Skip to main content

Posts

Showing posts from August, 2023

నేనెవర్ని

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'గున్న'లో ఉంటాను కానీ 'దున్న'లో లేను. 'పైరు'లో ఉంటాను కానీ 'పైసా'లో లేను. 'రేవు'లో ఉంటాను కానీ 'నేరేడు'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'ఉప్పు'లో ఉంటాను కానీ 'పప్పు'లో లేను. 'పన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను. 'కాశీ'లో ఉంటాను కానీ 'శీఘ్రం'లో లేను. 'బరి'లో ఉంటాను కానీ 'బల్లెం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

👉 సూర్య Book, PEN కొనడానికి షాప్కి వెళ్ళాడు. 👉షాపు యజమాని Book, PEN కలిపి 250 రూపాయలు.... 👉BOOK కన్నా PEN ఖరీదు 100 ఎక్కువ అని చెప్పాడు. ❓ఇంతకి Book ఎంత ???  ❓PEN యింత ???

math matric questions

కింది ఖాళీలను 999 వచ్చునట్లు సరియైన సంఖ్యలతో పూరించండి. (a) 235 + 341 + ___ = 999 (b) 630+ ___ + 200 = 999 (c) ___ + 100 + 399 = 999 (d) 300 + 3 _ 3 + _ 3 _ = 999

తప్పులే తప్పులు

తప్పులే తప్పులు! ఇక్కడ ఉన్న పదాల్లో అక్షరదోషాలున్నాయి. సరిచేసి రాయగలరా? 1. కీరీటం 2. కవాఠం 3. అణురాగం 4.అమామకుడు 5. విషనకర్ర 6. గాలి మర 7.సంఘీతం 8. శంసయం 9.కధానాయకుడు 10. ఆలోచన

మీరు మొదట ఏమి వెలిగిస్తారు?

మీరు కొవ్వొత్తి, కట్టెల పొయ్యి మరియు గ్యాస్ దీపంతో చీకటి గదిలో ఉన్నారు. మీకు ఒక అగ్గిపెట్టె మాత్రమే ఉంటే, మీరు మొదట ఏమి వెలిగిస్తారు?

పొడుపు కథలు

1. ఒళ్లంతా ముళ్లు, కడుపంతా చేదు. ఏంటో తెలుసా? 2. పాము లేదు కానీ పుట్ట ఉంది. తల లేదు కానీ గొడుకు వేసుకుంది. ఏంటది? 3. ఎర్రటి పండు మీద ఈగ అయినా వాలదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 4. తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు. ఏంటో తెలుసా?

నేనెవర్ని

1. నేను మూడు అక్షరాల పదాన్ని. 'పవనం'లో ఉంటాను. 'భవనం'లో ఉండను. 'కారు'లో ఉంటా. 'కాల'లో ఉండను. 'వేగు'లో ఉంటాను. 'వేళ'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'మాను'లో ఉంటాను. 'పేను'లో ఉండను. 'నక్క'లో ఉంటాను. 'కుక్క'లో ఉండను. 'గోవు'లో ఉంటాను. 'గోడ'లో ఉండను. 'రేడు'లో ఉంటాను. 'రేవు'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

చెప్పుకోండి చూద్దాం

చెప్పుకోండి చూద్దాం! ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీ ఉన్నాయి. మొదటి ఖాళీలో వచ్చిన పదమే రెండో చోట సరిపోతుంది. అవేంటో చెప్పుకోండి చూద్దాం. 1)  మా అన్న _ _  నిన్న తెచ్చిన మిఠాయి  _ _ రంగా ఉంది. 2) అర రె _ _  చేతికి తేనెటీగ _ _ తే.. పరీక్ష ఎలా రాస్తావు బంటీ..! 3) ఈసారి _ _ లు అధికంగా కురుస్తుండటంతో,  _ _ రాలన్నీ అడవితే పరిమితమయ్యాయి. 4) _ _లు చెప్పడం కాదు.. బాగా చదువుకొని భవిష్యత్తులో కచ్చితంగా _ _ స్థానానికి చేరుకుంటా. 5) మా _ _ లో సాగు చేసిన  _ _ కూర చాలా రుచిగా ఉంటుంది.

చెప్పుకోండి చూద్దాం

చిక్కు ప్రశ్న మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడి కొడుకు వాళ్ళ కొడుకు అక్క భర్త మీకు ఏమవుతాడు? చెప్పుకోండి చూద్దాం....!

చెప్పుకోండి చూద్దాం

1. షూట్ చేసినా, పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లని వ్యక్తి ఎవరు? 2. కళ్లముందే బోలెడు డబ్బులున్నా.. అందులోంచి రూపాయి కూడా ఖర్చు పెట్టలేరు. ఎవరబ్బా? 3. తన దగ్గరికొచ్చే వాళ్ల రక్తం కళ్లజూడనిదే, తిరిగి పంపించంది ఎవరు?

రాయగలరా!

రాయగలరా! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. I. లోపల ఆలూ నిండిన           స _ _ 2. సరాసరి.. మరోలా                 స _ _ 3. జోరు, హుషారు లాంటిది       స _ _ 4. ఓ పండు                            స _ _ 5. నీరుండేది                           స _ _ 6. యుద్ధం పోరు                     స _ _ 7. కాలానికి ఇంకో పేరు            స _ _

ఒప్పులు ఏవో... తప్పులు ఏవో..

ఒప్పులు ఏవో... తప్పులు ఏవో.. నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం. 1. యోగా _ నం 2. గీతాలాప _ 3. మాయాజా _ 4. మంత్ర _ లం 5. మామి _ తోరణం 6. పర్యావ _ ణం 7. పరివర్త _  8. వా _ రసేన

నేనెవర్ని

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అన్న'లో ఉన్నాను కానీ 'వెన్న'లో లేను. 'మెతుకు'లో ఉన్నాను కానీ 'అతుకు'లో లేను. 'కరి'లో ఉన్నాను కానీ 'కరం'లో లేను. 'కాటుకలో ఉన్నాను కానీ 'ఇటుక'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'జట్టు'లో ఉన్నాను కానీ 'పట్టు'లో లేను. 'వర్మ'లో ఉన్నాను కానీ 'వమ్ము'లో లేను. 'నీళ్లు'లో ఉన్నాను కానీ 'గోళ్లు'లో లేను. ఇంతకీ నేనెవర్ని?

పొడుపు కథలు

పొడుపు కథలు 1. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏంటది? 2. ముద్దుల గుమ్మకు మోపెడు తీగలు ఏమిటది? 3. పువ్వు గుప్పెడు తోక బారెడు? 4. తాతతో తిరిగి వచ్చి మూలన కూర్చున్నాడు. ఏంటది? 5. ఏడుకొండల అవతల ఎర్ర ఎద్దు పరుగు తీస్తుంది ఏమిటది? 1. పిలక 2. జడ 3. కలువ పువ్వు 4. చేతికర్ర . సూర్యుడు

పొడుపు కథలు

పొడుపు కథలు 1. బంగారు బంతిలో రత్నాలు.. పగలగొడితే కానీ బయటకు రావు. ఏంటబ్బా? 2. పొట్టలో వేలు.. నెత్తిమీద రాయి.. అదేంటి? 3. లోపల బంగారం.. బయట వెండి.. ఏమిటో? 4. మొగ్గగా ఉంటే చేతిలో, పువ్వు అయితే నెత్తిమీద ఉంటుంది. ఏంటది? 5. దాన్ని చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్లే. అదేమిటో

అంకెల తమాషా

అంకెల తమాషా! ఇక్కడున్న వాక్యాల్లో అంకెలు, సంఖ్యలున్నాయి. వాటితో కలిపి చదివితే వాక్యం అర్థవంతంగా మారుతుంది. ఇలాంటివి మీరూ రాయగలరేమో ప్రయత్నించండి. 1. అనుకున్నది 1.. అయినది 1 2. సంధ్య 6 బయట ఆడుకుంటోంది. 3. పింకి ఎందుకో అప్పటి నుంచీ 7స్తోంది. 4. అందరికంటే ముందు అప్పడం నాకే 1000 అమ్మా..! 5. పూర్ణిమ కూతురు 100000ణంగా ఉంది.

పదాల సందడి

పదాల సందడి! కింది ఆధారాలతో ఖాళీ గడులను అర్థవంతమైన పదాలు వస్తాయి. (1) ఒక రకమైన మత్తు       _ కం (2) ప్రకృతి విపత్తు             _ కం _ (3) భరించలేని వాసన        కం _  (4) అయిష్టత                    కం _ _ (5) ప్రపంచం                       _ కం (6) రహదారి నిర్మాణంలో వాడేది కం _ _ (7) ఓ దినుసు                      కం _ _ _ (8) స్వర్గం కానిది                    _ _ కం (9) రక్షణ ఇచ్చేది                    కం _ (10) తినడానికి పనికి వస్తుంది   కం _ (11) ఒక లోహం                        కం _ (12) ఒక కీటకం                        ...

first and last లో ఒకటే

ఆది.. అంతం.. ఒకటే! ఆధారాలతో ఆంగ్లపదాలు రాయండి.  1. ఉదాహరణ   E _ _ _ _ _ E 2. కిటికి             W _ _ _ _ W 3. నది               R _ _ _ R 4. ఆరోగ్యం        H _ _ _ _ H 5. కనీసం           M _ _ _ _ _ M

కనుక్కోండి చూద్దాం

ఆధారాలను బట్టి గడులను నింపుట. అన్నీ పా...ములే (1) జలము       పా _ _ ము (2) వస్త్రము       పా _ _ ము (3) పవిత్రము    పా _ _ ము (4) నైపుణ్యము  పా _ _ ము (5) ఓ పక్షి          పా _ _ ము (6) బోధించుట    పా _ _ ము (7) పాదరసము  పా _ _ ము (8) పరమాన్నము పా _ _ ము (9) మహాపాపము పా _ _ ము (10) కిందిలోకము పా _ _ ము

కనుక్కోండి చూద్దాం

ఇక్కడున్న ఆంగ్ల పదాలకు అర్థాలు రాయండి. ముందున్న అక్షరంతో కలిపి చదివితే మరో పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి. 1. planet    వి _ _  2. country సం _ _ 3. picture  వి _ _ 4. song.     సం _ _ 5. past      స్వా _ _

నేనెవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'మీసం'లో ఉంటాను. 'మనం'లో ఉండను. 'ప్రమోదం'లో ఉంటాను. 'ఆమోదం'లో ఉండను. 'దానవుడు'లో ఉంటాను. 'మానవుడు'లో ఉండను. 'గాయం'లో ఉంటాను. 'గానం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'పాలు'లో ఉంటాను. 'మేలు'లో ఉండను. 'గోవు'లో ఉంటాను. 'గోడ'లో ఉండను. 'రంగు'లో ఉంటాను. 'హంగు'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?