Skip to main content

Posts

Showing posts from December, 2022

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?

 👉 ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం? 1. అరచేతిలో _ _ _ చూపినట్లు! 2. అతి వినయం _ _ _ లక్షణం! 3. ఆస్తి మూరెడు.. _ _ _ బారెడు! 4. ఎంత చెట్టుకు అంత _ _ ! 5. _ _ కు తగ్గ బొంత! 6. _ _ వచ్చి పిల్లను వెక్కిరించినట్లు! 7. తిన్న  _ _  వాసాలు లెక్కపెట్టినట్లు! 8. _ _ _ చించుకుంటే కాళ్ళపై పడటు!

ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం. ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి.

👉 కొన్ని తమాషా పదాలున్నాయి. కుడినుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం.ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి. మీరు వీటిని చదివాక.. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి సరేనా! 1. తల- లత 2. రమ మర 3. కలం- లంక 4. కడప- పడక 5. పడగ- గడప 6. పలక కలప 7. కరచు- చురక

నేను ఎవరినో తెలిసిందా?

 1. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4, అక్షరాలు కలిస్తే 'రెక్క' అనీ.. 1, 3, 4, 5 అక్షరాలు కలిస్తే 'పాడు' అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో తెలిసిందా? 2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 6, 8 అక్షరాలు కలిస్తే 'హానికరం' అనీ.. 5, 2, 6 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవర్ని?

1 నుండి100 వరకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో A ఎన్నిసార్లు వస్తుంది ?

 1 నుండి100 వరకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో A ఎన్నిసార్లు వస్తుంది. ఎలా అంటే O N E లో A లేదు ఇలాగే 1 నుండి 100 వరకు A ఎన్నిసార్లు వస్తుందో కనుకొని కామెంట్ చేయండి?

అయన అనుకొన్నవి ఎన్ని రూపాయలు మరియు ఎన్ని పైసలు?

 ఒక అతను బ్యాంక్ కు వెళ్ళి తను అనుకొన్న విధంగా కాకుండా పైసలను రూపాయలుగా మరియు రూపాయలను పైసలుగా చెక్కుమీద వ్రాసి డబ్బుతీసుకొన్నాడు.బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న బిక్షువుకు ఐదు పైసలు దానం చేసినాడు.ఇంటికి వెళ్ళిచూడగా తను అనుకొన్నదానికి రెట్టింపు డబ్బులున్నవి.అయన అనుకొన్నవి ఎన్ని రూపాయలు మరియు ఎన్ని పైసలు?

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు.

 తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు. 1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? జ. గ్రానైట్  2 ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?  జ న్యూస్ పేపర్. 3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?  జ. ఫైరింగ్ 4 అందరూ భయపడే బడి ఏమిటి? జ. చేతబడి 5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి? జ. పుస్తకాలు  6. వీసా అడగని దేశమేమిటి? జ. సందేశం. 7. ఆయుధంలేని పోరాటమేమిటి? జ. మౌనపోరాటం. 8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? జ. పకోడి 9. కనిపించని వనం ఏమిటి?  జ. పవనం.  10. నీరు లేని వెల్ ఏమిటి? జ. ట్రావెల్  11. నారి లేని విల్లు ఏమిటి? జ. హరివిల్లు 12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి?  జ. బ్లడ్ బ్యాంక్ 13. వేసుకోలేని గొడుగు ఏమిటి? జ. పుట్టగొడుగు. 14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? జ. బ్రౌన్ షుగర్  15. వేయలేని టెంట్ ఏమిటి? జ. మిలిటెంట్  16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి? జ. శిరోజాలు  17. రుచి లేని కారం ఏమిటి? జ. ఆకారం  18. చారలు లేని జీబ్రా ఏమిటి? జ. ఆల్జీబ్రా  19. అందరూ కోరుకునే సతి ఏమిటి? జ. వసతి. 20. అందరికి నచ్చే బడి ఏమిటి? జ. రాబడి. 21. తాజ్ మహల్ ఎక్కడుంది? జ. భూమ్మీద  22. ఇంటిక...

దానిలో ఒక అమ్మాయి పేరు ఉంది అది ఏమిటో మీరు చెప్పగలరా...???

 ప్రశ్న:-  ఎందుకు, వారు, అతడు, దానిలో ఒక అమ్మాయి పేరు ఉంది అది ఏమిటో మీరు చెప్పగలరా...??? Answer: (ఎందుకు, వారు, అతడు = వైదేహి (ఎందుకు, వారు, అతడు) పైన ఇచ్చిన మూడు పదాలలో ఒక అమ్మాయి పేరు ఉంది. ఎందుకు = why (వై) వారు = they (ధే) అతడు = he (హి )

ఈ క్రింది ప్రతి వాక్యంలో మూడేసి "జీవులు" దాక్కున్నాయి.కనిపెట్టండి చుద్దాం ?

 ఈ క్రింది ప్రతి వాక్యంలో మూడేసి "జీవులు" దాక్కున్నాయి.కనిపెట్టండి చుద్దాం  1). ఏది ఏమైనా ఈ ఉల్లిపకోడి వాసనకు ఆవులింతలాగిపోతాయి. 2). తుపాకి పేలుస్తానని ఖాసిం హంగామా చేసింది ఇప్పుడే గదా. 3). కిషోర్ గాడి దర్పం, కోపం దినందినం పెరుగుతున్నాయి. 4). నీతూ! నీ గదిలోనే ఏదో మందమతిలా ఏకాకిగా కూర్చోకు. 5). మేకప్ తీసేసి కుక్కర్ పెట్టేస్తే ఈ రోజింక పని లేనట్లే. 6). మా మేనత్త ఈ గదిలో వాచీ మర్చిపోయింది.

ఏ గది సురక్షితమైనది

👉 ఒక హంతకుడు మరణశిక్ష విధించబడ్డాడు. అతను మూడు గదుల మధ్య ఎంచుకోవాలి. మొదటిది రగులుతున్న మంటలతో, రెండవది లోడెడ్ గన్లతో ఉన్న హంతకులు, మూడవది 3 సంవత్సరాలలో తినని సింహాలతో నిండి ఉంది. అతనికి ఏ గది సురక్షితమైనది? సమాధానం : మూడవ గది, ఎందుకంటే ఆ సింహాలు మూడు సంవత్సరాలుగా తినలేదు, కాబట్టి అవి చనిపోయాయి.

నాలుగు అక్షరాల పదం - అర్ధం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే, విష్ణువు, మళ్లీ అలాగే చేస్తే భర్త. ??????

 నాలుగు అక్షరాల పదం - అర్ధం శివుడు, మొదటి అక్షరం తప్పిస్తే, విష్ణువు, మళ్లీ అలాగే చేస్తే భర్త. ??????

👉ప్రశ్న లోనే ఉన్నాయి ఆకు కూరలు and కూర గాయలు పేర్లు

Answer: ప్రశ్న ఆకుకూరలు మరియు కూరగాయలకుసంబంధించినది మరియు సరైన సమాధానాలు: 1. ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర  2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర  3. కాగితం చుడితే వచ్చే కూరగాయ  4 సమస్యలలో వున్న కూరగాయ  5. రెండు అంకెతో వచ్చే కూరగాయ  6.దారి చూపించే కూరగాయ  7. తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ  8. కష్టాలలో వున్న కూరగాయ  9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర  10. సగంతో మొదలయ్యే కూరగాయ  11. నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర  12. వనంలో వున్న ఆకుకూర  13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర  14. మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ  15. చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ  👉 జవాబులు -  (1). ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర ... గోంగూర  2. నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర ... చుక్క కూర 3. కాగితం చుడితే వచ్చే కూరగాయ... పోట్ల కాయ  4. సమస్యలలో వున్న కూరగాయ... చిక్కుడు కాయ  5. రెండు అంకెతో వచ్చే కూరగాయ.... దొండ కాయ  6. దారి చూపించే కూరగాయ ... Beetroot 7 తాళంచెవిని తనలో దాచుకున్న...

దొంగ ఏమి తీసుకుంటాడు?

 👉🧔ఒక దొంగ రాత్రి టైం లో నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఒక ఇంటి తలుపు కొద్దిగా తెరిచి ఉంది.. తలుపు సందులో నుండి ఆసక్తిగా లోపలికి చూసాడు.. మనుషులు ఎవరు కనపడలేదు కానీ ఎదురుగా రెండు డబ్బు కట్టలు, పక్కనే ఒక సెల్ ఫోన్ దేవుడి పటం ముందు రెండు వెండి కుందులు కనపడ్డాయి.. ఇంతకీ దొంగ ముందుగా వాటిలో ఏది ముందుగా తీసుకుంటాడో చెప్పండి?

చెప్పుకోండి చూద్దాం!

 చెప్పుకోండి చూద్దాం! ఒక వ్యక్తికి ఒక అలవాటు వుంది. అది ఏంటంటే డేట్ (తారీకు) ప్రకారం ఖర్చు పెడతాడు. "ఉదాహరణకు: ఈ రోజు డేట్ 29 కాబట్టి ఈ రోజు 29 రూపాయలు ఖర్చు పెడతాడు".అలా ఒకసారి వరుసగా 5 రోజుల్లో 63 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ 5 డేట్స్ (తారీకులు) ఏంటో చెప్పుకోండి చూద్దాం?

ఇక్కడున్న ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. అవేంటో కనుక్కోండి

 ఇక్కడున్న ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. అవేంటో కనుక్కోండి 1. తి_ప_ 2. మ_న_ల్లి 3. మ_బూ_న_ర్  4. కా_నా_ 5. వి_య_డ  6. బెం_ళూ_ 7. వి_ఖ_ట్నం 8. ని_మా_ద్ 

ఆ అబ్బాయి పేరేమిటి?

ఒక పెళ్ళి చూపులలో అమ్మాయి అబ్బాయిని నీ పేరేంటి అని అడిగింది. నా పేరు HALF DINNER అన్నాడు. ఇంతకు ఆ అబ్బాయి పేరేమిటి? మీకు తెలుసా? చెప్పుకోండి చూద్దాం?

ఆమె పేరు ఏమిటి?

 మెదడుకి మేత 👉 పెండ్లి చూపుల్లో పెండ్లి కూతురిని పేరు అడిగితే నీమోఖం లో లేనిది అని చెప్పింది. ఇంతకు ఆమె పేరు ఏమిటి ?

ఒక జంట పిక్నిక్ కి వెళ్లారు- మొత్తం ఎంతమంది వెల్లరు....?

 ఒక జంట పిక్నిక్ కి వెళ్లారు- వారికి " 7 "కొడుకులు" ప్రతి కొడుకుకి "3#చెల్లలు ప్రతి చెల్లికి "2"బిడ్డలు మొత్తం ఎంతమంది వెల్లరు....?

నేను ఎవర్ని 3?

 👉 నేనో మూడక్షరాల పదాన్ని. 'పాట'లో ఉంటాను. 'ఆట'లో ఉండను. 'మాయ'లో ఉంటాను. 'మాల'లో ఉండను. 'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని? 👉  నేను నాలుగక్షరాల పదాన్ని. 'కోటి'లో ఉంటాను. ''లో ఉండను. 'బడి'లో ఉంటాను. 'బలం'లో ఉండను. 'పుండు'లో ఉంటాను. 'పండు'లో ఉండను. 'రాజు'లో ఉంటాను. 'రాయి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

ఏంటది?

 చెప్పగలరా? 👉 నల్లని రూపం..  ఒకటే తల..  నాలుగు 3 చెవులు..  కర్ర ముక్కలా ఉంటుంది..  తింటే కరకరలాడుతుంది..  నాలుక చురచుర మంటుంది...  ఏంటది?

నేను ఎవర్ని

 గుండ్రంగా వుంటాను నేను బంతిని కాదు ..O..O కింద పడితే పగిలి పోతాను గుడ్డును కాదు 00 ఆడవాళ్లకు మాత్రమే......... ఉపయోగపడతాను  నేను ఎవర్ని???????

ఎవరు ఆవిడ ?

👉 చెప్పుకోండి చూద్దాం  👉 అనగనగా ఓ అప్సరస    పేరులో మధ్య అక్షరం తీసేస్తే 'మేక' వస్తుంది. ఎవరు ఆవిడ?

పెళ్లి కూతురు పేరేమిటి ?

 ఒక పెళ్లి కొడుకు, పెళ్ళి చూపులకు వెళ్ళాడు.. అక్కడ అమ్మయి ని "పేరేమిటి " అని అడిగాడు.. దానికి ఆ అమ్మాయి సాసర్ లో టీ కప్ బోర్లించి.. ఇదే నా పేరు అన్నది.పెళ్లి కూతురు పేరేమిటి ?

ఒక అమ్మాయి saving ఎంత చెప్పుకోండి చూద్దాం

 👉 ఒక అమ్మాయి తనకు 20 సంవత్సరాల వయసులో ఒక హుండీ కొని అందులో తనప్రతి పుట్టినరోజు నాడు 250రూపాయిలు వేసేది. తనకితెలియకుండా ఆమె చెల్లెలుప్రతి సంవత్సరం 50రూపాయిలు తీసేసేది. 60సంవత్సరల వయసులో ఆమె చనిపొయింది. తరువాత  హుండీలో చూస్తే 500 రూపాయిలుమాత్రమే ఉన్నాయి. అందులో వేసినవి  ఎంత? తనచెల్లెలు తీసినవి ఎంత?​ 👉 జవాబు. పుట్టినరోజు ఫిబ్రవరి 29 న 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు - 10 పుట్టినరోజులు =>10 × 250 = 2500 rs సోదరి తీసివేయబడింది = 40 × 50 = 2000 రూ. మిగిలినది = 2500 - 2000 - రూ.500

ఇక్కడి వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా గమనించి, అవేంటో కనిపెట్టగలరా?

 వాక్యాల్లో వ్యక్తుల పేర్లు 👉 ఇక్కడి వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా గమనించి, అవేంటో కనిపెట్టగలరా? 1. అసలే ఇది కార్తిక మాసం. శివాలయాల్లో చాలా రద్దీగా ఉంటుంది  2. విసిగించకుండా రారా.. జున్ను పాలు ఎంత బాగున్నాయో చూడు! 3. పాడైనవీ, నచ్చనివన్నీ ఒక సంచిలో వెయ్యి.. బయట పారేసివద్దాం. 4. అక్షరం విలువ తెలుసుకుంటే.. బడి ఎగ్గొట్టి సమయాన్ని వృథా చేసేవాడివి కాదు. 5. ఆహా.. ఎక్కడి నుంచో వినిపిస్తున్న  ఆ వేణుగానం ఎంత బాగుందో కదా!  6. కిన్నెరసాని ప్రాజెక్టుకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది.

అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి

 ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి చెప్పుకోండి చూద్దాం? 1. షంమాను 2. యంనవీమాఅ 3. డుచరునుఅ  4. రణగనుచ 5. నంనుమాఅ 6. రణఅకను

తెలుగు+ENGLISH+గణితం=అమ్మాయి పేరు

తెలుగు+ENGLISH+గణితం=అమ్మాయి పేరు  ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆమె పేరు అడిగాడు, అప్పుడు ఆమె పేరులోని మొదటి అక్షరం తెలుగులో రెండవ అక్షరం ఇంగ్లీషులో మరియు మూడవ అక్షరం గణితంలో ఉంటుందని ఆమె సమాధానమిచ్చింది.  అమ్మాయి పేరు ఏమిటి?

కనుక్కోండి చూద్దాం

👉 ఒక CID ఆఫీసర్ ఒక ఫోన్ నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది. అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు. కథ :    👉  మా వూరిలో శ్రీ రామనవమి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు.  ఈ కథలో ఫోన్ నంబర్ ఉంది. Answer it genious .... ??? జవాబు రామనవమి = నవమి = 9 అష్టాచెమ్మ = అష్టా = 8, and చెమ్మ = 4 పది వేలు = 10,000 వారం = 7 రెండు = 2. => 9841000072. or రామనవమి = నవమి = 9 అష్టాచెమ్మ  = 8 Every year ... 12 పది వేలు = 10 Chattis ... 36 (hindi) వారం = 7 రెండు = 2. => Ph.No:9812103672

నేనెవరో చెప్పుకోండి చూద్దాం

 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'కన్ను'లో ఉంటాను కానీ 'మిన్ను'లో లేను. 'నుదురు'లో ఉంటాను కానీ 'బెదురు'లో లేను. 'బొరియ'లో ఉంటాను కానీ 'కొండచరియ'లో లేను. 'కొమ్మ'లో ఉంటాను కానీ 'కొమ్ము'లో లేను. 'మేలు'లో ఉంటాను కానీ 'మేకు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కిస్తీ'లో ఉంటాను కానీ 'కుస్తీ'లో లేను. 'రీలు'లో ఉంటాను. కానీ 'కీలు'లో లేను. 'పటం'లో ఉంటాను కానీ 'పఠనం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

పొడుపు కథ

 పొడుపు కథ పొద్దున్నే తలుపు తట్టి ఉత్సాహాన్నిస్తాను. జీతం తీసుకోకుండా శుభ్రం చేస్తాను. ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచుతాను. నేనెవరిని? చెప్పుకోండి చూద్దాం..!

చెప్పుకోండి చూద్దాం

 చెప్పగలరా? 1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 1, 6 అక్షరాలను కలిపితే 'యుద్ధం' అవుతాను. 2, 5, 4 'అక్షరాలు కలిస్తే 'కొత్త'గా ఉంటాను. ఇంతకీ నేను ఎవరో తెలిసిందా? 2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడు అక్షరాలు 'ముగింపు'ను సూచిస్తే.. 1, 3, 5, 6 అక్షరాలు 'కనుగొను' అనే అర్ధానిస్తాయి. నేను ఎవరిని?

మెదడకు మేత చెప్పుకోండి చూద్దాం

 👉ఒక జంతుప్రదర్శనశాలలో జింకలు మరియు నెమళ్ళు ఉన్నాయి. తలలను లెక్కిస్తే వాటి సంఖ్య 80. వాటి కాళ్ల సంఖ్య 200. నెమళ్లు ఎన్ని ఉన్నాయి?