Skip to main content

Posts

Showing posts from November, 2023

Relationship

A, B లు సోదరులు. C, D లు సోదరీమణులు. A కుమారుడు D కి సోదరుడు. అయితే C కి B ఏమవుతాడు? జవాబు: పినతండ్రి లేదా చిన్నాన్న

కనుక్కోండి చూద్దాం

ఒక Room తెరవాలంటే  క్రింది నియమాలతో 3 అంకెల కోడ్‌ తాళంను కనుగొని Open చేయగలరా ..! (3,0,2)ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది; (3,5,6)ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది; (5,7,4)రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి; (6,8,9)ఏదీ సరైనది కాదు; (6,7,0)ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది

ప్రశ్నకు మీరు ఎలా సమాధానం ఇస్తారు?

మీరు ఒక అమ్మాయి అభ్యర్థి మరియు ఇంటర్వ్యూలో కూర్చున్నారనుకోండి. అకస్మాత్తుగా ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగాడు, 'ఒక ఉదయం నిద్రలేచి మీరు గర్భవతి అని తెలుసుకుంటే? అటువంటి ప్రశ్నకు మీరు ఎలా సమాధానం ఇస్తారు?

ఆ మహిళ కౌశిక్కు ఏమవుతుంది?జవాబు: మేనత్త

ఒక మహిళను చూపుతూ కౌశిక్ ఇలా అన్నాడు. 'ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె'. అయితే ఆ మహిళ కౌశిక్కు ఏమవుతుంది? జవాబు: మేనత్త

ఏవి మరియు ఏ క్రమంలో ఉన్నాయి?

ఒక వ్యక్తి తన పని భవనంలోకి ప్రవేశించాలనుకున్నాడు, కానీ అతను తన కోడ్‌ను మరచిపోయాడు. అయితే, అతను ఐదు ఆధారాలను గుర్తుంచుకున్నాడు. ఆ ఆధారాలు ఇవి: ఐదవ సంఖ్య మరియు మూడవ సంఖ్య పద్నాలుగుకి సమానం. నాల్గవ సంఖ్య రెండవ సంఖ్య కంటే ఒకటి ఎక్కువ. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే ఒకటి రెండింతలు తక్కువ. రెండవ సంఖ్య మరియు మూడవ సంఖ్య పదికి సమానం. మొత్తం ఐదు సంఖ్యల మొత్తం 30. ఐదు సంఖ్యలు ఏవి మరియు ఏ క్రమంలో ఉన్నాయి?

సైకిల్ రేస్‌లో ఎంత మంది పోటీదారులు ఉన్నారు?

సైకిల్ రేస్‌లో, చివరి వ్యక్తి కంటే రెండు స్థానాల్లో ముందు వచ్చిన వ్యక్తి ఐదవ స్థానంలో నిలిచిన వ్యక్తి కంటే ఒక స్థానానికి ముందంజలో ఉంటే, ఎంత మంది పోటీదారులు ఉన్నారు?

Who I Am

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'వరం'లో ఉంటాను కానీ 'ఘోరం'లో లేను. 'అల'లో ఉంటాను కానీ 'అర'లో లేను. 'గాయం'లో ఉంటాను కానీ 'గానం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కృష్ణ'లో ఉంటాను కానీ 'తృష్ణ'లో లేను. 'తల'లో ఉంటాను కానీ 'వల'లో లేను. 'ఆజ్ఞ'లో ఉంటాను కానీ 'ఆన'లో లేను. 'తట'లో ఉంటాను కానీ 'బుట్ట'లో లేను. ఇంతకీ నేనెవర్ని ?

గజి బిజిగా ఉన్నాయి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. I. లాలంహకో 2. రంరాగాకా 3. నూచిమంనె 4. మాదచంమ 5. జుజరాగ 6. నఆంళదో 7. పణంరిమా 8. ఆనలోచ

Who I Am

“P”తో మొదలై “ORN”తో ముగుస్తుంది మరియు సినీ పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందినది ఏమిటి?

who I Am

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పట్టు'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'జోరు'లో ఉంటాను కానీ 'జోడు'లో లేను. 'జాగు'లో ఉంటాను కానీ 'జారు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కలం'లో ఉంటాను కానీ 'బలం'లో లేను. 'సగం'లో ఉంటాను కానీ 'భాగం'లో లేను. 'రత్నం'లో ఉంటాను కానీ 'యత్నం'లో లేను. 'చిత్తు'లో ఉంటాను కానీ 'చిత్తం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

Quizzes

1. ఏ దేశంలో రైలు టికెట్ను తినొచ్చు?  2. నిద్రపోని జీవి ఏది?  3. చేపల గుంపుని ఏమని పిలుస్తారు? 4. చెస్ ఆటలో మొత్తం ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 5. అరటిపండ్లను ఎక్కువగా ఉత్పత్తి ఏ దేశం చేస్తుంది? Answer 1. బెర్లిన్ 2. బుల్ ఫ్రాగ్ 3. స్కూల్ 4.32 5. భారతదేశం 

నేనెవర్ని

ఆంగ్ల భాషలో ఒక పదం ఉంది, ఇందులో మొదటి రెండు అక్షరాలు పురుషుడిని, మొదటి మూడు అక్షరాలు స్త్రీని, మొదటి నాలుగు గొప్ప వ్యక్తిని మరియు మొత్తం పదం గొప్ప స్త్రీని సూచిస్తుంది. పదం ఏమిటి?

లాజిక్ Question

ఒక వ్యక్తి నదికి ఒకవైపు, అతని కుక్క మరోవైపు నిలబడి ఉన్నాడు. మనిషి తన కుక్కను పిలుస్తాడు, అది తడవకుండా మరియు వంతెన లేదా పడవను ఉపయోగించకుండా వెంటనే నదిని దాటుతుంది. కుక్క ఎలా చేసింది?

పొడుపు కథ

పొడుపుకథ నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను? నేను ఎవరు అనేది మీకు బాగా తెలుసని అనుకుంటాను. అయితే నేను ఎవరు..? జ :నీడ

సామెతలు

తెలుగు సామెతలు 1) కుక్కొస్తే రాయి దొరకదు.. రాయి దొరికితే కుక్క రాదు  2) లేని దాత కంటే ఉన్న లోభి నయం -3) లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక 4) మెరిసేదంతా బంగారం కాదు 5) మంచమున్నంత వరకే కాళ్లు చాచుకోవాలి 6) మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిందంట 7) మనిషి పేద అయితే మాటకు పేదా 8) మనిషికి మాటే అలంకారం

Riddles

పొడుపు కథలు 1. ముక్కుమీద కెక్కు.. ముందర చెవులు నొక్కు.... జారిందంటే పుటుక్కు... ఏంటబ్బా? 2. ఒళ్లంతా కళ్లే.. కానీ, వాటిలో చూసేవి మాత్రం రెండే అదేమిటి చెప్పుకోండి? 3. లోపల బంగారం.. పైన మాత్రం వెండి. ఏంటో తెలిసిందా? 4. కాళ్లు రెండే.. కానీ, చేతులు మాత్రం ఎక్కువే.. ఏంటది?

చిలిపి ప్రశ్నలు

వలగాని వల (జవాబు : నవల) కొమ్ము గాని కొమ్ము (జవాబు : శొంఠి / పసుపు) కారు గాని కారు(జవాబు : షికారు / పుకారు / పట్టుకారు) స్త్రీ గాని స్త్రీ (జవాబు : ఇస్త్రీ)

who I Am

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'విల్లు'లో ఉంటాను కానీ 'హల్లు'లో లేను. 'జేబు'లో ఉంటాను కానీ 'చెంబు'లో లేను. 'తక్కువ'లో ఉంటాను కానీ 'ఎక్కువ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?  2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'సుఖం'లో ఉంటాను కానీ 'దుఃఖం'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'సమరం'లో ఉంటాను కానీ 'భ్రమరం'లో లేను. 'నలుగు'లో ఉంటాను కానీ 'పలుగు'లో లేను. నేను ఎవరినోతెలిసిందా?

Who I Am?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఆరు'లో ఉంటాను. 'తిరు'లో ఉండను. 'లోపం'లో ఉంటాను. 'పాపం'లో ఉండు. 'చలువ'లో ఉంటాను. 'కలువ'లో ఉండను. 'నలుపు'లో ఉంటాను. 'గెలుపు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేనో మూడక్షరాల పదాన్ని. 'అల'లో ఉంటాను. 'ఇల'లో ఉండను. 'రుషి'లో ఉంటాను. 'కృషి'లో ఉండను. 'పులి'లో ఉంటాను. 'చలి'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

వాళ్ళు ఎంత మంది మరియు ఎన్నీ కాయలు ?

👉 కొంత మంది మామిడికాయల తోటకి వెళ్ళారు. అయితే కొన్ని కాయలు తిన్నారు మరియు 111మామిడి పళ్లు ఇంటికి తీసుకువచ్చారు.  👉 అయితే 111 కాయలు సమానంగా కలిపి పంచుకోవాలి. వాళ్ళు ఎంత మంది మరియు ఎన్నీ కాయలు ?

చెట్టు నుండి ఎన్ని మామిడి కాయలు కోసారో చెప్పండి.

👉 ఇద్దరు తండ్రులు, ఇద్దరు కుమారులు మామిడికాయలు కోయడానికి వెళ్లగా ఒక్కొక్కరు 12 మామిడి పళ్లు కోశారు. చెట్టు నుండి ఎన్ని మామిడి కాయలు కోసారో చెప్పండి.

పొడుపు కథలు

1. ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. 2. కోటగాని కోట ఇంటికో కోట 3. ఇక్కణ్నుంచి చూస్తే ఇనుము, దగ్గరికి పోతే గుండు, పట్టి చూస్తే పండు, తింటే తీయగనుండు