Skip to main content

Posts

Showing posts from March, 2023

ఆసక్తికరమైన చిక్కులు

ఆసక్తికరమైన చిక్కులు 1. చెట్టు మీద పండు, పండు మీద చెట్టు? 2. అత్యంత షాకింగ్ నగరం ఏది? 3. ఏ విల్లు కట్టకూడదు? 4. ఏ పందెం ఎప్పుడూ గెలవదు? 5. ఎలాంటి దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు? 6. ఏ నౌకలో ఇద్దరు సహచరులు ఉన్నారు, కానీ కెప్టెన్ లేరు? 7. నిత్యం కన్నీళ్లు పెట్టుకునే శ్వేతజాతి? 8. మీరు దానిని ఎంత ఎక్కువగా తీసుకుంటే, అంత ఎక్కువగా వదిలివేస్తారా? 9. స్కేల్‌లను కలిగి ఉంటుంది కానీ కొలవలేనిది ఏది? 10. ఏ రెండు కీలు ఏ తలుపులను తెరవలేవు? 11. ఆస్ట్రేలియా మరియు అమెరికా రెండింటి మధ్యలో ఏది కనుగొనబడింది? 12. శుభ్రంగా ఉన్నప్పుడు నలుపు మరియు మురికిగా ఉన్నప్పుడు తెలుపు ఏమిటి?

ఒప్పులు ఏవో... తప్పులు ఏవో

ఒప్పులు ఏవో... తప్పులు ఏవో.. నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం. (1) యోగాశనం (2) గీతాలాపణ (3) మాయాజాళం (4) మంత్రజలం (5) మామిడితోరణం (6) పర్యావరనం (7) వానరసేన (8) పరివర్దన

నేనెవరోతెలుసా

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పట్నం'లో ఉన్నాను కానీ 'రాట్నం'లో లేను. 'చిట్టి'లో ఉన్నాను కానీ 'చిన్ని'లో లేను. 'కత్తి'లో ఉన్నాను కానీ 'సుత్తి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?  2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'భారం'లో ఉన్నాను కానీ 'ఘోరం'లో లేను. 'గరుకు'లో ఉన్నాను కానీ 'బెరుకు'లో లేను. 'స్వార్థం'లో ఉన్నాను కానీ 'అర్థం'లో లేను. 'భూమి'లో ఉన్నాను కానీ 'భూతం'లో లేను. నేనెవర్ని?

నేను లేకుండా ఎవరూ చదవలేరు ? నేనెవరిని?

👉 దీన్ని పరిష్కరించండి, మీరు తెలివైన వారైతే..... 1. నా దగ్గర 9 అక్షరాలు ఉన్నాయి..... 2. నేను లేకుండా ఎవరూ చదవలేరు....📖 3. 4+5+6 ఒక జంతువు...🐼 4. 7 నేను....👦 5. 3 నీ...👮 6. 2+8+9+1 పూర్తయింది...👍 నేను ఎవరు ? EDUCATION

బకెట్ బరువు ఎంత?

👉 నీరు నిండిన బకెట్ బరువు 35 కిలోలు సగం నీటితో నిండిన బకెట్ బరువు 21 కిలోలు. 👉 అయితే ఖాళీ బకెట్ బరువు ఎంత ? A) 14 B) 7 C) 28 D) 6

కోళ్ళ సంఖ్య ఎంత ? మేకలు సంఖ్య ఎంత ?

ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు. మేకలు ఉన్నాయి. వాటన్నింటికి 90 తలలు, 224. కాళ్ళు ఉన్నాయి. అయితే..కోళ్ళ సంఖ్య ఎంత ??? మేకలు సంఖ్య ఎంత ???

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం -7

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జాలి'లో ఉంటాను కానీ 'గాలి'లో లేను. 'మత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'కారం'లో ఉంటాను కానీ 'దారం'లో లేను. 'యజ్ఞ'లో ఉంటాను కానీ 'ప్రతిజ్ఞ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? 2. నేను మూడు అక్షరాల పదాన్ని 'పులుసు'లో ఉంటాను కానీ 'అలుసు'లో లేను. 'పట్నా'లో ఉంటాను కానీ 'పట్టణం'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

నా మొదటి అక్షరాన్ని తీసివేయండి మరియు నేను ఇప్పటికీ అదే ధ్వనిస్తున్నాను. నా చివరి అక్షరాన్ని తీసివేయండి, నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను. నేను ఐదు అక్షరాల పదం. నేను ఏంటి?

మీరు మొదట ఏమి తెరుస్తారు?

 ఒక రోజు తెల్లవారుజామున 3:00 AM. నేను నిద్రపోతున్నావు. డోర్ బెల్ మోగుతుంది. అది మీ కుటుంబం, వారు అల్పాహారం చేయాలనుకుంటున్నారు. వారి వెంట స్ట్రాబెర్రీ జామ్ బాటిల్, బ్రెడ్ ప్యాకెట్, తేనె బాటిల్, జ్యూస్ బాటిల్, మిల్క్ బాటిల్ ఉన్నాయి. కాబట్టి, మీరు మొదట ఏమి తెరుస్తారు?

ఒకే ఒక అక్షరం కనుక్కోండి చూద్దాం

👉 ఒక పదం 'మ'తో అంతమైతే, రెండో పదం 'మ'తోనే మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం... ఆ పదాలేంటో కనుక్కొని, ఖాళీ గడులను పూరించండి  1. అమ్మ సోదరుడు  []మ[][]   హృదయం లాంటిది 2. అద్భుత శక్తి         [][]మ[][] నరుడు మరోలా.. 3. ఓ వస్త్రం               [][]మ[][] పరాయివాడు కాదు 4. ఓ ఫలం               [][]మ[][] నెమలి 5. రక్తం పీలుస్తుంది    []మ[] యంత్రం  6. శ్రమ జీవి              []మ[][] ఓ భారతీయ భాష 7. నీటి జాడ             []మ[][] మురికి ఇంకోలా..

మీరు దానిని పోగొట్టుకుంటే మీరు చనిపోతారు ?

👉 ఇది 9 అక్షరాల ఆంగ్ల పదం- 123456789, మీరు దానిని పోగొట్టుకుంటే మీరు చనిపోతారు, మీకు 234 ఉంటే, మీరు 1234 చేయవచ్చు, 56 అనేది ఒక రకమైన వ్యాధి, 89 ఖచ్చితమైన స్థానం & సమయాన్ని సూచిస్తుంది, 2 & 7 ఒకే అక్షరం, 3 & 8 ఒకే అక్షరం, 5 & 9 ఒకే అక్షరం. పదం ఊహించు!? HEARTBEAT

జత ఏది కనుక్కోండి చూద్దాం

జత ఏది? ఇక్కడ కొన్ని పదాలున్నాయి. సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే. 1. అరటి            ఎ. మొద్దు      2. మామిడి        బి. డెక్క 3. చింత             సి. చెక్క 4. గురపు            డి. మొక్క 5. నిమ్మ             ఈ. టెంక 6. తుమ్మ           ఎఫ్. తొక్క 7. గులాబి            జి. పొట్టు 8. పనస              హెచ్. పిక్క

ఒకే లాంటి అర్థం చెప్పుకోండి చూద్దాం

👉 ఈ ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1) రాసేది         _లం 2) సాగు భూమి _లం 3) నాగలి          _లం 4) ఓ కవి పేరు   _లం 5) ఆయుధం      _లం 6) పండు          _లం 7) నీరు            _లం 8) శక్తి.                _లం

పదాల సందడి

పదాల సందడి! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. నడక కాదు.                 _రుగు 2. పాల నుంచి వస్తుంది.    _రుగు 3. కీటకం మరోలా.            _రుగు 4. తగ్గిపోవడం.                 _రుగు 5. నీటిని వేడి చేస్తే.             _రుగు 6. దుర్వాసనకు కారణం.     _రుగు 7. సబ్బు నుంచి వస్తుంది    _రుగు 8. కుక్క అరవడం.              _రుగు

నేనెవర్ని - 9

1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'పండు'లో ఉంటాను. 'పుండు'లో ఉండను. 'చలి'లో ఉంటాను. 'పులి'లో ఉండను. 'దాడి'లో ఉంటాను. 'బోడి'లో ఉండను. 'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను. 2. నేనో మూడు అక్షరాల పదాన్ని. 'పాము'లో ఉంటాను. 'గోము'లో ఉండను. 'మాయ'లో ఉంటాను. 'మామ'లో ఉండను. 'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?

ఆ తీపి పదార్థాలను కనుక్కోండి చూద్దాం

హుష్.. గప్ చుప్ | ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే, కొన్ని తీపి పదార్థాల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. I. _ సూ _ పా _ 2. త _ కు _  3. అ _ సె _ 4. _ న్నుం _ లు 5. ర _ కే _ _ 6. _ లే _

గజి బిజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. (1).  రణఅకను (2).  నంనుమాఅ (3).  డుచరునుఅ (4).  యంనవీమాఅ (5).  షంమాఅను (6).  రణంఅగనుచ

Science సార్ ఏమంటారు

👉 ఒక స్కూల్ లో దొంగ పడ్డాడు.  👉 తెలుగు సార్ దొంగ అన్నాడు. 👉 హిందీ సార్ CHORE అన్నాడు.  👉 ఇంగ్లీష్ సార్ THIEF అన్నాడు.  👉 మాథ్స్ సార్ 420 అన్నాడు.  👉 సోషల్ సార్ దోషి అన్నాడు మరి ..... 👉 Science సార్ ఏమంటారు ?

అన్నిటికి ఒకే ఒక అక్షరం...చెప్పుకోండి చూద్దాం

ఒకే ఒక అక్షరం! ఖాళీగా ఉన్న గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి. ఓసారి ప్రయత్నించి చూడండి. 1. _ రగతి గదిలో  _ మాషాలు చేస్తున్నావా... _ రుణ్? 2. మా _ డ మీద _ కతో  _ మంతా నిన్న ఆడుకున్నాం తెలుసా! 3. చ _ ణ్ వాళ్ల పె _ ట్లో  అ _ టి మొక్కలు నీళ్లు లేక వాడిపోయాయి. 4. నువ్వు, మీ అక్క తే _ కలిసి, రో _ కు ఎన్ని సార్లు _ న్ను  తింటారో చెప్పండి. 5. గో _ ల్... ఆ మైసూర్ _ క్ తర్వాత.. ముందు ఈ  _ యసం రుచి చూడు. 6. _ వితా.. పొలం వెన _ ఉన్న ఆ బావి నిండా _ ప్పలే  ఉన్నాయి. 7. అది _ ... మన _ పీ.. నువ్వెళ్లి కొన్ని _ ధుమ రొట్టెలు ఇచ్చిరా సరేనా!

👉 పెన్సిల్, టమోటో లారీ, ట్రాక్టర్👉 ఈ ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఏమంటారో చెప్పుకోండి చూద్దాం..!

👉 పెన్సిల్, టమోటో లారీ, ట్రాక్టర్ 👉 ఈ ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఏమంటారో చెప్పుకోండి చూద్దాం..!

గజి బిజి - 3

గజిబిజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. I. శరరేసఖ 2. రణికమమత 3. రచణివా 4. గంపోసుడా 5. రారమమలు 6. ధుపింగోమడి 7. కోచెలు 8. కుతరేపూలు 9. సంవవాన

అటు ఇటు ఒక్కటే

అటు ఇటు ఒకటే! రెండు ఖాళీ గడుల్లో ఒకే ఒక ఆంగ్ల అక్షరం రాయండి. అర్థవంతమైన పదం వస్తుంది. 1. _ hoe _ 2. _ oas _ 3. _ dg _ 4. _ ul _ 5. _ oca _ 6. _ um _ 7. _ oa _ 8. _ ic _ 9. _ ig _ 10. _ ars _

ఈ లెక్క కనుక్కోండి చూద్దాం

👉 ఈ రోజు ఉదయం నుండి నా మైండ్ పనిచేయడం లేదు. - ప్రొద్దును ఒక లెక్క నన్ను తికమక పెట్టింది. 👉 నేను ప్రొద్దున్న మార్కెట్ చేయవలసి వచ్చింది.  కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా మిత్రుడు దగ్గర 1000 రూం అప్పుగా తీసుకున్నాను. కానీ అది ఎక్కడో పడిపోయింది. 👉 మళ్ళీ ఇంకో మిత్రుడు దగ్గర 500 రూ॥ తీసుకున్నాను. దానితో 300 రూ. మార్కెట్ చేశాను. మిగిలిన 200 రూ, నాను అప్పుగా ఇచ్చిన ఇద్దరు మిత్రులకు తలో 100 రూ. ఇచ్చేశాను. 👉 ఇప్పుడు మొదటి మిత్రునుకి = 900 👉 రెండవ మిత్రుమని = 400 👉 ఇద్దరికీ నేను హాకీ భడిన మొత్తం = 1300(900+400) 👉 మార్కెట్ ఖర్చు = 300 👉 మొత్తం ఖర్చు = 1600 👉 కానీ నేను తీసుకున్నది = 1500 రూ. మాత్రమే 👉 అయితే 100 రుపాయులు ?

ఈ ఆధారాల సాయంతో గడులను పూరించండి.అర్థవంతమైన పదాలు వస్తాయి

ఈ ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. రాసేది          _ _ లం 2. పండు.          _ _ లం 3. ఓ కవి పేరు   _ _ లం 4. ఆయుధం.    _ _ లం 5. నాగలి.          _ _ లం 6. సాగు భూమి  _ _ లం 7. శక్తి.               _ _ లం 8. నీరు.              _ _ లం

నేనెవర్ని -6

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'మూసీ'లో ఉన్నాను కానీ 'మూస'లో లేను. 'తాటి'లో ఉన్నాను కానీ 'కోటి'లో లేను. 'ఫణి'లో ఉన్నాను కానీ 'మణి'లో లేను. 'బలం'లో ఉన్నాను కానీ 'బల్లి'లో లేను. ఇంతకీ నేనెవర్ని?చెప్పుకోండి చూద్దాం? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'కుండ'లో ఉన్నాను. కానీ 'బండ'లో లేను. 'దేహం'లో ఉన్నాను కానీ 'దాహం'లో లేను. 'వేలు'లో ఉన్నాను కానీ 'వేరు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా? చెప్పుకోండి చూద్దాం?

తప్పులే తప్పులు

తప్పులే తప్పులు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. కానీ, అవి తప్పు. వాటిని సరిజేసి రాయగలరా? 1. దుర్మార్హుడు 2. ఆకాసం 3. పధమాలిక 4. అసామాన్వుడు 5. పగతి 6. కోలాహాలం 7. పదనిసలూ 8. విహంగవీక్షనం