Skip to main content

Posts

Showing posts from March, 2026

WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం  WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం  1).👉  నేను 6 అక్షరాల English పదాన్ని.  👉 5,2,3,4 - EAST (తూర్పు). 👉 1,2,6,3 - MARS (అంగారకుడు). 👉 నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2).👉  నేను 5 అక్షరాల English పదాన్ని.  👉 1,5,2,3 - WHAT (ఏమిటి).  👉 4,2,3 - CAT (పిల్లి).  👉 నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 1. MASTER 2. WATCH

నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం

నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం  1). నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని.  ప్రతి ✅.  గతి ❌.  కారు ✅.  ఆరు ❌.  శని ✅.  పని  ❌.  వంశం ✅. అంశం ❌.  శాతం ✅. శాఖ'లో ❌.  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2). నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని.  చిట్టి ✅. పొట్టి ❌.  పాత్ర ✅. పాత ❌.  వల ✅. వరం ❌.  ఊహ ✅. ఊరు ❌.  దారి ✅. దారం ❌.  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

100 తెలుగు jokes

100 తెలుగు jokes  1). టీచర్: "రేయ్, బడికి ఎందుకురా ఆలస్యంగా వచ్చావు?" రాము: "దారిలో ఒక బోర్డు చూసి ఆగిపోయాను సార్." టీచర్: "ఏముందిరా ఆ బోర్డు మీద?" రాము: "ముందు స్కూల్ ఉంది, మెల్లగా వెళ్లండి" అని రాసుంది సార్, అందుకే మెల్లగా నడుచుకుంటూ వచ్చా. 2). టీచర్: "'నా దగ్గర డబ్బులు లేవు' - దీనికి ఫ్యూచర్ టెన్స్ (భవిష్యత్ కాలం) ఏమిటి?" రాము: "'నాకు ఎవరూ అప్పు ఇవ్వరు' సార్." 3). టీచర్: "రేయ్ గుండూ, భూమి గుండ్రంగా ఉందని ఎలా నిరూపిస్తావు?" గుండు: "నేను చెప్పను సార్!" టీచర్: "ఎందుకురా?" గుండు: "నిన్ననే మా నాన్న 'భూమి బల్లపరుపుగా ఉందని' చెప్పి ఒక ప్లాట్ కొన్నాడు. ఇప్పుడు గుండ్రంగా ఉందంటే నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు!" 4). టీచర్: "ఏవైనా మూడు జంతువుల పేర్లు చెప్పు." రాము: "సింహం..." టీచర్: "వెరీ గుడ్! మిగతా రెండు?" రాము: "సింహం పెళ్లాం, సింహం పిల్ల సార్." 5). టీచర్: "గాంధీజీ ఎప్పుడు జన్మించారు?" సురేష్: "మా నాన్నకు సెలవు ఉన్నప్ప...

ఈ Name Puzzle Answer ఏమిటో చెప్పుకోండి

1). శ్వి అ న్. 2). న నా గా ర్జు . 3).  దే వి శ్రీ. Q) - ఇందులో ఒక క్రికెటర్ పేరు ? Q) - ఇందులో ఒక హీరో పేరు ? Q) - ఇందులో ఒక హీరోయిన్ పేరు?  Q). అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Answer ఒకే ఒక అక్షరం

Answer ఒకే ఒక అక్షరం Answer ఒకే ఒక అక్షరం 1). మౌని _ వింటున్నావా? వానా _ లంలో మనమంతా ఇం _ స్త జాగ్రత్తగా ఉండాలి. 2). ఎ _ సార్లు సరిదిద్దుకున్నా. కొ _ సార్లు అవే తప్పులు జరుగుతుంటాయి. అ _ సార్లూ మనమే గెలవాలంటే నిజజీవితంలో అస్సలు కుదరదు. 3). పె _ గు. _ చి, దానిలో ఉండే పోషకాల గురించి తెలియక నువ్వలా అంటున్నావేమో. _ త్విక్. నీకు ఒక్కసారి అలవాటైతే వదలనే వదలవు తెలుసా? 4). నాకు _ దటి నుంచీ _ క్కలంటే ఇష్టమండీ. కానీ కాస్త _ హమాటపడి వాటిని నాటడంలో మిమ్మల్ని సాయం అడగ లేకపోయాను. 5). _ రోజుల్లో _ నందమే వేరండి. అని ఇప్పుడు బాధేస్తోంది. _ లోచిస్తుంటే అవన్నీ కోల్పోయామే అని ఇప్పుడు బాధేస్తుంది.

సామెతలు తెలుసా

సామెతలు తెలుసా సామెతలు తెలుసా 1). _ _ చేసి _ _ కూడు. 2). _ _ వచ్చి _ _ ను వెక్కిరించినట్లు. 3). _ _ రానిది _ _ _ _ వస్తుందా? 4). _ _ _ _ వారే ___ తీరే. 5). _ _ తోక వంకర 6). చెప్పులోన రాయి. చెవిలోన _ _ 7). ఆదిలోనే _ _ పాదు 8). కొండను తవ్వి _ _ _ ను పట్టినట్లు జవాబు: 1. అప్పు, పప్పు 2. గుడ్డు, పిల్ల 3. కొంటే, కొసరితే 4. ఎవరికి, యమునా 5.కుక్క 6. జోరీగ 7. హంస 8. ఎలుక

Flower Names దాగి ఉన్నాయి అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం.

Flower Names దాగి ఉన్నాయి అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం. కింది వాక్యాలలో " పూలు “ ఉన్నాయి. కనిపెట్టండి. 1) నాగు లాబీలో కూర్చుని చూస్తున్నాడు. 2) పూలు గుచ్చడానికి రామం, దారం తెచ్చాడు. 3) లతా మరలా నీకు జ్వరం వచ్చిందా? 4) కమల ముత్యాలహారం ఎంత బాగుందో.

100 Ditective Questions With Answers

బుర్రకు పదును పెట్టండి.! గదిలో వ్యక్తి శవమై పడి ఉన్నాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. పక్కనే టేపు రికార్డర్ ఉంది. పోలీసులు వచ్చి రికార్డర్లోని ప్లే బటన్ నొక్కగానే "నాకు ఈ జీవితంపై విరక్తి పుట్టింది. అందుకే చనిపోతున్నా" తర్వాత తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ రికార్డింగ్ వినగానే ఇది ఆత్మహత్య కాదు. హత్య అని పోలీసులు తేల్చారు. అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారో కనిపెట్టండి.? సమాధానం: పోలీసులు వచ్చి రికార్డర్‌లో 'ప్లే (Play)' బటన్ నొక్కగానే రికార్డింగ్ వినిపించింది కదా. ఒకవేళ ఆ వ్యక్తే తనను తాను కాల్చుకుని ఉంటే, చనిపోయిన తర్వాత ఆ టేపును వెనక్కి (Rewind) ఎవరు తిప్పుతారు? అంటే, అతను చనిపోయాక వేరే ఎవరో ఆ టేపును రికార్డ్ చేసి మొదటికి రివైండ్ చేసి పెట్టారన్నమాట. అందుకే పోలీసులు అది హత్య అని వెంటనే పసిగట్టేశారు! ఇలాంటి డిటెక్టివ్ పజిల్స్ సాల్వ్ చేయడం భలే మజాగా ఉంటుంది కదూ! మీరు అడిగినట్లే, చాలా సహజంగా అనిపించే మరికొన్ని క్రైమ్ పజిల్స్ ఇస్తున్నాను. మీ బుర్రకు కాస్త పదును పెట్టండి: పజిల్ 2 : రెస్టారెంట్ లో విషం ఇద్దరు స్నేహితులు ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. ఇద్దరూ ఒకేరకమైన కూల్ డ్రింక్ ...

తమాషా ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం

తమాషా ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం  తమాషా ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం  1). ఒక ఆర్టీసీ బస్సులో ఎంత మంది ప్రయాణించొచ్చు? 2). ఒక నదిలో కోడిగుడ్డు కొట్టుకువచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? 3). ఒక ప్లాస్టిక్ డ్రమ్లో 100లీటర్ల పాలున్నాయి. ఏం చేస్తే అవి 80లీటర్లవుతాయి. తమాషా ప్రశ్నలు:  1. కండక్టరు ఎన్ని టికెట్లు ఇస్తే అంత మంది ప్రయాణికులు  2. కోడి నుంచి  3. ఇరవై లీటర్లు అమ్మేస్తే

పొడుపు కథలు With Answers చెప్పుకోండి చూద్దాం

పొడుపు కథలు With Answers చెప్పుకోండి చూద్దాం పొడుపు కథలు With Answers చెప్పుకోండి చూద్దాం 1). నీరు లేని సముద్రాన్ని తెర చాప లేని ఓడ ఓపిగ్గా దాటించేస్తుంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? Answer : ఒంటె  2). ఎంతెంతో వింత బండి. ఎగిరిపోయెనుసుమండి. మండుతూ మండుతూ మాయమయ్యెనండి. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? Answer : రాకెట్  3). చిత్రమైన చీర కట్టి, షికారుకెళ్లిందో చిన్నది. పూసిన వారింటికే కాని, కాసిన వారింటికి పోనే పోదు. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? Answer :  సీతాకోక చిలుక 4). కాళ్లు లేవు కానీ మన వెంటనే వస్తుంది. చేతులు లేవు కానీ మనల్ని పట్టుకుని ఉంటుంది. ఎండలో మాత్రమే కనిపిస్తుంది, చీకట్లో మాత్రం కనిపించదు. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? Answer: నీడ 5). నోరు లేదు కానీ మాట్లాడుతుంది. చెవులు లేవు కానీ వినిపిస్తుంది. మనమే మాట్లాడితే మన మాటలనే తిరిగి చెబుతుంది. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? Answer : ప్రతిధ్వని (Echo) 6). చెట్టు మీద పుడుతుంది. ఇంట్లోకి వచ్చేసరికి నల్లగా మారుతుంది. నీళ్లలో పడితే తీపిగా మారుతుంది. ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం ఉపయోగపడుతుంది. అది ఏంటో చెప్పుకోండి చూద్...

Questions లోనే Answer

Questions లోనే Answer  Questions లోనే Answer  1). శాటిలైట్ లోని వెలుగు ఏది? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2). హరివిల్లులోని బాణం ఏది? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3). వంటచెరకు లోని పంట ఏది ? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 4). వక్రీభవనం లోని ఇల్లు ఏది ? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 5). ఈ భవనం లోని అడవి ఏది ? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 6). న్యూజిలాండ్ లోని కొత్తదేంటో మరి ? ఈ Questions లోనే Answer ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం

Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం  Same Answers రెండిటికి ఒకటే చెప్పుకోండి చూద్దాం   1). చింటూ ఇప్పటి నుంచే అంత _ _ గా ఉంటే, పెద్దయ్యాక జగ _ _ లా తయారవుతావు. నీకసలు అర్థమవుతుందా? 2). ఈ వాయు _ _ నుంచి గట్టెక్కామంటే, ఇక మనల్ని ఏ _ _ ఆపలేదు. 3). ర్యాంకుల్లో ప్రభం _ _  సృష్టించామని అన్ని కాలేజీలూ చెబుతుండే సరికి,ఎందులో చేరాలో _ _ తేల్చుకోలేకపోతున్నారు. 4). ఏ _ _ వండాలని అడిగితే. తోట _ _ అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు వద్దంటావేంటి చిన్నూ? 5). అరుణా. ఇప్పుడు చదువుల్లో _ _ స్తేనే, మంచి ఉద్యోగం తెచ్చుకొని భవిష్యత్తుల్లో మహా _ _ లా బతకగలం. 6). చూడగానే _ _ రం. _ _ అనిపించేలా ఉండాలి. అప్పుడే తినాలనే ఆసక్తి పెరుగుతుంది. Answers : 1. మొండి 2. గండం 3. జనం 4. కూర 5. రాణి 6. ఆహా

Who I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

Who I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం  1). నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.  అన్నంలో ✅, సున్నంలో ❌.  పిల్లలో ✅, పిల్లిలో ❌.  సిరిలో ✅,  సిరాలో ❌.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  శాస్త్రిలో ✅, నాస్తిలో ❌.  కాటుకలో ✅, ఇటుకలో ❌.  హాస్యంలో ✅, జోస్యంలో ❌.  రంపంలో ✅, భూకంపంలో ❌.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?

పొడుపు కథలు With Answers

పొడుపు కథలు With Answers 1. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవుగానీ ఏడుస్తుంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2. తలుపుల సందున మెరుపుల గిన్నె. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 3. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? 4. తిరిగే దీపం.. గాలివానకు ఆగని దీపం.. చమురులేని దీపం.. పిట్ట దీపం. ఏమిటది? 5. చీకటింట్లో జడల దెయ్యం? 1. మేఘం 2. దీపం 3. పాలు, పెరుగు, నెయ్యి 4. మిణుగురు పురుగు 5. ఉట్టి

పొడుపు కథలు With Answers

పొడుపు కథలు 1. పొడవేమో జానెడు. పొట్టనిండా ముత్యాలే. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2. మూడు కాళ్లతో నడుస్తుంది కానీ ముందుకు తప్ప వెనక్కి మాత్రం వెళ్లలేదు. అదేంటో? 3. అందరికీ కొడుకూ, కూతురూ అవుతారు. ఎవరు వారు? 4. ఎండలో బయటకు వస్తుంది. గాలొస్తే మాయమైపోతుంది. ఏంటబ్బా?

సరదా ప్రశ్నలు

సరదా ప్రశ్నలు  1. గురువులకు 100నం చేద్దాం 2. 6 బయట 7స్తూ కూర్చోకు 3. చంT చెడు వ్యసనాలతో ఆయువు 3తుంది. 4. చంT కూరలో 1/4 రం తక్కువ 1000. 5. 1/2టి కాయలు ఎక్కడ అమ్మతున్నారు? 6. సంగీత దర్శకుడు 100,00,000 7. లెక్కలు అర్థం కాక 7పొస్తుంది 8. 10కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలి 9. పెళ్లి కూతురు 100,000ణంగా ఉంది.

పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం

1). నేను పరుగు కి వ్యతిరేక దానిని మరియు ఒక ఆట ను 7 మంది తో ఆడుతారు. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). పెళ్లి ఆహ్వానానికి ఇచ్చేది మరియు దీనితో రాస్తారు. అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3). "నేను మా నాన్న కూతురు ని మరియు నాకు ఆ పువ్వు అంటే ఇష్టం." ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ? 4. "నేను నీకు ముందు కాదు మరియు కుండను ఇంకో విధంగా కూడా పిలుస్తారు." క తో End, క తో మొదలు అయిన పదాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 5. ఒక పక్షి లోటు Advertisement జవాబు: 1. నడక, కబడ్డీ 2.పత్రిక, కలం 3. పుత్రిక, కలువ 4. వెనక, కడవ 5. పిచ్చుక, కరవు

నేనెవర్ని

నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  చందులో ✅. ఇందులో ❌.  దళంలో ✅. గళంలో ❌.  మాయలో ✅. ఛాయలో ❌.  మనంలో ✅. వనంలో ❌.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

సామెతలు

👉 _ టితో పోయేదాన్ని  _ డ్డలి దాకా తెచ్చుకోవడం పాత సామెత. 👉 మా _ లతో పోయేదాన్ని ఆపరేషన్ _ కా తెచ్చుకోవడం కొత్త సామెత.