Skip to main content

Posts

Showing posts from June, 2023

Last లో కాయ అనే పదం వస్తాయి

ఇక్కడ ఉన్న ప్రశ్నలకు బాగా ఆలోచించి, సరైన జవాబులు చెప్పండి చూద్దాం. 1. దీపావళికి పేల్చేది? 2. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది? 3. మన ప్రాణానికి ఆధారమైంది? 4. చిన్నారులు ఆడుకునేది? 5. పొట్టలో తీపి ఉండే పిండి వంటకం? 6. బడిలో టీచర్లు ఇచ్చేది? 7. ఎక్కువ మాట్లాడేవారిని ఇలాగంటారు. 8. తప్పు చేస్తే ఇది లేదంటారు. 9. చేతులకు ముళ్లు, పొట్టలో పళ్లు దాచుకున్నదేది? 10. తల కింద ఉండేది ?

గజి బిజి గా ఉన్నాయి సరి చేయండి

గజిబిజి బిజిగజి! ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. 1. జుమరాహా 2. మామంరదాల 3. యివుపారా 4. రంరతీగసా 6. యకారపమి 7. మియిచుపీఠా 8. ఇంవతారవా

ఆ అమ్మాయి ఏమని చెప్పింది

👉అబ్బాయి 143 అని చెప్పాడు, 👉అమ్మాయి 25519 అని ప్రత్యుత్తరం ఇచ్చింది,  👉అంకెలను ట్రేస్ చేయండి లేదా 👉వారు ఒకరికొకరు ఏమి చెప్పుకుంటారు?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'శుభం'లో ఉంటాను కానీ 'లాభం'లో లేను. 'క్రయం'లో ఉంటాను కానీ 'భయం'లో లేను. 'వాత'లో ఉంటా కానీ 'కోత'లో లేను. 'రంపం'లో ఉంటాను. కానీ 'కోపం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'అర'లో ఉంటాను కానీ 'కర'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'పుణ్యం'లో ఉంటాను కానీ 'పురం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నేను అయిదక్షరాల పదాన్ని. 'అల'లో ఉంటాను. `వల'లో ఉండను. `రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను. 'టిప్పు'లో ఉంటాను. 'అప్పు'లో ఉండను. 'పంది'లో ఉంటాను. 'పది'లో ఉండను. 'కీడు'లో ఉంటాను. 'కీలు'లో ఉండను. ఇంతకూ నేనెవర్ని? 2. నేనో మూడక్షరాల పదాన్ని. 'పదం'లో ఉంటాను. 'పాఠం'లో ఉండను. 'వరం'లో ఉంటాను. 'కారం'లో ఉండను. 'మైనం'లో ఉంటాను. 'మైనా'లో ఉండను. ఇంతకూ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'చింత'లో లేను. 'గీత'లో ఉంటాను కానీ 'రాత'లో లేను. 'గతం'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'వరద'లో ఉంటాను కానీ 'బురద'లో లేను. 'యముడు'లో ఉంటాను కానీ 'భీముడు'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

గజి బిజి

బిజగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లలసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. సనక 8. షేజభికంలా

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి

👉 ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి 1) గోదా _ _  నది... చి _ _ కి బంగాళాఖాతంలో కలుస్తుంది. 2) పగటి సమయంలో వచ్చిన _ _ గురించి ఎందుకంత _ _ వర పడుతున్నావు? 3) తర _ _ గదిలో కాదు... నా సం _ _  పరీక్షల్లో చూపిస్తాను. 4) వ్యవ _ _ తోనే ప్రగతి సాధ్యమని గ్రహించి, ప్రభుత్వాలు మరింత _ _ అందించాల్సి ఉంది. 5) _ _ లీగలు కుట్టడంతో.. చిన్నూ బుగ్గలు మొత్తం _ _ పోయాయి. 6) మనం రోజూ ఆడుకునే మై _ _ లో రేవు అన్న _ _ ఉందట.

నేను ఎవరు చెప్పుకోండి చూద్దాం

నేను 8 అక్షరాల పదం. నేను అందరి నుండి రహస్యంగా ఉంచుకుంటారు. నా 2వ, 3వ, 4వ అక్షరం యానిమల్ స్పెల్లింగ్. నా 4వ, 5వ, 6వ, 7వ, 8వ అక్షరం ఒక ఆయుధం. నా 1వ, 2వ, 8వ అక్షరాలు పరీక్ష రాయడానికి ఉపయోగించబడతాయి. నా 3వ, 4వ అక్షరాలు ఒకటే. "నేను ఏమిటి అని ఊహించు" ??

నేను ఎవరు?

👉 నేను ఆంగ్ల భాషలో ఒక పదం,  👉 అందులో మొదటి రెండు అక్షరాలు పురుషుడిని, 👉 మొదటి మూడు స్త్రీలను సూచిస్తాయి, 👉 మొదటి నాలుగు గొప్ప వ్యక్తిని సూచిస్తాయి 👉 మరియు మొత్తం పదం గొప్ప స్త్రీని సూచిస్తుంది. 👉 అయితే పదం ఏమిటి?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు ఇక్కడి వాక్యాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని వెతికి పట్టుకోండి చూద్దాం.. 1. బయటకు రా.. ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి! 2. ఇంద్రధనుస్సును చూస్తే అందరి మనసు.. వర్ణరంజితంగా అవుతుంది. 3. మల్లెపూల మాల తిరిగి సరిగ్గా అల్లు... 4. 'ఇంటికి వెళ్లిపోరా.. జులాయిగా తిరగకు' అని అమ్మ కోప్పడింది. 5. అందరం భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులు వేయాలి.

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'చక్కిలి'లో ఉంటాను కానీ 'మిక్కిలి'లో లేను. 'పులి'లో ఉంటాను కానీ 'పుల్ల'లో లేను. 'గారె'లో ఉంటాను కానీ 'బూరె'లో లేను. 'బలి'లో ఉంటాను కానీ 'బరి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'జట్టు'లో ఉంటాను కానీ 'గుట్టు'లో లేను. 'పల్లె'లో ఉంటాను కానీ 'పల్లం'లో లేను. 'దడ'లో ఉంటాను కానీ 'దడి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని బొమ్మలూ, ఆంగ్ల అక్షరాలూ ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న గణిత గుర్తుల ఆధారంగా వచ్చే పదమేంటో కనుక్కోండి చూద్దాం.

ప్రాంతాల పేర్లు దాగి ఉన్నాయి

👉 ఇక్కడున్న వాక్యాల్లో ప్రాంతాల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం. 1. అతడి పేరు మధు. రకరకాల పక్షులు, జంతువుల గొంతులను మిమిక్రీ చేయగలడు. 2. పరశురాం.. చీమలు, తమ కంటే 20 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు తెలుసా..!

కీటకాలు పేర్లు దాగున్నాయి

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని కీటకాల పేర్లు దాగున్నాయి. అవేంటో వెతికి కనిపెట్టండి చూద్దాం. 1. కొరియర్లో వచ్చిన ఆ బహుమతి ఎవరిదో.. మన మురారికే తెలియాలి. 2. నల్లమల అడవులకు ఆనుకొని ఉండే ఈగలపెంట గ్రామం వద్ద కృష్ణా నది అందాలను వర్ణించలేం. 3. అగ్గితెగులు, పేనుబంక.. పంటలకు వచ్చే ఈ తెగుళ్ల పేర్లన్నీ వ్యవసాయంతో అనుబంధం ఉన్నవాళ్లకే తెలుస్తాయి. 4. చెల్లి ఎందుకు పేచీ.. మనిద్దరం కలిసి బయటకు వెళ్లివద్దాం పద..

నా పేరు F తో ప్రారంభమవుతుందినేను అడవిలో ఉంటానునేను తెలివైనవాడినినేను ఎవరు?

నా పేరు F తో ప్రారంభమవుతుంది నేను అడవిలో ఉంటాను నేను తెలివైనవాడిని నేను ఎవరు?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అట్టు'లో ఉంటాను కానీ 'తిట్టు'లో లేను. 'వేటు'లో ఉంటాను కానీ 'వేట'లో లేను. 'కుళ్లు'లో ఉంటాను కానీ 'ఇళ్లు'లో లేను. 'మైలు'లో ఉంటాను కానీ 'మైకు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'నెయ్యి'లో ఉంటాను కానీ 'గొయ్యి'లో లేను. 'మన్యం'లో ఉంటాను కానీ 'సైన్యం'లో లేను. 'చలి'లో ఉంటాను కానీ 'చట్నీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

చిక్కు ప్రశ్న

👉 ఒక పుస్తకం వెల 3 రూపాయలు.  👉 పెన్సిల్ వెల అర్ధ రూపాయి.  👉 100 రూపాయలకు 100 పుస్తకాలు కొనాలి. ఎలా?(జవాబు : 20 పుస్తకాలు 60 రూపాయలు, 80 పెన్సిళ్ళు 40 రూపాయలు, 100 వస్తువులు 100 రూపాయలు)

నేనెవరు చెప్పుకోండి చూద్దాం (25)

1) 4 అక్షరాల పదాన్ని. కానుక అని అర్థం. మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ, చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?(బహుమతి) 2) నేను 6అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,2,3,5,6  కలిపితే అధికారం అని అర్థం. అలా 6,5,4 కలిపితే ఎరుపు, 3,2,6,4 - పదం. అయితే ఇంతకీ ఎవరు నేను?(POWER) 3) నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,6,5,7  కలిపితే వ్యాపార కేంద్రం, 1,2,3,4  - పద్దతి, 5,6,7,8 - వెల  అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(moderate) 4) నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,7,8,3,2  కలిపితే తప్పు, 2,7,3,4 - తూర్పు, 6,5,4,7,8 - ముఖ్యమైన, 1,7,3,4 - వేగం   అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(festival) 5) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో మొదటి రెండు అక్షరాలు  కలిపితే తోటి అని అర్థం, 4,5,6  - ఓ రుచి, 1,4,5  - హారము  అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(సహకారము) 6) నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 4,5,6 కలిపితే కొడుకు, 3,5,1,2 - తాడు, 5,1,2,6 - తెరచుట, 1,2,5,6 - బంట్రోతు  అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(Person) 7) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1...

నేనెవరో తెలుసా చెప్పుకోండి చూద్దాం

నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 3, 4 కలిపితే 'నేను' అని అర్థం. అలాగే 5, 1, 2 కలిపితే ఎవరు అని. 3, 6, 7, 4 కలిపితే 'ఎక్కువ' అని అర్ధాలొస్తాయి. ఇంతకీ నేనెవర్నో గుర్తుపట్టారా ?

గజి బిజి

గజిబిజి బిజిగజి! ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి try చేయండి  (1) మకచిరాలు (2) రరామమలు (3) తిగమింలం (4) కోకూడిర (5) పాపాటుర (6) సింనంసహా (7)జుజరాగ (8) వుయిరాపా 

పొడుపు కథలు

పొడుపు కథలు! 1. రాళ్ల అడుగున విల్లు. విల్లు కోనలో ముళ్లు. ఏంటో తెలుసా? 2. సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. ఊళ్లోకి వచ్చి మాత్రం అరుస్తుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 3. కోస్తే తెగదు. కొడితే పగలదు. ఏమిటో తెలుసా? 4. మీకు సొంతమైందే కానీ.. మీ కన్నా.. ఇతరులే దాన్ని ఎక్కువగా వాడతారు. ఇంతకీ ఏంటది?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పత్తి'లో ఉన్నాను కానీ 'సుత్తి'లో లేను. 'తాడు'లో ఉన్నాను కానీ 'మోడు'లో లేను. 'కంది'లో ఉన్నాను కానీ 'పంది'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?  2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కీర్తి'లో ఉన్నాను కానీ 'ఆర్తి'లో లేను. 'ఆట'లో ఉన్నాను కానీ 'ఆరాటం'లో లేను. 'కారం'లో ఉన్నాను కానీ 'ఘోరం'లో లేను. 'రైలు'లో ఉన్నాను కానీ 'రైతు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

కనుక్కోండి చూద్దాం

ఈ HINTS ఉపయోగించి ఐదు అంకెల కోడ్ _ _ _ _ _ని కనుక్కోండి. 8 2 6 1 9 => రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పు స్థానంలో 4 7 5 3 0 => మూడు సంఖ్యలు సరైనవి కానీ తప్పు స్థానంలో 8 6 3 0 2 => రెండు సంఖ్యలు సరైనవి, ఒకటి సరైన స్థలంలో & ఒకటి తప్పు స్థలం 9 1 7 0 4 => రెండు సంఖ్యలు సరైనవి & సరైన స్థలంలో 7 0 6 2 9 => ఒక నంబర్ సరైనది & సరైన స్థలంలో మీలో ఎవరు తెలివైనవారో చూడండి !!