _ _  హడావిడి. 4. ఇంట గెలిచి _ _  గెలువు. 5. నవ్వు నాలుగు విధాల _ _  6. చెవిటి వాడి ముందు  _ _ ఊదినట్లు.

చెప్పుకోండి చూద్దాం

టీచర్ : రాజు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇంగ్లీషులో చెప్పు  సాయి: మా అమ్మ గారి పేరు Full Rice (అన్న పూర్ణ)  మా నాన్న గారి పేరు   Earth Husband (భూపతి)  మా అన్నయ్య పేరు Golden King (బంగారు రాజు)  మా అక్క పేరు  Small Mother (చిన్నక్క)  మా చెల్లి పేరు Peace Mother (శాంతమ్మ)  మా తమ్ముడు పేరు Snake Father (నాగప్ప)  మా బామ్మ గారి పేరు  Flower Mother (పుష్పమ్మ)  ఈది విని టీచర్ కల్లు తిరిగి పడిపోయింది

నేనెవర్ని ?

నేనెవర్ని? ఆరు అక్షరాల పదాన్ని నేను. 'సగం’లో ఉంటాను కానీ 'వేగం’లో లేను. ‘'మట్టి'లో ఉంటాను కానీ 'గట్టి'లో లేను. 'దయ'లో ఉంటాను కానీ 'గద’లో లేను. 'పాట'లో ఉంటాను కానీ 'ఆట'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం’లో లేను. ' నలుగు ' ఉంటాను కానీ 'పలుగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం?