పొడుపు కథలు కాటుక రంగులో ఉంటాను, కమలాన్ని పోలి ఉంటాను. విప్పితే పొంగుతాను. ముడిస్తే కుంగిపోతాను. నేనెవరు? గొడుగు పండునే కానీ, నన్ను తినలేరు నా పిల్లల్ని తింటారు. నన్ను గుర్తు పట్టారా? పనస పండు వేర్వేరు రంగుల్లో, ఆకారాల్లో ఉండే నేనంటే పిల్లలకు ఎంతో ఇష్టం. నన్ను సులభంగా ఎత్తుకోగలరు. వదిలితే మాత్రం పారిపోతాను. నేనెవరు? బెలూన్ నలుపు-తెలుపు రంగుల్లో ఉంటాను.రెక్కలున్నా ఎగరలేను, పక్షినే అయినా ఈత కొట్టగలను. నా పేరేంటి? ఎర్రని ముక్కు, తెల్లని వొళ్ళు, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది? క్రొవ్వొత్తి తాళి గాని తాళి, ఏమి తాళి? ఎగతాళి తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు? గడియారం ముళ్ళు తిరిగే దీపము, గాలి-వానకు ఆగని దీపము, చమురులేని దీపము, పిట్టల దీపము? మిణుగురు పురుగు జారు కాని జారు, ఏమి జారు? బజారు జాబు కాని జాబు, ఏమి జాబు? పంజాబు తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!? విభూతి డ్రస్ కాని డ్రస్, ఏమి డ్రస్? అడ్రెస్ టూరు కాని...